వాడుకరి చర్చ:Jiksaw1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Jiksaw1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Jiksaw1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   -- Nrgullapalli (చర్చ) 00:20, 21 డిసెంబరు 2017 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం ఎక్కడ దొరికిందీ రిఫరెన్సు ఇలా ఇవ్వాలి - <ref> ఫలాని వెబ్ సైటులో ఆ సమాచారం లభించింది.</ref> అని వ్రాయొచ్చు. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


మునుసూరి నాయకులు పేజీ పేరు మార్పు గురించి[మార్చు]

Jiksaw1 గారూ,
మునుసూరి నాయకులు పేజీపై మీరు చేస్తున్న మార్పులు, మరీ ముఖ్యంగా పేరును మునుసూరి కమ్మ రాజులుగా మార్చడం వికీపీడియా పాలసీలకు వ్యతిరేకంగా ఉంది. వికీపీడియా అన్నది ఒక విజ్ఞాన సర్వస్వం. దీనిలో స్వంత రచనలకు చోటు ఉండదు. ఈ కారణంగా ఒక రాజవంశం పేరును ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంబంధిత ప్రామాణిక చరిత్ర పుస్తకాల్లో ఎలా ఉందో అలానే ఉంచాలి. మునుసూరి నాయకులు కులపరంగా కమ్మ వారు అన్న విషయాన్ని ఇప్పటికే చరిత్రకారులు నిర్ధారించిన కారణంగా అలాగని పేజీలో రాయొచ్చు, కానీ ఆయా చరిత్రకారులు వాడిన ముసునూరు నాయకులు అన్న(అక్కడి పేజీలో ఉన్న బౌద్ధం - ఆంధ్రం పుస్తకం లింకులో చూసినా అలానే ఉంది) పేరును అలానే కొనసాగిద్దాం. దీనిపై ఇప్పటికే ముసునూరి నాయకులు చర్చ పేజీలో జరిగింది. కనుక గమనించి ముసునూరు నాయకులు అన్న పేజీ పేరును మార్చవద్దని సూచిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:38, 9 జనవరి 2018 (UTC)

తటస్థ దృక్కోణానికి భంగం కలిగిస్తున్న మార్పులు[మార్చు]

వాడుకరి:Jiksaw1 గారూ, మీరు గతంలో చేసిన మార్పుల గురించి నేను వికీపీడియా నోటీసుబోర్డులో ప్రస్తావించేవున్నాను. ఈ విషయం తెలిసి మీరు నా చర్చ పేజీలో రాశారు. నేను దానికి సమాధానమిస్తూ సవివరంగా పాలసీలకు ఎలా దెబ్బతగులుతోందో వివరించివున్నాను. ఐతే మీరు మీ పద్ధతిని అదే విధంగా కొనసాగిస్తూ పలు వ్యాసాల్లో నిష్పాక్షికతకు భంగం కలిగించేలాంటి మార్పులుచేస్తూ పోతున్నారు. వికీపీడియాలోని సమాచారానికి అత్యంత కీలకమైన తటస్థ దృక్కోణాన్ని దెబ్బతీస్తూ, కులచరిత్రలు మాత్రమే ప్రస్తావిస్తూ ప్రముఖ చరిత్రకారులు వాడిన పదబంధాలను మార్చివేస్తూ సామ్రాజ్యాలకు, రాజ్యాలకు, నాయకులకు పేర్లలో కులసూచకమైన పదాలను చేరుస్తున్నారు. ఇలా తటస్థ దృక్కోణాన్ని దెబ్బ తీస్తూ, అభిప్రాయాలను, ఉద్దేశాలను ప్రచారం చేస్తూండే పద్ధతి మానుకోవడానికి ఈ కింది పద్ధతులు అనుసరించండి:

  1. సంవత్సరాలుగా ఉన్న వ్యాసాల పేర్లను మార్పుచేసేప్పుడు ముందుగా చర్చ పేజీల్లో రాసి ఇతర సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం సరైన పద్ధతి. నేరుగా వ్యాసం పేరును మార్చవద్దు.
  2. ఎవరైనా వికీపీడియన్ మీరు చేసిన దిద్దుబాట్లు తిప్పికొడితే, ఏదో పొరపాటు ఉందని అర్థం చేసుకోండి. ఆ వ్యాసంలో అదే తరహా మార్పులు చేసేముందు చర్చపేజీలో చర్చించండి. అంతే తప్ప తిప్పికొట్టిన మార్పుల తరహాలోనే మార్పులు చేసుకుంటూ వెళ్ళవద్దు.
  3. ఒకవేళ ఫలానా రాజవంశం వారిది ఫలానా కులం అని ఉన్నంతమాత్రాన చరిత్రకారులు ఆ కులం పేరును రాజవంశం పేరులో వాడాలని లేదు. ప్రామానిక చరిత్రకారులు ఏ పదాన్నైతే వాడారో దానినే కొనసాగించడం సరి. అంతేతప్ప ప్రామాణిక చరిత్రరచన చేసినవారు వాడని పదబంధాలను వాడకూడదు. ఎందుకంటే వికీపీడియాలో స్వంత పరిశోధన తగదు.
  4. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయం ఉంటే దానికి సంబంధించిన అన్ని వాదనలను రాసి తటస్థంగా వ్యాసం ఊరుకోవాల్సివుంటుంది. అంతేతప్ప ఒక వాదన సరి అని తేల్చకూడదు. ఉదాహరణకు మీరు కాకతీయుల కులపరమైన చర్చను ఇతర వాదనలు ఇచ్చి తుదకు వారు కమ్మవారన్నట్టుగా నిర్ణయాన్ని తెలిపారు. తద్వారా తటస్థత దెబ్బతింది. ఇలాంటి పని మీరు బ్లాగుల్లో చేస్తే సమస్య లేదు, కానీ వికీపీడియాలో మాత్రం సరికాదు.

