వాడుకరి చర్చ:ఉదయ్ కిరణ్ గొడ్డు వెలగల

వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:ఉదయ్ కిరణ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

ఉదయ్ కిరణ్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

ఉదయ్ కిరణ్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
 • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
 • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
 • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
 • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
 • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
 • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
 • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 10:21, 22 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తక్కువ సైజు వ్యాసాల రచన[మార్చు]

@ఉదయ్ కిరణ్ గారూ... వికీలో చురుగ్గా రచనలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. గత రెండురోజులుగా బ్రే వ్యాట్, డబ్ల్యూ డబ్ల్యూ ఈ, వినోద్ ప్రకాష్ శర్మ, గొడ్డువెలగల వ్యాసాలు రాశారు. అవన్నీ చాలా తక్కువ సైజులో ఉన్నాయి. వికీలో ఎన్ని వ్యాసాలు రాశాం అనికాకుండా, ఎంత మంచి సమాచారం చేర్చామనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి, ఇప్పటివరకు మీరు రాసిన వ్యాసాలన్నింటినీ వీలైనంత మేరకు అభివృద్ధి చేయగలరు. వికీలో కొత్త వ్యాసాలను రాయడానికి ముందు, ఇంతకుముందు వికీలో ఉన్న వ్యక్తుల వ్యాసాలను పరిశీలించి వికీ రచనపై అవగాహన పెంచుకోగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:36, 25 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@ఉదయ్ కిరణ్ గారూ... నిన్ని మీకు చెప్పిన తరువాత కూడా మీరు మళ్ళీ తక్కువ సైజులో (మొలక) వ్యాసాలు (క్రేయాన్ షిన్-చాన్, Bray Wyatt) రాస్తున్నారు. అలాంటి వాటివల్ల తెవికీకి ఉపయోగం లేదు. అవన్నీ తొలగించబడుతాయి. వీలైనంత ఎక్కువ (5వేల బైట్లకుపైగా) సైజులో వ్యాసాలు రాయగలరు. ధన్యవాదాలు. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:14, 26 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల అనువాదం[మార్చు]

@ఉదయ్ కిరణ్ గారూ, తెలుగు వికీపీడియాలో వ్యాసంపేరు తెలుగులోనే ఉండాలి. వ్యాసంలో "మరియు", "యొక్క" అనే పదాలు ఉపయోగించకూడదు. "మరియు" స్థానంలో "," (కామా) ను ఉపయోగించండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:39, 26 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల అనువాదం[మార్చు]

ఉదయ్ కిరణ్ గారూ, మొబైల్లో అనువాద పరికరం ద్వారా విభాగాలను అనువదిస్తూ పేజీలను సృష్టిస్తున్నారు. వికీకి కొత్తవారైనా చొరవగా వ్యాసాలు రాస్తున్నందుకు మీకు అభినందనలు. అనువాద పరికరం వాడి రాస్తున్నందుకు మరోసారి అభినందనలు.

అనువాద పరికరం వాడి చాలా వేగంగా వ్యాసాలను రాయవచ్చు. అందుకు మీరు సృష్టించిన పాల్ హేమాన్‎, రోమన్ రింగ్స్‎‎ వ్యాసాలు మంచి ఉదాహరణలు. అయితే ఈ యాంత్రిక అనువాదం వలన ఒక పెద్ద సమస్య ఉంది. అవి చేసే అనువాదాల్లో భాష లోపభూయిష్టంగా ఉంటుంది. వాక్యాలు వ్యాకరణయుక్తంగా ఉండవు. కింది ఉదాహరణలు చూడండి:

 • "హేమాన్ సెప్టెంబరు 11, 1965న న్యూయార్క్ నగరంలోని ది బ్రాంక్స్‌లో సులమిత ( నీ స్జార్ఫ్; 1928-2009) మరియు రిచర్డ్ ఎస్. హేమాన్ (1926-2013), ఒక ప్రముఖ వ్యక్తిగత జన్మించాడు" - పాల్ హేమాన్ వ్యాసంలో
 • "అతను వృత్తిపరమైన రెజ్లింగ్‌లో వృత్తిని కొనసాగించాడు మరియు 2010లో WWE చేత సంతకం చేయబడ్డాడు, వారి అభివృద్ధి ప్రాంతమైన ఫ్లోరిడా ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ (FCW)కి నివేదించాడు." - రోమన్ రింగ్స్ వ్యాసంలో.

