వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3

అనామకుల దుశ్చర్యలు

[మార్చు]
గత కొన్ని రోజులుగా అనామక వాడుకరులు కొందరు కొత్త వాడుకరులు పేజీలలోని సమాచారాన్ని తొలగించడం, అనవసర విషయాలను చేర్చడం జరుగుతున్నది. కుల సంబంధమైన విషయాలను మూలాలు లేకుండా కొంతమంది వాడుకరులు వ్యాసాలలో చేర్చడం జరుగుతున్నది. దయచేసి నిర్వాహకులు వీలున్నంతవరకు వ్యాసాల మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి.--కె.వెంకటరమణచర్చ 14:33, 14 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ! నెలరోజుల నుంచి నేను వాడుకరి:Jiksaw1 చేస్తున్న మార్పులు గమనిస్తూ, ఇవి తటస్థ దృక్కోణానికి భంగకరమనీ, ఇలా రాయకూడదనీ సూచిస్తూ ఉన్నాను, అడపాదడపా మార్పులను రద్దుచేయనూ చేశాను. నిర్వాహకుల నోటీసుబోర్డులోనూ ఈ అంశం ప్రస్తావనకు తెచ్చాను. ఈ చర్చలన్నిటిలోనూ ఆ వాడుకరి ఒకే ఒక్కమారు సమాధానమిచ్చినా ఆ చర్యలు నిలుపుదల చేయడం జరగలేదు. పలుమార్లు పలుచోట్ల చర్చలు చేసి, అర్థమయ్యేలా పాలసీని వివరించినా స్పందన, మార్పు రాకపోవడంతో హెచ్చరిక చేశాను. --పవన్ సంతోష్ (చర్చ) 02:57, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, అనామకుల, కొత్తవాడుకరుల దుశ్చర్యలను గమనిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ పాత వాడుకరులు, అనేక లక్షల దిద్దుబాట్లు చేసిన భాస్కరనాయుడు ఇదివరకు గ్రామవ్యాసాలు ఉన్ననూ వాటిని పరిశీలించకుండా వందల సంఖ్యలో కొత్తవ్యాసాలను సృష్టిస్తున్నారు. ఎన్నని నిర్వాహకులు పరిశీలించగలరు? ఈ రోజు అనేక వ్యాసాలలో తొలగింపు మూసను ఉంచాను. ఇదివరకు రచ్చబండలో తెలియజేసాను. ఒకసారి మీరు కూడా సరైన మార్గనిర్దేశం వారికి చేయగలరు. --కె.వెంకటరమణచర్చ 15:04, 17 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల పోకడ

[మార్చు]

(రవిచంద్ర గారు రాసిన వ్యాఖ్యతో ఈ చర్చ విషయం మారినట్టు అనిపించింది. అది చాలా ముఖ్యమైన సమస్య కూడా కాబట్టి ఇక్కడి నుండి దీన్ని ఒక ప్రత్యేక విభాగంగా చేస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 05:38, 19 ఫిబ్రవరి 2018 (UTC))[ప్రత్యుత్తరం]

