వాడుకరి చర్చ:Pavan (CIS-A2K)

వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:Pavan Santhosh (CIS-A2K) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


Pavan (CIS-A2K) గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Pavan (CIS-A2K) గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 07:41, 24 జనవరి 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
కీ బోర్డు అడ్డదారులు

తెలుగు వికీపీడియాలో కీ బోర్డు అడ్డదారులని ఉపయోగించి మీరు మీ పనిని వేగంగా కానివ్వవచ్చు. తెలుగు మరియు ఇంగ్లీషు భాషల మధ్య మారడానికి Ctrl-[ (మ్యాకింటాష్ లో లేదు) వాడవచ్చు. ఇలాంటి కొన్ని అడ్డదార్లను క్రింద చూడండి.

alt-e / alt-Shift-e - వ్యాసాన్ని మార్చడానికి,
alt-p / alt-Shift-p - దిద్దుబాట్లను సరిచూసుకోవడానికి,
alt-x / alt-Shift-x - యాదృచ్చిక పేజీ కొరకు,
alt-s / alt-Shift-s - పేజీ భద్రపరచడానికి
ఈ పైనివి విండోస్ లో, alt బదులు ctrl వాడితే ఈ అడ్డదార్లనే మ్యాకింటాష్‌లో కూడా వాడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 07:41, 24 జనవరి 2018 (UTC)

చలం[మార్చు]

నెను వ్రాస్థున్న వ్యాసాలకి మూలాలు ఎలా వేతకాలి? నాకు చలం కు సంబందించిన మూలాలు దొరకటం లెదు.

తెవికీలో మూలాల గురించి చిన్న ప్రెజంటేషన్
మూలాలను చాలాచోట్ల నుంచి తెచ్చుకోవచ్చు. అంతర్జాలంలో ఉన్న మూలాల్లో చూస్తే భూమిక పత్రికలో మైదానం గురించి, సాక్షి పత్రికలో మైదానం నవల గురించి మంచి సమాచారమే దొరుకుతోంది. ఐతే ఈ మూలాల విషయంలో అవి సంపాదకుల నియంత్రణ ఉన్న పత్రికల్లో ప్రచురితమైనవనీ, ఒకదాని వ్యాసకర్త బహు గ్రంథకర్త అనీ గుర్తించాలి. అలాంటి మూలాలు మరిన్ని కావాలంటే ప్రయత్నిస్తాను, దయచేసి pavansanthosh.s@gmail.com వద్ద సంప్రదించండి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 18:48, 27 ఫిబ్రవరి 2018 (UTC)

Thank you. Updated the url.

గ్రామ వ్యాసాలు ఎలా వుండాలి?[మార్చు]

పవన్ గారూ...............

గ్రామ వ్యాసాలు ఎలా వుండాలి? అనే విషయమై చర్చ జరుగు తున్న ఈ సందర్బంలో....... మీరు పంపిన పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలను ఎక్కిస్తున్నాను. దయ చేసి గమనించ గలరు. ఆయా వ్యాసాలలోని ఆంగ్ల పదాలను తెలుగులో వ్రాయడము, ఖాళీలను పూరించడము, గ్రామాల నామాలకు లింకులు ఇవ్వడము, వంటివి చేస్తున్నాను. ఇంకా ఏ విధంగా మెరుగు పరచగలమో...... ఒక గ్రామ వ్యాసాన్ని తీసుకొని మెరుగు పరచి చూపిస్తే దాన్ని ఆధారంగా మిగతా వాటిని ఆ విధంగా వ్రాసేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదాలతో Bhaskaranaidu (చర్చ) 14:44, 10 ఏప్రిల్ 2018 (UTC)