యంత్రం ఇలాంటి తప్పుల తడక వాక్యాలు రాస్తుంది. అలాగే పైన ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్లు "మరియు" లాంటి అసహజమైన భాష రాస్తుంది. వాటిని సవరించి ప్రచురించుకోవాలి.

పాల్ హేమాన్ వ్యాసంలో మీరు రాసిన కింది వాక్యాలను చూడండి:

"ఇతను అమెరికాలోని మల్లయోధులకు శిక్షణ ఇస్తుంటాడు. ఇతను అమెరికాలో వ్యాపారవేత్తలలో ప్రముఖుడిగా పేరుపొందాడు. అమెరికాలో చాలా విద్యాసంస్థలను నడుపుతున్నాడు. అమెరికాలోని ధనవంతుల జాబితాలో ఇతను 20వ స్థానంలో ఉన్నాడు." ఇవి అనువాద పరికరం ద్వారా వచ్చినవి కావు, నేరుగా మీరు రాసినవి లాగా ఉన్నాయి. అంచేతనే అవి సహజంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకూ యాంత్రికానువాదాన్ని కూడా ఇలాగే సవరించి ప్రచురించండి. అలాంటి వ్యాసాలకు మంచి విలువ ఉంటుంది. లేదంటే చదివే పాఠకులకు విముఖత కలిగిస్తాయి. నేను ఒక పాఠకుడిగా ఆ వ్యాసాలను చదివితే నాకు అలాగే అనిపించింది. కొద్దిపాటి దోషాలైతే వెంటనే సవరించేసేవాణ్ణి (వికీలో మనం చెయ్యాల్సింది అదే కదా!) కానీ మొత్తం వ్యాసమంతా తిరగరాయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకముందు దీనిపట్ల జాగ్రత్త వహిస్తారని ఇక్కడ రాస్తున్నాను.

వేగంగా రాయడం కోసం అనువాద పరికరాన్ని వాడుకోవాల్సిందే, నాణ్యత కోసం దాన్ని మానవికంగా సవరించుకోవాల్సిందే. రెండూ చెయ్యాలి. పరిశీలించండి.

వికీలో వ్యాసాలు రాస్తున్నందుకు మళ్ళీ అభినందనలు. __ చదువరి (చర్చరచనలు) 13:27, 27 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సహాయ కేంద్రం పేజీని ఉపయోగించండి[మార్చు]

@ఉదయ్ కిరణ్ గారూ... మీకు వికీ రచనలో ఏదైనా సహాయం కావాలంటే వికీపీడియా:సహాయ కేంద్రం పేజీలో రాయండి. వికీ సభ్యులు మీకు సహకారం అందిస్తారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:33, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తక్కువ సైజు వ్యాసాల రచన[మార్చు]