రాశి కంటే వాసి ముఖ్యమని ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదాయె. ప్రస్తుతం గ్రామ వ్యాసాల విషయంలో మనం చేస్తున్న పని నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. అవి వికీ నియమాలకు లోబడే జరుగుతుండవచ్చు కానీ ఒకే మూస పద్ధతిలో సాగుతున్న ఈ వ్యాసాలు తెవికీ నాణ్యతను ఏ మాత్రం పెంచబోవని నా ఉద్దేశ్యం. ఈ విషయం గట్టిగా చెబితే సభ్యులు చేసే మార్పులు మనమేదో అడ్డుకుంటున్నట్లు, వాళ్ళు రికార్డులు సృష్టిస్తుంటే మనం అడ్డుపుల్ల వేసినట్లు భావిస్తున్నారే తప్ప తెవికీ బాగు కోసం అని అనుకోవడం లేదు. ఏదైనా సలహాని వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. దైనందిన జీవితంలో అనేక పనుల్లో పాల్గొంటూ తెవికీ కోసం అప్పుడప్పుడూ కేటాయించే సమయంలో వాదనలకు దిగే ఓపిక లేక నేను నాకు తోచిన పనేదో చూసుకుంటూన్నాను. కానీ నేను ఇవన్నీ చూస్తున్నానని మాత్రం గమనించగలరు. --రవిచంద్ర (చర్చ) 18:33, 17 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల్లో సృజనాత్మక మార్పులు జరగటం లేదన్నది నిజం. దీనిపై వాడుకరికి వ్యక్తిగతంగా కొంత తెలియచేయడం అవసరం. వ్యాస వ్యాసానికి కొంత వ్యత్యాసం చూపాలి కాని అన్నీ ఒకే మూస వ్యాసాలుగా ఉండటం, వారంలో వెయ్యి వ్యాసాలు సృష్టించడం కాదు మనకు కావలసింది.. దీనిపై .పవన్ సంతోష్ గారు వాడుకరులకు మార్గదర్శనం చేయాగలరని అశిస్తాను...--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 02:10, 18 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ సరేనండీ. ఉన్న వ్యాసాలను తిరిగి సృష్టిస్తుంటే విషయం తెలియజేసి, జరుగకుండా ప్రయత్నిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:57, 18 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • విశ్వనాధ్ గారూ, రవిచంద్ర గారూ! మీరు గ్రామ వ్యాసాల్లో మార్పుచేర్పులు మూస పద్ధతిలో సాగుతున్నాయని అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ విషయంలో నా స్టాండ్ తెలియజేయదలిచాను. అందుకు కొంత నేపథ్యం అవసరం: ఈ వ్యాసాలను 2006లో సృష్టించిననాడు అన్నిటినీ మనం ఒకేలాంటి ఏకవాక్యంగా సృష్టించాం, తర్వాత అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రధానంగా అన్ని వ్యాసాల్లోనూ జనగణన సమాచారాన్ని ఉపయోగించి జనాభా వంటి వివరాలు అందించారు. అంతేగాక వ్యాసాల్లో సమాచార లేమి వల్ల యాదృచ్ఛిక పేజీ మీద నొక్కినప్పుడల్లా ఏదోక మొలక గ్రామ వ్యాసానికి చేరుకుంటోందని, ఎవరైనా తెవికీని సందర్శించిన వారు ఆ వ్యాసాలను చూస్తే తెవికీ నాణ్యత ఇంతేనని భావించి తిరిగి వెళ్ళిపోతారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం కూడా గతంలో జరిగింది. ఐతే కొందరు సభ్యులు కొన్ని మోడల్ వ్యాసాలను అభివృద్ధి చేశారు, రెండు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని గ్రామాలను ఇలా చేయగలిగామా? అంటే లేదని చెప్పాలి. ఇంకొన్ని జిల్లాల్లో కొన్ని సంవత్సరాల్లో చురుకైన ఐపీ ఎడ్రసులు మార్పులు చేర్పులు చేయగా కొంత విభిన్నమైన సమాచారం పరిమితమైన వ్యాసాల్లో చేరింది. ఐతే చాలా జిల్లాల వ్యాసాలు కొద్దిపాటి సమాచారంతోనే ఉన్నాయి, ఇదీ స్థితి. ఇప్పుడు చేస్తున్న మార్పుల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, వగైరా మౌలిక రంగాల సమాచారంతో వ్యాసాలు విస్తరిస్తున్నాయి. మొదట మనం వ్యాసంలో కనీస సమాచారం లేదన్న సమస్య ఇక్కడ తీరుతోంది. పైగా ఈ పని ఏమీ సముదాయానికి తెలియకుండా జరగలేదు, గతంలో విస్తారంగా చర్చించితే, ఆ చర్చల ఆధారంగా తయారుచేసిన నమూనా వ్యాసాన్ని ఉపయోగించి ఈ మార్పులు చేస్తున్నారు. గతంలో ఈ వ్యాసాల రూపకల్పన విషయంలో యాంత్రికమైన శైలిలో ఉంటున్నాయని తెలిపిన దృష్ట్యా (అప్పటికీ అలాంటి యాంత్రికమైన శైలిలోని వ్యాసాలను, సముదాయం ఆమోదించిన నమూనా వ్యాసం శైలిలో తిరగరాయడానికి భాస్కరనాయుడు గారు చాలా శ్రమించి చేసేవారు, ఒక్కో వ్యాసాన్నీ తిరగరాయడానికి రోజుల పాటు సమయం పట్టేది), చదువరి గారి కృషితో కొత్త పద్ధతిలో వ్యాసాన్ని మొత్తం మానవీయమైన శైలికి దగ్గరగా ఉండేలా ఒక లాజిక్ మోడల్ రాసి, తగ్గ కోడింగ్ చేయించగా, ఆపైన ఒక్కో జిల్లాలోనూ వేలాది గ్రామాల పేర్లు లిప్యంతరీకరించి, తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల పేర్లు రెండేళ్ళైనా అక్కడ చేరకుంటే అదీ సరిజేసి ఈ సమాచారం సృష్టిస్తున్నాం, దానిని సభ్యులు ప్రచురిస్తూన్నారు. ఇప్పుడు ప్రచురిస్తున్నది మౌలిక సమాచారం, దీనిపైన మరేదైనా నిర్మించవచ్చు. ఇది కూడా లేకపోవడం వల్ల ఆయా అంశాల గురించి కనీస సమాచారం ఇవ్వలేక వ్యాసం అనిపించుకునే స్థాయి కూడా లేని స్థితి నుంచి మెరుగవుతున్నది. ఆదర్శ వ్యాసాన్ని రూపొందించడం లేదు, కానీ ఎవరైనా ఆదర్శ వ్యాసంగా తయారుచేసేందుకు పునాది రాళ్ళు మాత్రం ఏర్పాటుచేస్తున్నాం. వ్యాసవ్యాసానికి వ్యత్యాసం చూపేలా రాయదలుచుకుంటే అడ్డుకునేందుకు కాదు, కనీసం పిండి అందించేందుకు ఈ యత్నం అని గ్రహించగలరు. పదేళ్ళ ముందు ఏకవాక్య వ్యాసాలుగా రూపొందించిన తొలితరం భవిష్యత్తులో మరింత సమాచారం విస్తరిస్తుందని ఎలా నమ్మారో, ఈనాడు భవిష్యత్తులో మరిన్ని వినూత్నమైన ఆలోచనతో 28 వేల వ్యాసాలను అత్యంత నాణ్యమైన సమాచారంగా రూపొందించగలుగుతుందన్న నమ్మికతోనే ఈ పనిచేస్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 18:57, 18 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