భాస్కరనాయుడు గారూ! ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, మీ కృషిని మెరుగుపరుచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బావుంది. జనగణన సమాచారం మనం ఎక్కించాకా, ఎలా అభివృద్ధి చేయొచ్చన్నదానికి గురవాయి గూడెం ఒక ఉదాహరణగా తీసుకుని తోచినంత అభివృద్ధి చేశాం. వ్యాసంలో ఇప్పటికే సమాచారం ఉండడంతో ఈ కృషి విషయంలో మంచి ఉదాహరణ అవుతుందని భావన. గురవాయి గూడెం వ్యాసం చరిత్రను చూడండికి వెళ్ళి, సవరణ సారాంశాలు చదువుతూ మార్పులను పరిశీలిస్తూ చూడండి. మీకు ఇది ఉపయోగపడితే ఇక్కడ తెలియజేయగలరు. హ్యాపీ ఎడిటింగ్. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:26, 17 ఏప్రిల్ 2018 (UTC)
పవన్ గారూ.......

మీరు ఉదాహరణగా చూపిన గురువాయి గూడెం గ్రామ వ్యాసాన్ని గమనించాను. అందులో నాకు అవగహన అయిన విషయం ఏమంటే..... దానిలో మొదటి పేరా మాత్రం పొడిగించబడి వుంది, మిగితా ఉప శీర్షికలు యధాతధంగా వున్నాయి. ఈ పొడిగించబడిన గ్రామ వ్యాస బాగాలు కూడ దాని క్రింద వున్న ఉప శీర్షికలలోని విషయమే. ఉదాహరణకు..... గ్రామ జనబా, గ్రామములోని విద్యా సౌకర్యాలు మొదలగు వివరాలు తిరిగి మొదటి పేరాలో పునరుక్తమైనవి. దీనివలన ఉపయోగము ఉందని నాకనిపించడము లేదు. ఒక వేళ అలాగే వ్రాయాలనేది అధికారుల నిర్ణయమైతే .... ఆయా జిల్లాల గ్రామ వ్యాసాలు పూర్తయిన తర్వాత మరల మొదటికి వచ్చి మీరు చెప్పినట్టు ఆ వ్యాసంలోని ఉప శీర్షికల్లోని కొంత విషయాన్ని మొదటి పేరాలో అతికించ వచ్చు, కనుక మనం ఇదివరకు వ్రాసినట్లు గ్రామ వ్యాసాలను పూర్తి చేస్తాను.

ప్రస్తుతం నేను చేస్తున్న కొత్త మార్పు ఏమంటే (నిజానికి ఇది గతంలో అనుకున్నదే) విద్యా సౌకర్యాలు అన్న ఉప శీర్షికలో ఒకే గ్రామం పేరు పలు మార్లు వ్రాయ బడ్డాయి. ఉదాహరణకు..... జంగారెడ్డి గూడెంలో పాలటెక్నిక్ వున్నది జంగా రెడ్డి గూడెంలో బాల బడి వున్నది. సమీప అనియత విద్యా కేంద్రం జంగారెడ్డిగూడెంలోను, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, జంగారెడ్డిగూడెం లోను వున్నాయి. ఇలా ఒకే గ్రామాన్ని పలు మార్లు వ్రాయడము జరిగింది దీన్ని నేను మార్చి... ఆ గ్రామనామాన్ని వ్రాసి ఆ గ్రామములో ఏ, ఏ, సౌకర్యాలున్నాయో అవన్నీ వ్రాశాను, దీని వల్ల ఒక గ్రామ నామాము మాటి మాటీకి వ్రాయ నవసరము లేదు ఇటు వంటి మార్పు విశాఖ పట్నం జిల్లా గ్రామాలలో ముంచంగి పుట్టు మండలం లోనీ గ్రామాలన్నిటికి, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగ రెడ్డి గూడెం మండలం లోని గ్రామాలనన్నిటికి, ఇంకా కొన్ని జిల్లా గ్రామాలకు వ్రాశాను. గమనించగలరు. ఈ మార్పును మాత్రము ఇక మీదట వ్రాయాబోయే గ్రామాలకు అవలంబిస్తాను.