@ఉదయ్ కిరణ్ గారూ...మీరు తక్కువ సైజులో మూలాలు లేకుండా వ్యాసాలను రాస్తూ, ఇతరులను వాటిలో సవరణలు చేయమని చెపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముందుగా మీరు వ్యాసాలను మరింత ఎక్కువ సమాచారంతో, తగిన మూలాలతో రాయండి. ఆ తరువాత, ఇంకా ఏదైనా సమాచారం ఉంటే ఇతర వికీపీడియన్లు చేరుస్తారు. ఎక్కువ సమాచారం, తగిన మూలాలు లేకుండా రాసినవ్యాసాలు తొలగించబడుతాయని మీకు మరోమారు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటే, ప్రతిసారి ఇతర వాడుకరుల చర్చాపేజీలో కాకుండా ఆయా వ్యాసాలకు సంబంధించిన చర్చాపేజీలో రాయండి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:50, 6 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@ఉదయ్ కిరణ్ గారూ, మీరు వాడుకరి:ఉదయ్ కిరణ్/కీసరి నర్సింగం వ్యాసాన్ని వికీ పద్దతిలో మార్చకుండానే ప్రధాన పేరుబరికి తరలిస్తున్నారు. అలా చేయకూడదు. ముందుగా మీరు ఆ వ్యాసాన్ని మరింత ఎక్కువ సమాచారంతో, తగిన మూలాలతో విస్తరించండి. ఆ తరువాత వ్యాస విస్తరణ గురించి వ్యాసం చర్చాపేజీలో రాస్తే, ఇతర వికీపీడియన్లు ఆ వ్యాసాన్ని పరిశీలించి, సరిగా ఉంటే ప్రధాన పేరుబరికి తరలిస్తారు. ఇది గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:49, 7 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ రాజుగారు నాపై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నాను ‌ మీరు చెప్పినట్టే కీసరి నర్సింగం వ్యాసంలో మార్పులు చేయను. ఉదయ్ కిరణ్ (చర్చ) 06:59, 8 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@ఉదయ్ కిరణ్ గారూ... మీరు వికీ శైలీలో లేకుండా, వికీ సభ్యుల సూచనలు పట్టించుకోకుండా వ్యాసాలు రాస్తున్నారు. వికీలో ఎన్ని వ్యాసాలు రాశాం అనికాకుండా, ఎంత మంచి సమాచారం చేర్చామనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి, ఇప్పటివరకు మీరు రాసిన వ్యాసాలన్నింటినీ వీలైనంత మేరకు అభివృద్ధి చేయగలరు. వికీలో కొత్త వ్యాసాలను రాయడానికి ముందు, ఇంతకుముందు వికీలో ఉన్న వ్యక్తుల వ్యాసాలను పరిశీలించి వికీ రచనపై అవగాహన పెంచుకోగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:45, 8 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్ రాజుగారు నాపై నిషేధం ఎత్తివేయండి. తప్పకుండా ఇతర వికీపీడియాన్ ల సూచనలను తప్పకుండా పాటిస్తాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 08:50, 9 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@ఉదయ్ కిరణ్ గారూ... మూడురోజుల నిషేధం రేపటితో ముగుస్తుంది. అంతవరకు వేచి ఉండగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:01, 9 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు యాంత్రిక అనువాదం చేస్తున్న వ్యాసాలను తెవికీ శైలిలో శుద్ధి చేయండి. కొన్ని వ్యాసాలలో "మరియు" అనే పదం విపరీతంగా ఉంటుంది. అది లేకుండా సరైన రీతిలో వాక్యాలను శుద్ధి చేయండి. మీరు రాసిన వ్యాసాలలో చివర "మూలాలు" అనే విభాగాన్ని చేర్చి {{మూలాలజాబితా}} అనే మూసను చేర్చండి. అప్పుడు మీరు వ్యాసంలో చేర్చిన మూలాలన్నీ ఆ విభాగం లోకి చేరుతాయి. వికీశైలిలో వ్యాసాలను రాయండి. ఎన్ని వ్యాసాలు చేర్చాము అనేది కాకుండా ఎన్ని వ్యాసాలు దోషాల రహితంగా, వికీశైలిలో రాయడం ముఖ్యమని గమనించాలి. మీరు రాసిన వ్యాసాన్ని పూర్తి చేసిన తరువాతనే వేరొక వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నించండి.➤ కె.వెంకటరమణచర్చ 12:50, 10 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@ఉదయ్ కిరణ్ గారూ, మీరు మళ్ళీ అదే పద్దతి కొనసాగిస్తున్నారు. పైన చెప్పిన సూచనలు పాటించడంలేదు. 'మీరు రాసిన వ్యాసాన్ని పూర్తి చేసిన తరువాతనే వేరొక వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నించండి' అని కె.వెంకటరమణ గారు చెప్పినా కూడా పట్టించకోకుండా మళ్ళీ ఈ రోజు అదే పద్దతిలో Pol Pot, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యాసాలు రాశారు. ఇన్నిసార్లు చెప్పించుకోవడం బాగాలేదు. అలానే కొనసాగితే మళ్ళీ మీ ఖాతాపై శాశ్వత నిరోధం విధించాల్సివుంటుంది. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:39, 11 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సూచనలు[మార్చు]