    • ఈ గ్రామాల వ్యాసాల్లో పనిచేసే కొద్దీ వీటిలో చేయాల్సిన పని మరెంతో కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఈ వ్యాసాలను రూపొందించినప్పుడు ఆంగ్లంలో ఉన్న పేర్లను తమకు తెలిసిన విధంగా, తెలినంతమేరకు సరిగా లిప్యంతరీకరణ చేశారు. ఈ చేయడంలో చాలా గ్రామాల పేర్లు సరిగా లేవు. వీటన్నిటినీ సరైన పేర్లకు తీసుకురావాలంటే ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని తీసుకుని, ఏదోక విధానంలో చేయాల్సివుంటుంది. అవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాక కొన్ని మూలాల్లో గ్రామాల వ్యాసాల్లో ఉత్తర పదాలు (ఉదాహరణకు అయినంగట్టు అన్న పేరులో గట్టు అన్నది ఉత్తరపదం) అర్థాలేమిటో గ్రామనామ పరిశోధన ద్వారా తెలియజేసినవి ఉన్నాయి. ఆయా ఉత్తరపదాలు తీసుకుని ఆయా ఉత్తరపదాలు ఉన్న గ్రామాల్లో మూలం సహితంగా రాస్తే వ్యాసానికి వైవిధ్యం పెరుగుతుంది. ఇలా సాధ్యమైనన్ని దిక్కులా సమాచారాన్ని సేకరిస్తూ, వాటిని విజ్ఞాన సర్వస్వ శైలికి పనికివచ్చే విధంగా చేర్చడానికి ప్రయత్నాలు చేస్తూ పోదామని తలపు. కాకుంటే వేలాది వ్యాసాల్లో మార్పులు చేయాలంటే గ్రామ వ్యాసాలపై ఆసక్తి ఉన్న వాడుకరుల కృషి అవసరం. క్రమక్రమంగా వ్యాసాలు జీవాన్ని సంతరించుకునే దిశగా సాగే ఈ ప్రయత్నాల్లో సహకరించే ఆసక్తి ఉంటే దయచేసి తెలియజేయగలరు. మన శాయశక్తులా కృషిచేయొచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 19:07, 18 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, విశ్వనాధ్ గారు ఒక బహుచర్చిత సమస్యను తిరిగి సముదాయం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై నా అభిప్రాయాలు:
  • ప్రస్తుత గ్రామ వ్యాసాలు మూస పద్ధతిలో సాగుతున్నాయి. (మన దగ్గర ఉన్న డేటాను మిషను ద్వారా వాక్యాలుగా విస్తరిస్తే ఈ వ్యాసాలు తయారవుతున్నాయి.) ఈ వ్యాసాలు గతంలో ఉన్న ఏక వాక్య వ్యాసాల కంటే చాలా నయం.
  • గతంలో దీనిపై చర్చలు జరిగాయి. అప్పట్లో వచ్చిన అభ్యంతరాలు ఎక్కువగా "ఫలానా సౌకర్యం గ్రామంలో లేదు అని రాయడం అవసరమా?" వంటివే తప్ప, మౌలికంగా ఈ పద్ధతి సరైనది కాదు అనే అభ్యంతరాలు నేను గమనించినంతలో తక్కువ. ఈ పద్ధతి నాకు నచ్చనప్పటికీ, ఇలాగే చెయ్యాలని సముదాయం నిశ్చయించాక, ఇక వ్యక్తిగత అభ్యంతరాలు పక్కన పెట్టాలని నేను భావించాను. పైగా ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం నాకు తట్టలేదు.
  • భాస్కరనాయుడు గారు ఈ ప్రాజెక్టును చేపట్టి, పూర్తి మానవికంగా చేస్తున్న పనిని గమనించాక, మిషను ద్వారా అదే పని చేస్తే బోల్డంత వేగంగాను, చాలా తక్కువ మానవ శ్రమతోనూ చెయ్యొచ్చని భావించి ఈ పని మొదలెట్టాం. ప్రస్తుతం వ్యాస పాఠ్యం పూర్తిగా మిషను ద్వారా తయారవుతోంది. ఆ పాఠ్యాన్ని అనేక మంది వాడుకరులు సంబంధిత పేజీల్లో చేరుస్తున్నారు.
  • ఇప్పుడు ఏం చేద్దాం? పని ఆపేద్దామా? ఆపేస్తే ఇంతకంటే మెరుగ్గా ఈ పనిని ఎలా చెయ్యొచ్చో ఆలోచించాలి కదా! ఓ వారం పాటు ఈ పనిని ఆపి, మరింత మెరుగైన విధానం కోసం చర్చ చేద్దామా? __చదువరి (చర్చరచనలు) 05:38, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వాక్య గ్రామాల కన్నా చదువరి గారు రూపొందించిన శైలి చాలా నయం. అందులో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇప్పుడు చేస్తున్న పని ఆపమనడం కూడా నా ఉద్దేశ్యం కాదు. దీని ద్వారా మనం ఖచ్చితంగా సమాచారాన్ని పోగేస్తున్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకంతే మెరుగైన పద్ధతి ఏంటంటే మనదగ్గర ఉన్న సమాచారాన్ని కొంచెం వ్యాస వ్యాసానికి కొంచెం వైవిధ్యం చూపించి రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. కానీ మరీ యాంత్రికంగా కాకుండా ఉంటుంది. చివరగా నేను చెప్పదలచింది గుడ్డెద్దు చేలో పడ్డట్టు అనే సామెత లాగా వ్యాసం ఉందా లేదా కనీసం చూసుకోకుండా కాపీ పేస్టు చేసేయడం వల్ల డూప్లికేటు వ్యాసాలు అనేకం తయారై నిర్వహణా భారంగా తయారవుతుందని మాత్రమే. నేను వెంకటరమణగారు చెప్పినదాన్ని సమర్ధించాను. --రవిచంద్ర (చర్చ) 06:24, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
డూప్లికేటు పేజీల సృష్టి విషయంపై కె.వెంకటరమణ గారు, రవిచంద్ర గారు లేవనెత్తిన అభ్యంతరాలతో నేను నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 06:43, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి,పవన్ సంతోష్ గార్లకు మీ గ్రామాల యొక్క కృషిని ఆపమనేది నా అభిప్రాయం కాదు. వీటిపై మొదట పని చేసినది నేనే అనుకోవచ్చు. పంజాబ్ వికీఎడిటధాన్ సంధర్భంగా పలు ప్రయత్నాల ద్వారా గ్రామ వ్యాసాలపై పని చేయడం జరిగింది. అప్పటి కంటే మెరుగైన పంధాలో మీ ఇప్పటి వ్యాసం ఉందనేది నిజం. దీనికోశం మీరిరువురు ఆఫ్‌లైన్‌లో ఎంత కృషి చేసారో నాకు తెలుసు.మీతో పాటు భాస్కరనాయుడు గారి కృషికి నిజంగా నేను చాలా ఆనంద పడుతున్నను. ఒకేరకమైన వ్యాసాలను అనేకంగా రాయడం అనేది చాలా గొప్ప పని - రెండు విషయాలలో మెరుగుదలకు నా అభిప్రాయాలు రాస్తున్నాను. సాధ్యాసాధ్యాలపై మీ ప్రయత్నానికి ఉపయోగపడుతాయేమో పరిశీలించగలరు. 1, గ్రామ వ్యాసాల్లో మార్పులకు మరో విభాగం చేర్చడం అది "ప్రత్యేకతలు, విశేషాలు" (దీని ద్వారా కొత్త వాడుకరులు తమ గ్రామ ప్రత్యేకత లేదా విశేషాలు చేర్చడం చేస్తారు) మరియు ఇప్పుడున్న విభాగాలు తగ్గించడం సాద్యమయితే ఇంకా బావుంటుంది (గ్రామ చరిత్ర, సౌకర్యాలు, విశేషాలు. ఇవి చిన్న గ్రామాలకు సరిపోతాయని నా అభిప్రాయం). 2, ప్రతీ మండలంలో ఉన్న గ్రామ వ్యాసాలజాబితాతో సరిపోల్చి అందులో లేని పేర్లు ముందుగా చేర్చి, తరువాత వ్యాసంలో మొత్తం పేస్ట్ చేయకుండా ఆయా విభాగాల్లో సెన్‌సెస్లో ఉన్న సమాచారం ముక్కలుగా చేర్చడం. దీని ద్వారా డూప్లికేట్ వ్యాసాలు తయారు కాకపోవచ్చు వీలైతే ఒకేరకమైన పంధా కాక మరో నాలుగైదు రకాల టెంప్లేట్స్ ద్వారా సమాచారం చేర్చగలగటం సాధ్యమయితే వ్యాసాలు మరింత అందంగా ఉంటాయని నా అభిప్రాఅయం. వీటిపై ప్రస్తుతం అందుబాట్లో ఉన్న అందరు సభ్యులం కొంత కృషి చేద్దాం. కనీసం ఇప్పటికే పూర్తి అయిన వ్యాసాలను అప్పుడపుడూ కొంత వైవిధ్యంగా చిన్న మార్పుల ద్వారా మారుద్దాం.--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 07:26, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్నార్‌గుళ్ళపల్లి గారు ఇస్తున్న లింకులు