ఈ విషయంలో ఇంకేమైనా సూచనలు వుంటే తెలియ జేయ గలరు. Bhaskaranaidu (చర్చ) 14:28, 17 ఏప్రిల్ 2018 (UTC)

మరొక విషయం .....

గుళ్ళ పల్లి గారికి లింకు ఇచ్చే విషయమై మాట్లాడాను. ప్రస్తుతం లింకులు ఇవ్వడము ఆపేశాడు. నా మనవి ఏమంటే .... అతనికి ఒక జిల్లా (ఆంద్రప్రదేశ్ లోనివి) గ్రామ వ్యాసాలు పంపండి. దానిపై పని చేస్తానంటున్నారు. ఆ విషయంలో అతనికి నేను కొంత సహాయ పడగలను, ధన్య వాదాలతో Bhaskaranaidu (చర్చ) 14:28, 17 ఏప్రిల్ 2018 (UTC)

భాస్కరనాయుడు గారూ! వ్యాస పరిచయం రెండో పేరాలో మొత్తం వ్యాసాన్ని సమీక్షించడం అన్నది నేను చూపించిన పద్ధతి. వ్యాస పరిచయం ఉండాల్సిన శైలి గురించిన పేజీ చూస్తే "వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాసం పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లు ప్రస్తావించాలి." అన్న సూత్రాన్ని అనుసరించి రాశాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 15:35, 17 ఏప్రిల్ 2018 (UTC)
పవన్ గారూ....

మీరు పంపిన పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాల వ్యాసాలు 501 పూర్తయినవి. అదే జిల్లాలోని మిగతా మండలాల గ్రామాల వ్యాసాలను (ఏలూరు మండలం నుండి పంప గలరు. Bhaskaranaidu (చర్చ) 05:09, 3 మే 2018 (UTC)

పైన కోరిన గ్రామ వ్యాసాలు ఇంకాపంప లేదు. త్వరలో పంపగలరు. Bhaskaranaidu (చర్చ) 09:22, 8 జూన్ 2018 (UTC)
భాస్కరనాయుడు గారూ ఇప్పుడే మెయిల్‌దారిన పంపాను చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:49, 8 జూన్ 2018 (UTC)
పవన్ గారూ.........

మీరు పంపిన రెండో విడత ప.గో జిల్లాల గ్రామ వ్యాసాలను ఎక్కించడము ప్రారంబించాను. కొంత పని జరిగాక నేను గమనించిందేమిటంటే???? అందులో కొన్ని గ్రామ వ్యాసాలు ఇదివరకే మీరు ఎక్కించారు. ఎవరికి కేటాయించిన పని వారు చేసి నట్లు..... ఎలాగంటే? విస్తర్లు వేసే వాళ్లు విస్తర్లు వేయగా.... విస్తర్లు తీసే వారు తీసేస్తూ వెళ్ళారట . అలాగుంది నాపని. చివరకు ఎవరు బోంచేయ లేదట.. మీరు ఆయా గ్రామాల విషయాన్ని ఇదివరకే ఎక్కించారన్న విషయాన్ని గమనించక నాపని నేను చేశాను. దాంతో కొన్ని గ్రామాల వ్యాసాల ఉప విభాగలలోని విషయము రెండో సారి వ్రాసినట్టయింది. గమనించగలరు. వీటి పని తర్వాత చూస్తాను. Bhaskaranaidu (చర్చ) 17:48, 11 జూన్ 2018 (UTC)

పవన్ గారూ........
మీరు పంపిన తూగో జిల్లా గ్రామాలు పూర్తయినవి.  ఇంకా ఏమైనా ఆంధ్రా జిల్లాల గ్రామాల వ్యాసాలు పంపగలరు.

Bhaskaranaidu (చర్చ) 15:15, 19 జూన్ 2018 (UTC)

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 16:22, 10 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 20:10, 20 సెప్టెంబరు 2019 (UTC)