మీరు రాసిన వ్యాసాలలో వర్గాలను చేర్చండి. తేదీని "సంవత్సరం - నెల - తేదీ" (ఉదా:1989 అక్టోబరు 2) అనే వికీ శైలి ప్రకారం రాయండి. ➤ కె.వెంకటరమణచర్చ 12:53, 10 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ కుటుంబాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇలాంటి పేజీలు భవిష్యత్తులో నిర్వహణ చాలాకష్టం.దీనిలో చేర్చటానికి ఏ ప్రాతిపదికన చేర్చాలి.దీనికి తగిన మార్గదర్శకాలు ఏమున్నాయి. అసలు రాజకీయ కుటుంబం అనే దానికి నిర్వచనం ఏమిటి.దీనిమీద ఈ సందేహాలు ఉన్నవి.
 1. అసలు ఆ పేజీ అంత అవసరమా?అవసరమే అనుకుంటే....
 2. గల్లీకొక రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి వీరు కుటుంబాలు కూడా ఇందులో చేరవచ్చా లేక ఎన్నికలలో నిలబడిన వ్యక్తుల కుటుంబాలు మాత్రమే ఇందులోకి వస్తాయా?
 3. ఒక వేళ ఎన్నికలలో నిలబడిన వ్యక్తుల కుటుంబాలు మాత్రమే పరిగణనలోకి వస్తాయనుకుంటే గ్రామ పంచాయితీ సభ్యుని కుటుంబాలు కూడా ఇందులోకి చేర్చవచ్చుగదా!
 4. ఎవరైనా వాళ్ల పూర్వీకులు ఎప్పడో రాజకీయాలలో పాల్గొన్నాడని వాళ్ల కుటుంబం పేరు చేరుస్తాడు.దానిని ఎలా కాదంటారు.? ఇలాంటి వాటికి మూలాలు ఏమి చూపిస్తారు.?

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ కుటుంబాలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 06:10, 15 సెప్టెంబరు 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 06:10, 15 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సూచనలు[మార్చు]

ఉదయ కిరణ్ గారూ, వినోద్ ప్రకాష్ శర్మ వ్యాసం బాగా రాసారు. మీరు వ్యాసం రాసిన తరువాత "మూలాలు" అనే విభాగాన్ని చేర్చండి. అందులో {{tl|మూలాలజాబితా}} అనే మూసను చేర్చండి. వ్యాసాన్ని భద్రపరచిత తరువాత మూలాలు ఆ విభాగంలోనికి చేరుతాయి. వ్యాసం రాసిన తరువాత దిగువ భాగంలో వర్గాలను చేర్చండి. ఏదైనా సహాయం కావలసి వస్తే మమ్మల్ని సంప్రదించండి.➤ కె.వెంకటరమణచర్చ 14:20, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నా ఇతర వాడుకరి ఖాతాలు[మార్చు]

@గొడ్డు వెలుగలు ఉదయ్ కిరణ్

@గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ (చర్చ) 02:35, 13 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ ఉదయ్ కిరణ్ గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:54, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సంతకం, చర్చ పేజీ పేరు వగైరా[మార్చు]

ఉదయ్ కిరణ్ గారూ, కొన్ని సూచనలు:

 • చర్చ పేజీల్లో సంతకం చెయ్యాలంటే నాలుగు టిల్డెలను టైపు చేస్తే సరిపోతుంది. టిల్డె అంటే కీబోర్డులో ఎడమ వైపు పైన esc అనే కీ కింద ~ ఇలా ఉండే మీట. దాన్ని (షిఫ్ట్ కీతో కలిపి) నాలుగు సార్లు నొక్కితే అది మీ సంతకంగా మారుతుంది. ఈ చర్చ పేజీలో పైన మీకు పలికిన స్వాగతంలో దాన్ని వివరించారు, చూడండి. (ప్రాజెక్టు పేజీల్లో మీ పేరుకు ఇస్తున్న లింకును గమనించి ఇది రాస్తున్నాను. మీకు సంతకం సంగతి ఈసరికే తెలిస్తే దీన్ని పట్టించుకోకండి)
 • బులెట్ లిస్టులో ఒక బులెట్ రావాలంటే ఆ లైనులో ముందు * (స్టార్) నొక్కి రాయాలి. నంబర్‌డ్ లిస్టులో నంబరు రావాలంటే # (హ్యాష్) నొక్కి రాయాలి.

పోతే మీ ఈ చర్చ పేజీని దారిమార్పు చేసారు ఎందుకో తెలియదు. కానీ అలా చెయ్యకుండా ఉంటే మంచిదనుకుంటాను. దాని వలన పెద్దగా సమస్య ఏమీ ఉండదేమో గానీ, సంప్రదాయం కాదనుకుంటాను, నాకు స్పష్టంగా తెలీదు. ఒకట్రెండు సమస్యలు మాత్రం చెప్పగలను:

 • మీ చర్చ పేజీకి వచ్చి ఇక్కడి నుండి "వాడుకరి రచనలు" అనే లింకును (అది సైడుబార్‌లో ఉంటుంది) క్లిక్కు చేద్దాం అనుకుంటే, ఇలా దారిమార్పు చేసిన పేజీలో ఆ లింకు అసలు ఉండదు.
 • ఈ చర్చ పేజీలో ఏమైనా రాద్దామంటే, "ఈ వికీలో "ఉదయ్ కిరణ్ గొడ్డు వెలగల" అనే వాడుకరి ఖాతా నమోదై లేదు. మీరు ఈ పేజీని సృష్టించాలని/సరిదిద్దాలని అనుకుంటున్నారేమో చూడండి." అని సందేశం వస్తోంది. నాబోటి వాడుకరులకు అది కొంత తికమక పెడుతుంది.