[మార్చు]

వాడుకరి:Nrgullapalli గారు ఇస్తున్న లింకులు వికీ నిబంధనలకు అనుగుణంగా ఉండటం లేదు. స్వీయలింకులు ఇవ్వడం, దారిమార్పు పేజీలకు లింకు ఇవ్వడం, అసందర్భపు లింకులు, అసంబద్ధపు లింకులూ ఇవ్వడం వంటివి చేస్తూ ఉన్నారు. ఈ విషయమై గతంలో ఆయనకు అనేకమార్లు వివరించాం. వాడుకరి:Pavan santhosh.s గారు స్వయంగా నేర్పించారు కూడాను. ఓ వారం పాటు నిరోధమూ విధించడమైంది. అయినప్పటికీ అవే తప్పులను చేస్తూనే ఉన్నారు. సరిగ్గా నేర్చుకున్నాకే లింకులు ఇవ్వండని కూడా చెప్పాను. అయినా లాభం లేదు. ఈ విషయమై గతంలో ఆయనకు ఇచ్చిన సలహాలు కొన్ని కింద ఇస్తున్నాను.

ఆయనపై ఏదైనా చర్య తీసుకునే ముందు, ఇతర నిర్వాహకులు కూడా ఆయన్ను మార్చే ప్రయత్నం చెయ్యాలని కోరుతున్నాను. ఈ విషయమై మీ అభిప్రాయాలు కూడా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 03:06, 9 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారితో ఏకీభవిస్తున్నాను.వాడుకరి:Nrgullapalli గారు ఇతర వికీ కార్యాలు చేపట్టితే మంచిది.--అర్జున (చర్చ) 03:36, 9 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన లింకులు ఇవ్వండి సార్, అని చెప్పాక కూడా, ఇవ్వాళ ఆయన ఇచ్చిన లింకుల్లో కొన్ని:ఈ మార్పులో ఆయన చేసిన పనులివి:
  • ప్రతివాది భయంకర వెంకటాచారి బ్రిటిషు పాలనను సాయుధంగా ఎదుర్కొన దలచిన ఆంధ్రుడు. భయంకరాచారి పేరుతో పిలువబడే ఈయన జననం 1910 మరియు మరణం - ఈ వాక్యంలో జననం, మరణం లకు లింకుల ఔచిత్యం ఏంటి?
  • కాకినాడ బాంబు కేసులో ముద్దాయి. శిక్షపడి అండమాన్ జైలులో కొంతకాలం ఖైదీగా ఉన్నాడు - ఈ వాక్యంలో ఖైదీ అనే లింకు ఇవ్వడం, అది కూడా ఒక ఖైదీ పేరు కలిగిన సినిమాల అయోమయ నివృత్తి పేజీకి!!
  • ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి, దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు - ఈ వాక్యంలో పడవకు, కాఫీకీ లింకులు! ఈ రెండూ కూడా ఈ సరికే వేరేచోట్ల లింకులు ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడిచ్చినవి డూప్లికేటు లింకులు!! పాతవి కూడా వారు ఇచ్చినవే!!!
  • సెప్టెంబర్ 11 న భయంకరాచారిని ఖాజీపేట్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.- కాజీపేట అనే సరైన లింకును తీసేసి ఖాజీపేట్ అనే ఈ కొత్త లింకు ఇచ్చారు. ఇది తప్పుడు లింకు, గతంలో ఉన్నదే సరైనది.
ఇలాంటి లింకులు పొరపాటున ఇస్తే పట్టించుకోనవసరం లేదు. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ ఆయనిచ్చే లింకుల్లో ఎక్కువగా ఇలాంటి లింకులుంటాయి.__చదువరి (చర్చరచనలు) 04:54, 9 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అవును ఇది సరైన పద్ధతి కాదు. నేను సృష్టించిన వ్యాసాల్లో కూడా ఇలాంటి లింకులు ఇస్తూ ఉన్నారు. ఇంతకు మునుపు సోర్సు ఎడిటింగ్ లో ఇలాంటి మార్పులు చేసేవారు. అప్పుడు మనం ఆయనకు విజువల్ ఎడిటర్ ద్వారా లింకులివ్వమని నేర్పించాం. విజువల్ ఎడిటర్ ద్వారా అయితే ఆయనకు అసలు ఏ పేజీకి లింకు ఇచ్చేది తెలుస్తుందని. అయినా ఆ తీరు మారలేదు. దీన్ని తక్షణమే ఆపాలి. తను చేస్తున్నది ఎలాంటి తప్పులో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలి. అలా కాని పక్షంలో సదరు సభ్యుని నిరోధించాలి.రవిచంద్ర (చర్చ) 05:05, 9 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు ఇస్తున్న లింకులు చూశాను. అవి సరైన పేజీలకు వెళ్లడంలేదు. అయితే, ఆయనకు ఈ విషయం క్షుణ్ణంగా వివరించి, ఇకపై లింకులు ఇవ్వడం ఆపేసి వేరే విధంగా వికీకి కృషిచేయమని చెపితే బాగుంటుంది. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:52, 9 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో నాగేశ్వరరావు గారికి చదువరి గారి సూచనల మేరకు విజువల్ ఎడిటర్ ఉపయోగించి లింకులు చేర్చడం నేర్పించాను, ఇందుకు భాస్కరనాయుడు గారు చక్కని సహకారం అందించారు. కనుక ఈ విషయంలో ఆయనేమైనా సూచన చేస్తారేమోనని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:28, 11 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:స్వరలాసిక, వాడుకరి:Kvr.lohith, వాడుకరి:B.K.Viswanadh, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:T.sujatha బహుశా ఈ చర్చ మీ దృష్టిలోకి వచ్చి ఉండకపోవచ్చు. ఈ విషయంపై స్పందించవలసినదిగా వినతి.__చదువరి (చర్చరచనలు) 02:08, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి,రవిచంద్ర గార్లతో ఏకీభవిస్తున్నాను. చివరిసారిగా గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారికి వివరించి వారు తమ పద్ధతిని మార్చుకోక పోతే తగిన చర్య తీసుకోవాలి.--స్వరలాసిక (చర్చ) 02:37, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయనకు వ్యక్తిగతంగా కొంత నేర్పించడం అవసరం. ఎవరైనా ఒకరోజు కొన్ని నేర్పించగలిగితే కొంతవరకూ చేయగలుగుతారేమో..అప్పుడూ అలానే చేస్తుంటే ఇక చర్య తీసుకోవచ్చు. ముఖ్యంగా విజువల్ ఎడిటర్ ద్వారా ఆయన డ్రాప్‌డౌన్ మెనూలో ఉన్నవాటిల్లో ఏదో ఒకదానికి లింక్ ఇచ్చేస్తున్నట్టుంది. కనుక ఆయన సిస్టంలో విజువల్ ఎడిటర్ డిజేబుల్ చేసి మాన్యువల్ ఎడిట్స్ చేయమని చెప్పడం మంచిది అనుకొంటాను...విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
వాడుకరి:Bhaskaranaidu గారు ఈ లింకుల పని విషయమై గుళ్ళపల్లి గారితో వ్యక్తిగతంగా మాట్లాడారట. ఆయన ఆ పని తక్షణం ఆపుతున్నట్టు చెప్పారని భాస్కరనాయుడు గారు వాడుకరి చర్చ:Pavan Santhosh (CIS-A2K)లో రాశారు. --పవన్ సంతోష్ (చర్చ) 15:42, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు అసందర్భపు లింకులు, అసంబద్ధపు లింకులూ ఇవ్వడం వంటివి చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో చదువరి గారితో ఏకీభవిస్తూ ఉన్నాను. ఈ లింకులు సరైన పద్ధతిలో ఇచ్చే విధానాన్ని ఎవరైనా నేర్పిస్తే బాగుంటుంది. ఆ అసందర్భ లింకులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం లింకులో స్వాతంత్ర్య సమరయోధులు వ్యాసంలో "సమరం" కు లింకు ఇచ్చారు. అది "సమరం" అయోమయ నివృత్తి పేజీకి వెళ్ళిపోయింది. "దేశ సంపదను కాపాడటానికి [[నడుము]] బిగించి" వాక్యంలో "నడుము" కు లింకు ఇచ్చారు. ఆయన లింకులు ఇచ్చే విధానం గూర్చి పూర్తిగా తెలుసుకొనే వరకు ప్రస్తుతం ఆపేటట్లు చేయాలి. చివరిసారిగా గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారికి వివరించి వారు తమ పద్ధతిని మార్చుకోక పోతే తగిన చర్య తీసుకోవాలి.--కె.వెంకటరమణచర్చ 16:40, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
లింకులివ్వడం ఇంకా నేర్చుకోలేదు. అనవసర లింకులు ఇస్తున్నారు. ఉదా: లింకు లో పలుచోట్ల మూడొందల ఎకరాలకు పైగా భూమి ఉండేది. వాక్యంలో గ్రహమైన "భూమి" లింకు, గ్రామానికి చెందిన ఆడబిడ్డ కుమారుడు వాక్యంలో "ఆడబిడ్డ" సినిమా లింకు, తన ఆస్ధులకు వారసుడు గా పలుదేవర్లపాడు నుండి రాయంకుల తాతయ్య వాక్యంలో "వారసుడు" సినిమా లింకు లు ఇవ్వబడ్డాయి. నైనా దేవి వ్యాసంలోని లింకులో సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ... వాక్యంలో "కళ్ళు" అనే పదం అయోమయ నివృత్తి పేజీకి లింకు అయినది. రొనాల్డో వ్యాసంలోని లింకులో 11 ఫిబ్రవరి 2007న ప్రత్యామ్నాయ [[ఆటగాడు]] గా లివోర్నో.... వాక్యంలో "ఆటగాడు" సినిమా లింకు ఇచ్చారు. దయచేసి పూర్తిగా లింకులపై అవగాహన చేసుకొనే వరకు లింకులు ఇవ్వడం ఆపి ఇతర దిద్దుబాట్లపై దృష్టి పెట్టవలసినదిగా గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. --కె.వెంకటరమణచర్చ 04:54, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అగ్గిపుల్ల నందు అగ్గి,పుల్లకు నిచ్చు
చెరకు కిచ్చు వంటచెరకు నందు
లింకులిచ్చువారి లీలలు చూడరా
లుప్తమయ్యె పదము లింకులందు