ఈ పద్ధతులు అనుసరించకుండా ఇదే విధంగా కొనసాగుతూ మార్పుచేర్పులు చేస్తే వికీపీడియా వ్యాసాల తటస్థతకు, సమగ్రతకు ఉద్దేశపూర్వకంగా కొన్ని లక్ష్యాల కోసం భంగం కలిగిస్తున్నట్టు భావించాల్సివస్తుందని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 10:50, 8 ఫిబ్రవరి 2018 (UTC)

సంయమనం[మార్చు]

మీ మార్పుల ద్వారా మాత్రమే కాక తొటి సభ్యులతోనూ మీరు వ్యవహరిస్తున్న తీరు అంత సంతృప్తిగా లేదు. ముందుగా తెవికీ పాలసీల గురించి కొంత చదవండి. తరువాత మీకు ఏవైనా మార్పులు చేయాలనిపిస్తే వాటి పై మొదట చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైతే కొనసాగించండి.... తెవికీ ఎవరికీ అనుకూలం కాదు. .. ఇక్కడ సభ్యులు తటస్థంగా మార్పులు చేస్తారు.. మీ సృజనాత్మక మార్పులు కుల సంభందితంగా కాక మిగతా వ్యాసాల్లో చేస్తే మాకందరికీ ఆనందం కలిగించిన వారవుతారు..మిత్రుడు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 03:20, 16 ఫిబ్రవరి 2018 (UTC)

Jiksaw1 గారూ! మీరన్న విషయాన్ని తటస్థతకు దెబ్బ తగలకుండా, వ్యాసం సమగ్రత చెడిపోకుండా ఇలా తేలికగా రాయవచ్చు. ఈమాత్రానికి వాదోపవాదాలు, వ్యక్తిగత దాడులు అనవసరం సార్. --పవన్ సంతోష్ (చర్చ) 10:56, 16 ఫిబ్రవరి 2018 (UTC)

మీ మార్పులు[మార్చు]

ఎంతొ ప్రయాసపడి పరిశోధన చేసి నేను వ్రాసిన పలు వ్యాసాలను మీరు పేరులు మార్చి, పలు విధములుగా మార్పులు చేశారు. ముఖ్యముగా నాయకులను "రాజులు" గా సంబోధించి చరిత్రను వక్రీకరించుతున్నారు. విజయనగర రాజ్యములో ని సామంతరాజులు ఎప్పుడూ స్వతంత్ర రాజ్యములు ఏలలేదు. అలాగే ముసునూరి వారు కాకతీయ చక్రవర్తులపై గౌరవముతో తమను తాము రాజులు గా చెప్పుకొనలేదు. మరియొక కారణము పలు నాయకులను ఏకముచేసి ఓరుగల్లు విముక్తము చేసిన సంఘటితశక్తి ముసునూరి వారు. వారి గొప్పతనము చరిత్ర కొనియాడుతుంది. "రాజులు" అని అన్నంత మాత్రాన క్రొత్తగా గొప్పతనము రాదు. అటులనే కమ్మవారు క్షత్రియులు అని మార్పులు చేశారు. కమ్మవారి శాసనములన్నింటిలోను దుర్జయ వంశము, చతుర్ఠ కులము అనే చెప్పుకున్నారు. "క్షత్రియులు" అని అన్నంత మాత్రాన వారి గొప్పతనము పెరగదు. మీరు వ్యాసములో సోమశేఖర శర్మ గారి వాక్యాలు పరిశీలించండి. క్షత్రియ రాజులు, రాజ్యాలు తురకలకు లొంగిపోయిన సమయములో విప్లవము లేవదీసి రాజ్యవిముక్తిగావించిన నాయకులు ముసునూరి వారు. అంతకన్న గొప్పవిషయము ఏముంటుంది? దయచేసి చరిత్రను చర్రిత్రగా స్వీకరించండి.Kumarrao (చర్చ) 19:12, 26 ఫిబ్రవరి 2018 (UTC)