Jump to content

వాడుకరి చర్చ:Po.indicwiki

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Po.indicwiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Po.indicwiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:రవిచంద్ర గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు రవిచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 15:44, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ వికీ ప్రయోగవ్యాసాలు

[మార్చు]

Po.indicwiki గారు, మీ ప్రయోగశాలకు ఉపపేజీలలో వ్యాసాలు చేర్చటం గమనించాను. కొద్ది సంఖ్యలో వ్యాసాలు చేర్చి రచ్చబండలో చర్చ ప్రారంభించితే మంచిది. అర్జున (చర్చ) 09:49, 29 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే Arjunaraocగారు, మీ సూచనకు ధన్యవాదాలు సాంకేతిక సహకారంతో రూపొందించిన వ్యాసాలు కూడా చేర్చిన తరువాత రచ్చబండ లో చర్చ ప్రారంభిస్తాం Po.indicwiki (చర్చ) 10:08, 29 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Po.indicwiki గారు, ఒక్కో విభాగం చర్చించిన తరవాత ఇంకో విభాగం చేపట్టటం మెరుగు. అలాగే వీటిని మీ ప్రాజెక్టు పేజీకి ఉపపేజీగా తరలించటం దారిమార్పు లేకుండా చేయటం మెరుగు. వాడుకరి ఉపపేజీలు తొలగింపులకు గురయ్యే అవకాశంముంది. --అర్జున (చర్చ) 11:05, 29 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Po.indicwiki గారు, మిమ్ములను హెచ్చరించినా కొత్త పేజీలను (మొత్తం 222) పాతపద్ధతిలో సృష్టించుకుంటూపోయారు. మీరు ఇలాచేయటం తెవికీసముదాయంతో సహకారానికి ఉపయోగంగా వుండదు. ఇటువంటి మీ పని దుశ్చర్యలుగా భావించి నిరోధం విధించేవీలుంది. గమనించి సహకరించండి. అర్జున (చర్చ) 23:10, 29 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Po.indicwiki గారు, నేను బాటుతో తరలించిన నమూనా వ్యాసాలు (210) చూడండి. మిగతా వ్యాసాల పేరులు పొడవు ఎక్కువగా వున్నందున తరలించలేదు. మొదటిగా ఒక విభాగాన్ని ఎంచుకొని, వీటిలో ఐదు ఎంపిక చేసి, వాటిని తయారు చేసిన విధానం, నాణ్యత నియంత్రించిన విధానం వివరాలు తెలుపుతూ వాటిని వికీపీడియాలో చేర్చటం వలన తెవికీ కి ఎందుకని ఉపయోగమనుకుంటున్నారో తెలిపి, రచ్చబండలో వికీపీడియన్ల అభిప్రాయాలు కోరండి. --అర్జున (చర్చ) 00:37, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
బాట్ ద్వారా నమూనా వ్యాసాలు తరలించినందుకు ధన్యవాదాలు అర్జున గారు,ఒక్కో వర్గానికి మేము రూపొందించిన వ్యాసాల సంఖ్య వేలల్లో ఉండడం వల్ల కనీసం మచ్చుకు 50 వ్యాసాలు సముచితంగా ఉంటుందని భావించి నా ప్రయోగశాల లో చేర్చడం జరిగినది. మీ సూచనలు, ఇంకా ఇతర సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈ వారాంతంలో రచ్చబండ లో ఎంపిక చేసిన కొన్ని వ్యాసాలను మాత్రమే ఉదాహరిస్తూ సభ్యుల అభిప్రాయం కోరుతాం Po.indicwiki (చర్చ) 08:48, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Po.indicwiki గారు, మీరు కొత్త వ్యాసాలు చేర్చటం ఆపలేదని ఈ రోజు సవరణలు చూస్తే తెలుస్తున్నది. మిమ్ములను హెచ్చరించినది అప్పుడే మరచారా? తక్షణం మీరు కొత్త వ్యాసాలు చేర్చడం ఆపండి. అర్జున (చర్చ) 09:36, 4 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషి

[మార్చు]

ప్రసాదు గారూ, కొత్త వ్యాసాలు చేర్చే పనిని మొదలుపెట్టినందుకు అభినందనలు. మీ ప్రయోగశాలకు అనుబంధ పేజీలుగా కొత్త వ్యాసాలను చేర్చడం గమనించాను. నావి కొన్ని సూచనలు:

  1. పైన అర్జున గారు చెప్పినట్లు కొద్ది సంఖ్యలో చేర్చి ఆ పై చర్చ పెడితే మంచిది.
  2. ప్రస్తుతం చేర్చిన పేజీల్లో కొన్నిటి పేర్లు సరిగ్గా లేవని గమనించాను. ఉదాహరణకు: హరి క్రిష్ణన్ జైన్ (సరైన పేరు హరి క్రిషన్ జైన్), రోహిణి గోడబోలె (రోహిణి గోడ్బోలె), హార్ష్ గుప్త (హర్ష్ గుప్తా), శివ ఎస్. బండా (శివ ఎస్.బందా), బి. ఆర్. దేయోధర్ (బి.ఆర్.దేవ్‌ధర్).. వగైరాలు. సరైన పేరు కోసం ఇతర భారతీయ భాషల వికీపీడియాలు చూడడం, గూగిలించడం వంటివి చెయ్యవచ్చు.
  3. వీటిలో కొన్ని సరైన పేరుతో తెవికీలో ఉండే అవకాశమూ ఉంది. ఉదా: శివ ఎస్. బందా. ఇలాంటి సందర్భాల్లో విలువైన శ్రమ వృథా అవుతుంది.
  4. కొన్ని సందర్భాల్లో మీరు సరైన పేరుతో పేజీ సృష్టించగా., వికీలో వేరే పేరుతో ఉండవచ్చు. అప్పుడూ కూడా మీ శ్రమ వృథా అవుతుంది. అంచేత పేజీని సృష్టించే ముందు వివిధ పేర్లతో క్షుణ్ణంగా వెతికితే మంచిది.
  5. తెలుగు లోకి అనువదించేటపుడు వికీపీడియా:శైలి ని అనుసరించండి. ఉదా: తేదీ ఆకృతి.
  6. పేజీలను ప్రధానబరి లోకి తరలించిన తరువాత ఇతర వికీపీడియాల లింకులు ఇవ్వడం మరువకండి. (ఈ లింకులు ఇవ్వనందువల్లనే, వ్యాసం ఉందని తెలీక అదే వ్యాసాన్ని మళ్ళీ సృష్టించే పరిస్థితి ఏర్పడుతోంది.)

__ చదువరి (చర్చరచనలు) 14:47, 29 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనలకు ధన్యవాదాలు , అనుసరించదగినవే , తప్పకుండా అనుసరిస్తాను Po.indicwiki (చర్చ) 05:40, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఉదా: శివ ఎస్. బందా. ఇలాంటి సందర్భాల్లో విలువైన శ్రమ వృథా అవుతుంది.
ఈ సూచన పాటిస్తాను సర్ Po.indicwiki (చర్చ) 05:44, 30 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ ప్రసాద్ గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:00, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]