—కె.వి.ఆర్

లెస్స యైన భాష లింకులిచ్చుట యందు
కాని పదముతోడ కలుపుటేల?
నేర్చుకున్న పిదప నేర్పుతో పనిచేసి
భాష పరిమళంబు పెంచవలయు

—కె.వి.ఆర్

  1. నేను ఈ విషయం గమనించ లేదు. వ్యాసాలరచనలో అవసరమైన లింకులు ఇవ్వడం సరైన విధానం లింకులు ఇవ్వడమే ప్రత్యేకపనిగా మార్పులు చేయడం సరికాదు. అనవసర లింకులు పొరపాటు లింకులు ఇవ్వడం తెవికీ నాణ్యతను దెబ్బతీయడమే కాక తెవికీని విమర్శలకు గురిచేస్తుంది కనుక ఈ విషయంలో చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.T.sujatha (చర్చ) 03:01, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చలో వెల్లడైన విశేషాలు:

  1. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు లింకులివ్వడాన్ని తక్షణం ఆపు చేస్తానన్నారు అని పవన్ సంతోష్ గారికి సమాచారం అందింది. కానీ ఆయన అలాంటి లింకులివ్వడం కొనసాగిస్తూనే ఉన్నారు.
  2. తప్పు లింకులు ఇస్తూనే ఉన్నారు, లింకులివ్వడంలోని తర్కాన్ని ఆయన ఇంకా అర్థం చేసుకోలేదని కె.వెంకటరమణ గారి చివరి వ్యాఖ్య ద్వారా తెలుస్తోంది.

కాబట్టి, పై చర్చను సంపూర్ణం చేస్తూ కింది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను:

  1. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తక్షణమే లింకులిచ్చే పని ఆపాలి. లేదంటే ఆయనపై చర్య తీసుకోవాలి.
  2. లింకులు ఇవ్వడం నేర్చుకున్నారు అని సముదాయానికి విశ్వాసం కలిగిన తరువాత తిరిగి ఆయన ఈ పని మొదలుపెట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 02:29, 1 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గుళ్ళపల్లి గారితో ఈ చర్చ చూసాక మాట్లాడాను. వికీపీడియాలో మార్పులు ఆపేస్తానని చెప్పాడు. వికీసోర్స్‌లో రాయమని చెప్పాను. ఒప్పుకున్నారు. నేను తరువాత నెమ్మదిగా అయనకు చెప్తాను అని చెప్పా.. కనుక కొంత సమయం ఇవ్వగలిగితే నేను ప్రయత్నిస్తాను..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
విశ్వనాధ్ (Viswanadh) గారూ, మనం ఒక నిర్ణయం తీసుకుని ఒక నెల దాటిపోయింది. మీరు ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే, గుళ్ళపల్లి గారు నేర్చుకున్నట్టేమీ లేదు. ఇంకా అదే పద్ధతిలో లింకులిస్తూనే ఉన్నారు. ఈ లింకులో "రెంటాల గోపాలకృష్ణ"కు ఐదారు చోట్ల లింకులిచ్చారు. ఇక్కడ "బాల్యం" కు లింకు! ఇందులో "ఆలయం" కు లింకు ఇచ్చారు. ఏం చేద్దామంటారు? మీ అభిప్రాయం కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 04:25, 4 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు ఆయన బయటి వాళ్ళ వ్యాసాల్లో దాదాపు ఆపేసారు. గ్రంథాలయ జాబితాల్లో ఆయన ఎక్కువ పేర్ల వలన కొంత తెలియక చేస్తున్నారనుకుంటాను. నేను ఒక్కోసారి గమనించి చెప్పిన మిదట ఆయన సరిచేసుకుంటున్నారు. అదే కాక ఇపుడు ఆయన ఇచ్చే లింకులు కొన్ని తప్ప ఎక్కువగా ఆ వ్యాస సంభందిత పేజీలకే తీసుకెళ్లేలా ఇస్తున్నారు. మిగాతావి నేను ఆయన వెనుక కొంత చేస్తున్నాను. కనుక మునుపు కన్న ఆయన వైఖరిలో మార్పు ఉన్నది అనుకుంటున్నాను. నేను ఆయనను ముఖత: కలిసే అవకాశం లేక కొన్ని వివరించలేకపోతున్నాను..ఆయన కావాలని చేయడని నా అనుభవం. వయసు ప్రభావాన ఆయనకు సరిగ్గా వివరించే వాళ్ళు లేక మరియు ఏదో కొంత చేయాలనే ఉత్సాహంతో అలా చెస్తుండవచ్చు..మరోసారి చెపుతాను. ఆయనలో మార్పు లేదని మీకు అనిపిస్తే చర్యలపై ముందుకు వెళ్ళవచ్చు...B.K.Viswanadh (చర్చ)
మార్పు రావాలనే మనందరి ఉద్దేశం కూడాను -చర్య తీసుకోవడం కానే కాదు. మీరు చెప్పినట్టే చేద్దామని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 05:50, 5 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరి రచనలు పరిశీలించి చూస్తే దుశ్చర్యలు, పేజీలు ఖాళీ చేయడాలతో సహా పలు వ్యాసాల్లో పక్షపాతపూరితమైన మార్పుచేర్పులు చేస్తూవున్నట్టు అనిపిస్తూంది. (మొగ్గలు అనే నూతన సాహిత్య ప్రక్రియ గురించి రాయడం, కొందరిని ముఖ్యమైన ఆధారాలు చూపకుండా ఆ సాహిత్య ప్రక్రియకు ఆద్యులు, ప్రముఖులు అనడం చూశాను) దయచేసి గమనించి తీసుకోదగ్గ చర్యల గురించి చర్చించగలరు. అజ్ఞాతల దుశ్చర్యల విషయమై తీసుకోదగ్గ చర్యల గురించి కూడా ప్రస్తావన జరిగితే బావుంటుంది (ఇప్పటికే చర్చించివుంటే సంబంధిత చర్చ అందించగలరు) --పవన్ సంతోష్ (చర్చ) 06:05, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పనికిరాని మూసలు,వర్గాలు తొలగింపు ప్రతిపాదన -1

[మార్చు]

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ చేపట్టింది. పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం సవరించగా వికీపీడియా లోని జిల్లాలు, మండలాలు, గ్రామాలు}} వ్యాసాలులో చాలా మార్పులు జరిగాయి. దాని ఫలితంగా కొన్ని మూసలు, వర్గాలు అవసరం లేకుండా పొయింది.వాటితో మున్ముందు కూడా అవసరం లేదు.నేను గ్రామ వ్యాసాలు జనన గణన డేటా ఎక్కిస్తూ, ఒకేసారి పాత మండలాలు మూసలు సవరించుకుంటూ, కొత్త మండలాల మూసలు, కొత్త వర్గాలు సృష్టించుకుంటూ పాత జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు సవరించాను. ఆ సవరణలో కొన్ని ఖాళీ వర్గాలు, కొన్ని మండలాలు పాత జిల్లాల పేర్లతో ఉన్నాయి. నేను గమనించిన మూసలు, వర్గాలు తొలగించుటకొరకు నిర్వహాకుల దృష్టికి తీసుకుని రావడమైనది.పరిశీలించి తొలగించగలరు.

మూసలు

[మార్చు]

వర్గాలు

[మార్చు]
యర్రా రామారావు గారూ, మీరు తొలగించాలన్న మూస/వర్గం లో తొలగింపు మూసను సరైన కారణాన్ని తెలియజేస్తూ చేర్చండి. తరువాత ఎవరైనా నిర్వాహకులు ఆ వర్గాన్ని/మూసను తొలగిస్తారు. ఉదా: {{తొలగించు|సరియైన మూస ఎల్లారెడ్డిపేట అనే పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు మారింది}} --కె.వెంకటరమణచర్చ 04:44, 18 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

I need help reviewing a Global RFC

[మార్చు]
Dear admins, I am preparing a Global Request for Comments about financial support for admins that might be relevant for you .

Can you please review the draft and give me some feedback about how to improve it? Thank you.

MassMessage sent by Micru on 18:00, 7 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞానదాయకం కాని లైంగిక సంబంధమైన ఫోటోల చేర్పు

[మార్చు]

ఇటీవల వాడుకరి:Lingalanga అనే వ్యక్తి మానవ లైంగికతకు సంబంధించిన వ్యాసాల్లో విజ్ఞానదాయకం కాని, అశ్లీలమైన ఫోటోలు ఉద్దేశపూర్వకంగా చేరుస్తున్నారు. దీనిపై హెచ్చరిస్తే తన చర్చ పేజీలో ఆ సందేశాన్నే తొలగించారు. అలానే పలు వ్యాసాలను పోర్న్ సైట్లను మూలంగా ఇచ్చి రాస్తున్నారు. నేడు చర్చ పేజీలో హెచ్చరిక జారీ చేశాను. వికీపీడియా సెన్సార్డ్ కాకున్నా వికీపీడియాలో విజ్ఞానదాయకంగా మానవ లైంగికతకు సంబంధించిన విషయాలు రాసేందుకు ఆంగ్ల వికీపీడియా చక్కని ఒరవడి పెట్టింది. వీలైనంతవరకు బొమ్మలు, పెయింటింగులతోనే విషయ వివరణకు ప్రయత్నిస్తారు తప్ప నేరుగా ఫోటోలతో చేయరు. ఆ విషయాన్ని వివరించినా ఆ వాడుకరి తీరు మారలేదు. అంతేకాక భారతదేశ చట్టాల ప్రకారం అశ్లీలమైన సమాచారాన్ని ప్రచురించడమూ నేరమే, చాలా కఠినమైన ఈ చట్టాలను భారతదేశంలో ఉన్నాం కనుక అనుసరించి తీరాల్సిందే. ఇవన్నీ చూసిన మీదట ఆ వాడుకరిని వెంటనే నిరోధించడం, మానవ లైంగికతకు సంబంధించిన వ్యాసాలన్నీ సంరక్షణలో పెట్టడం తక్షణం చర్చించి నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:40, 14 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి వ్యాసాలను సభ్యత రేఖను దాటకుండా రాయాలనే విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ విషయంపై నా అభిప్రాయాలివి:
  • అశ్లీల ఫోటోలను తొలగించాలి.
  • విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలను తొలగించాలి. విషయ ప్రాముఖ్యతను నిర్ధారించేందుకు అశ్లీల వెబ్‌సైట్లను పరిగణించలేము.
  • సభ్యునికి హెచ్చరించి, మళ్ళీ ఆ పనిచేస్తే వెంటనే తగు చర్య తీసుకోవాలి.
మరొక విషయం ఏంటంటే ప్రస్తుత తెలుగు వికీపీడియా ఉన్న స్థితిలో సదరు వ్యాసాలు వికీ స్థాయిని పెంచకపోగా, అది ప్రతికూలంగా పనిచేసి, పాఠకులను, ఎడిటర్లనూ దూరం చేసే ప్రమాదం ఉంది. అందుచేత ఈ విషయమై సముదాయం చర్చించి, ఒక విధానాన్ని రూపొందించుకోవాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 08:26, 14 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటికే మూడు వ్యాసాలు తొలగింపు ప్రతిపాదన చేశాను. మారు మాట లేకుండా ఆ వ్యాసాలు తొలగిస్తాను. ఇదేదో తెవికీపై జరుగుతున్న ఉద్దేశ్య పూర్వక దాడి అనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 08:58, 14 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ వాడుకరి ఉదేశ్యపూర్వకంగానే ఇటువంటి మార్పులు చేస్తున్నట్లుంది. అతను చేర్చిన నటీమణులకు పోర్న్ సైట్ లింకులు చేర్చుతున్నాడు. ఇదివరకు పవన్ సంతోష్ సూచనలను తెలియజేసినా వాటిని చర్చాపేజీలో తొలగిస్తున్నాడు. విపరీతంగా అనవసర చిత్రాలను, పోర్న్ ట్యూబ్ లింకులు ఇస్తున్నాడు. మితిమీరిన అశ్లీల చిత్రాలతో కూడిన ఇటువంటి పోర్న్ స్టార్స్ కు సంబంధించిన వ్యాసాలను తొలగించాలి. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలను రాసే అతనికి హెచ్చరిక చేసి, అటువంటి పనులు మానుకోకపోతే నిరోధించాలి.--కె.వెంకటరమణచర్చ 12:22, 14 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ వాడుకరి కొత్త వాడుకరి కాదనిపిస్తుంది. మూలాలు, లింకులు, చిత్రాల చేర్పు వంటి వికీ సాంకేతిక విషయాలను సునాయాసంగా చేస్తున్నాడు. వికీని పోర్న్‌వికీగా మార్చే ఉద్దేశ్యంతో బ్లూఫిలిం నటీమణుల వ్యాసాలను కావాలని చేరుస్తున్నట్లుంది. తెవికీపై ఉద్దేశ్య పూర్వక దాడి అనిపిస్తుంది. తొలగింపు మూసలు పెడితే మూసలను తొలగిస్తాడు. చర్చాపేజీలో ఎవరైనా రాస్తే చర్చలను తొలగిస్తాడు.--కె.వెంకటరమణచర్చ 13:43, 14 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందించిన చదువరి, వెంకటరమణ, రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. మనం చర్చించిన అంశాలను చాలావరకూ అమలుచేశాను. వెంకటరమణ గారు పలు వ్యాసాల్లో తొలగింపు మూసలు పెడితే మూసలు తీసేసి, చర్చలో ఈ వ్యాసం ఉండాలని గట్టిగా రాసేశారు ఆ వాడుకరి. గతంలో పలు వ్యాసాల్లో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే అశ్లీల చిత్రాలు చేర్చడం, వాటిని తొలగిస్తే తిరగ్గొట్టడం లాంటి పనులన్నిటి దృష్ట్యా హెచ్చరించినా ఈ పద్ధతిలో చేస్తూండడంతో వారం రోజుల పాటు నిషేధించాను. విషయప్రాధాన్యత లేని వ్యాసాలను తొలగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:10, 15 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ముసునూరి నాయకుల వ్యాసాల్లో (బహుశా) సాక్‌పప్పెట్ల దాడి జరుగుతోంది

[మార్చు]

ముసునూరి నాయకులు, కాకతీయులకు సంబంధించిన వ్యాసాల్లో పాక్షిక కోణంతో, కుల దృష్టితో పలు మార్పులు చేస్తున్నారు. చారిత్రక వ్యక్తుల పేర్లను (ఉదాహరణకు కాపయనాయకుడు > కాపయభూపతి), వంశాల పేర్లను (ఉదాహరణకు ముసునూరి నాయకులు > ముసునూరి కమ్మరాజులు) కుల దృక్పథంతో మార్పులు చేసేస్తున్నారు. ఇందుకుతోడు కాకతీయుల వంశవృక్షము వ్యాసంలో వేరే వంశీకులైన ముసునూరి నాయకుల పేర్లు చేరుస్తున్నారు. అదేమంటే అప్రామాణిక మూలాలను ఇస్తున్నారే తప్ప ప్రామాణికమైన చరిత్ర గ్రంథాలను ఉటంకించడం లేదు. వాడుకరి:Jiksaw1, వాడుకరి:Redcoxlen అనే వాడుకరి పేర్లు సాక్‌పప్పెట్లు అన్న సందేహం ఉంది. ఇంకా హెచ్చరించలేదు, వ్యాసాల్లో మార్పులు తిరగగొట్టి ముసునూరి నాయకులు, ముసునూరి కాపయ నాయుడు వ్యాసాలను నిరవధికంగా సంరక్షించాను. ఈ రెండు ఖాతాలు సాక్‌పప్పెట్లు కావచ్చు, కాకపోనూవచ్చు. కాకుంటే రెండు ఖాతాలూ ఒకే తరహాలో, ఒకే వ్యాసాల్లో మార్పులుచేర్పులు చేస్తున్నాయి. సాక్‌పప్పెట్లు కాని పక్షంలో ప్రస్తుతం ఈ పనిలో సచేతనంగా ఉన్న Redcoxlen అన్న వాడుకరి మీద నిష్పాక్షికత దెబ్బతీయవద్దన్న సూచనలతో ప్రారంభించి వినకుంటే చర్య తీసుకోవాల్సివుంటుందని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:16, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఈ మార్పులు అనుమానాస్పద మార్పులు గానే తోస్తున్నాయి నాకు కూడా. కాకపోతే నాకు ఈ విషయాలపై పరిజ్ఞానం లేక ప్రశ్నించలేకున్నాను. తగిన విధంగా చర్యలు ప్రారంభించండి. రవిచంద్ర (చర్చ) 08:29, 19 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సాక్ పపెట్లని అనుమానిస్తున్న వాడుకరులపై ఎన్వికీలో ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయించవచ్చు. ఈ పేజీ చూడండి. అక్కడ వివరం దొరక్కపోతే, సంబంధిత పేజీలను చూడండి. __చదువరి (చర్చరచనలు) 08:45, 19 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కింద ప్రస్తావించినవాటిలో చెక్ యూజర్ మినహా మిగిలిన ప్రాథమిక పరిశీలనలో ఈ రెండు ఖాతాలు ఒకే సమయంలో పనిచేయలేదనీ, ఒకదాన్ని సముదాయం అడ్డుకున్నాకా మరోటి సృష్టించి నేరుగా అవే వ్యాసాల్లో అలాంటి మార్పులే చేస్తోందని తేలింది. కానీ రెండూ సాక్‌పప్పెట్లేనని నిర్ధారించుకోవడానికి మనం సాక్‌పప్పెట్లను కనిపెట్టే వ్యవస్థ, దాని అమలు కోసం కనీసం ఇద్దరు ప్రైవసీ పాలసీ అవగాహన ఉన్న వాడుకరులకు చెక్‌యూజర్‌ హోదా ఏర్పరుచుకోవాల్సిన అవసరం వస్తూంది. ఐతే అంతవరకూ ఈ వాడుకరులు (లేదా వాడుకరి) నిష్పాక్షికత దెబ్బతీసే చర్యలు చేస్తూ ఉంటే ఉపేక్షించాల్సిన పనీ లేదు. హెచ్చరించి, ఇంకా నిష్పాక్షికత దెబ్బతీస్తే, ఒక ఉద్దేశాన్ని నెగ్గించుకునే లక్ష్యంతో మార్పులు చేస్తూంటే చర్యలు చేపడదాం. --పవన్ సంతోష్ (చర్చ) 11:47, 20 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్థానికంగా సాక్‌పప్పెట్లను దర్యాప్తు చేసుకునే వ్యసవ్థ

[మార్చు]

వాడుకరి:రవిచంద్ర, చదువరి గార్లు స్పందించినందుకు ధన్యవాదాలు. దీన్ని పరిశీలించిన మీదట కింది విషయాలు నాకు అర్థమయ్యాయి.
సాక్‌పప్పెట్లను దర్యాప్తు చేసుకునేందుకు ఆంగ్ల వికీపీడియాలో ఒక వ్యవస్థ రూపొందించుకున్నారు. రెండు ఖాతాలను పోల్చి, ఆ ఖాతాలు చేస్తున్న కార్యకలాపాలను అంచనావేయడానికి కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. వాటిలోని ఇంటరాక్షన్‌ టైంలైన్‌, ఎడిటర్‌ ఇంటరాక్షన్‌ ఎనలైజర్‌ ప్రధానంగా వాడుతున్నారు. వీటి వల్ల ఇద్దరు ఎడిటర్లు చేసిన మార్పుచేర్పులను, ఏయే పేజీల్లో మార్పులు చేశారు. ఒకే నిమిషం ఇద్దరూ ఏమైనా మార్పు ఎప్పుడైనా చేయగలిగారా వంటివే తెలుసుకోవచ్చు. కానీ అవి సాక్‌పప్పెట్లు అయివుంటాయని నిర్ధారించడానికి చెక్‌యూజర్‌ హోదా అవసరమవుతుంది. మెటాలోని చెక్‌యూజర్‌ విధానం చెప్పేదాని ప్రకారం ప్రతీ వికీపీడియాకు కనీసం ఇద్దరు చెక్‌యూజర్లు ఉండాలి, ఒకరు చేసే పనులను మరొకరు పర్యవేక్షించేందుకు వీలుగా. వీరు తమను తాము నామినేట్ చేసుకుని వికీపీడియా ప్రైవసీ పాలసీని క్షుణ్ణంగా తెలుసుకుని, వాటిపై సముదాయం వేసిన ప్రశ్నలను చక్కగా ఆన్సర్‌ చేసి సముదాయంలో ఆ హోదా ఇవ్వాలని ఏకాభిప్రాయం లభిస్తే, ఆ విషయం సూచిస్తూ రాయవచ్చు. తద్వారా వారికి ఆ హోదా వస్తుంది. ఎందుకంటే - వాడుకరుల ప్రైవసీని (వారు సాక్‌పప్పెట్లే అయినా కూడా) వికీపీడియా చాలా గౌరవిస్తూంది. ఈ హోదా ఉన్నవారికి సాక్‌పప్పెట్‌ రిక్వెస్ట్ వచ్చి పైన చెప్పిన ఉపకరణాల్లో ప్రాథమికంగా వారు సాక్‌పెప్పెట్లు కావచ్చు అన్న విషయం నిర్ధారతమైన తర్వాత కేవలం ఒక ఉపకరణంలాగా వారు ఏయే ఐపీ అడ్రసుల నుంచి ఖాతా సృష్టించి పనిచేస్తున్నారో తెలుసుకునే వీలుంటుంది. తెలుసుకున్న సమాచారాన్ని బట్టి వారు ఒకే నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తున్నారో లేదో చెప్పి ఊరుకోవాలే తప్ప వారి ఐపీ అడ్రసులు సముదాయానికి కానీ, మరెవరికీ కానీ చెప్పడం పూర్తి నిషిద్ధం. వీటన్నిటిని బట్టి సముదాయ సభ్యులు ఆలోచించి చెప్తే చెక్‌యూజర్‌ హోదా మనలో ఇద్దరికి ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యవస్థ ఏర్పరుచుకుని మనమూ పనిచేయవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 11:47, 20 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్జన/ఏకవాక్య వ్యాసాలు

[మార్చు]

రచ్చబండ లో "నిర్జన గ్రామాల తయారీ సరికాదు" అనే విషయంపై చర్చ జరిగినది. ఎటువంటి సమాచారం లేని నిర్జన గ్రామాలను గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు ఈ మధ్య విపరీతంగా సృష్టిస్తున్నారు. ఆ వ్యాసాలలో ఎటువంటి సమాచారం గానీ, మూలాలు గానీ ఉండటం లేదు. అనేక వ్యాసాలను తొలగిస్తున్నా మరల సృష్టిస్తూనే ఉన్నారు. ఇటువంటి చర్యలవలన నిర్వహణ కష్టంగా ఉంది. "గ్రామాల పేజీలను సృష్టించ నవసరం లేదు" అనే శీర్షికతో చదువరి గారు ఆ సభ్యుని చర్చాపేజీలో తెలియజేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా విపరీతంగా మొలకలు సృష్టిస్తూనే ఉన్నారు. కనుక అతనిపై కొంతకాలం పాటు నిరోధం విధిస్తే తన ధోరణి మార్చుకుంటారని భావిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 17:55, 6 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాలు, వికీలింకుల విషయంలో అనేక సార్లు నేను ఆయనకు చెప్పి చూసాను. ఎంత చెప్పినా ఫలితం కనబడ్డం లేదు. ఆయన చర్చాపేజీలో వందలాది తొలగింపు నోటీసులు ఉన్నాయి.. తాను సృష్టించిన వ్యాసాలు అంత ఎక్కువ సంఖ్యలో ఎందుకు తొలగించాల్సి వస్తోందో కూడా ఆయన ఆలోచించడం లేదు. నిరోధం విధిస్తే తప్ప ఫలితం ఉండదని నేను కూడా భావిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 16:55, 7 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]


[మార్చు]

You may wish to consider adding \bfunvampires\.com\b to Mediawiki:Spam-blacklist as user:24narahari is repetitively adding links. As it is only happening at teWP, I don't think that it is yet appropriate to globally blacklist the domain. Billinghurst (చర్చ) 20:50, 4 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Billinghurst, Thanks for your help. I did as suggested (link. Let me know if any correction is needed.--అర్జున (చర్చ) 04:53, 5 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Thumbs up! Thanks. Billinghurst (చర్చ) 06:24, 5 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikimedia password policy and requirements

[మార్చు]

CKoerner (WMF) (talk) 21:21, 6 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సరియైన వర్గాలు నిర్థారించి మిగిలిన వర్గాలు విలీనం లేదా తొలగించుట

[మార్చు]

కొద్దిపాటి అక్షర భేదాలుతో ఈ దిగువ వివరింప బడిన వర్గాలు ఉన్నాయి.

కర్ణాటక

[మార్చు]
యర్రా రామారావు గారికి, లింకులు పైన సరిచేయండి. అప్పుడు ఇతరులు స్పందించటానకి సహాయంగా వుంటుంది.--అర్జున (చర్చ) 10:35, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ

[మార్చు]
  • 1.వర్గం:తెలంగాణ సంబంధించిన మూసలు' 2.'వర్గం:తెలంగాణకు సంబంధించిన మూసలు' 3.'వర్గం:తెలంగాణ మూసలు' అనే మూడు వర్గాలు ఉన్నాయి.ఇవి అన్నీ దాదాపుగా ఒకే విషయానికి సంబదించినవి.ఇలా ఉండుట వలన మూసలు పేజీలు మూడు వర్గాలలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేరుస్తున్నాం.ఏవర్గంలో పూర్తిగా ఉండుటలేదు.ఇందులో మొదటిది 2013 అక్టోబరు 13న,రెండవది 2014 డిశెంబరు24న,మూడవది 2015 జులై 24న సృష్టించబడ్డాయి.మొదటి దానిలోని ఉన్న 4 మూసలు పేజీలు మరిన్ని మూసలు పేజీలు ఉన్న రెండవ వర్గానికి మార్చి తొలగింపు మూస చేర్చాను.ఇక మూడవ వర్గంలో 5 వ్యాసం పేజీలు ఉన్నాయి.ఈ రెండు వర్గాలను విలీనం లేదా మెరుగైన ఒక వర్గం ఉంచి అవసరంలేని వర్గాలు తొలగించవలసి ఉంది. కావున నిర్వాహకులు పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 10:01, 20 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, మూడు మూసలలో వర్గం:తెలంగాణకు సంబంధించిన మూసలు ను ఉంచి మిగిలిన రెండింటిని తొలగించడమైనది. --కె.వెంకటరమణచర్చ 10:14, 20 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]