దీన్ని అసలు పేరుకే తరలిస్తే మంచిదేమో పరిశీలించండి. ఒకవేళ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడంలో మీకు సమస్య ఎదురైతే ("అలా తరలించే అనుమతి మీకు లేదు" లాంటి సందేశం కనబడితే) ఎవరైనా నిర్వాహకులను అడగండి, చేసిపెడతారు. అన్నట్టు సంతకంలో మీపేరు ఉదయ్ కిరణ్ అని కాకుండా మీ ఇంటిపేరుతో సహా పెట్టుకోవాలంటే అలా చేసే వీలుంది. "మీ అభిరుచులు" లో చూడండి.

మరొక సూచన: స్నేహపూర్వకంగానే చేస్తున్నానండి. తెవికీలో అన్ని విషయాలూ అందరికీ తెలియాలని ఏమీ లేదు. పద్దెనిమిదేళ్ళుగా ఇక్కడ ఉన్నానని పేరుకే గానీ, ఇప్పటికీ నాకు తెలీని బోలెడు సంగతులున్నై ఇక్కడ. మనకు తెలీని విషయాల గురించి ఇతరులను అడిగి తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలి కూడాను. నా మటుకు నేను మీకు ఏ సహాయం కావాలన్నా నాకు తెలిసినంత మేరకు మీకు తోడ్పడగలను. సంకోచించకుండా అడగండి. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 14:44, 16 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

భారత సాధారణ/సార్వత్రిక ఎన్నికలు[మార్చు]

ఉదయ్ కిరణ్ గారూ, "భారత సాధారణ ఎన్నికలు" అనే పేరును "భారత సార్వత్రిక ఎన్నికలు" అనే రూపంలో పెట్టాలని అనుకున్నాం. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 05:23, 28 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. దారి మార్పు చేశాను ఉదయ్ కిరణ్ (చర్చ) 05:33, 28 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీతో సంప్రదించుటకు[మార్చు]

@ఉదయ్ కిరణ్ గారూ తెలుగు వికీపీడియాలో మీరు వ్యాసాలు సృష్టిస్తునందుకు ధన్యవాదాలు.వికీని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలిసిన అవసరం కోసం నా మెయిల్ ఐడి (yarraramarao@gmail.com) ని తెలియపరుస్తున్నాను.దీనికి మీరు మీ మెయిల్ తెలుపుతూ మెయిల్ చేయగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:09, 28 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@ ఉదయ్ కిరణ్ గారూ చర్చా పేజీ ఒకసారి చూడండి. యర్రా రామారావు (చర్చ) 05:15, 29 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు మెయిల్ చేసాను ఉదయ్ కిరణ్ (చర్చ) 09:12, 3 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారు మీకు ధన్యవాదాలు నాకు వికీపీడియా గురించి అవగాహన ఉంది. నేను వ్యాసాలు కూడా నాణ్యత ప్రకారమే రాస్తున్నాను. కానీ నాకు ఇంకా వికీపీడియా గురించి పూర్తిగా తెలియదు. మూలాలు చేర్చడం సొంతంగా వ్యాసం రాయడం నాకు ఇంకా తెలియదు. మీరు నాకోసం సమయం కేటాయించి నాకు వికీపీడియా నియమాలు తెలియజేస్తాను అనడం సంతోషంగా ఉంది. మీరు మీ సలహాలు సూచనలు నాకు అందించగలరు. ధన్యవాదాలు. ఉదయ్ కిరణ్ (చర్చ) 05:17, 29 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు నా మెయిల్ ఐడి కి సెల్ నెంబరు తెలుపగలరు.మెయిల్ ఐడి పైన ఇచ్చాను. యర్రా రామారావు (చర్చ) 05:19, 29 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరిగా మీ చక్కటి కృషికి ఓ పతకం[మార్చు]

కొత్త వాడుకరిగా మీ కృషికి పురస్కారం
ఉదయ్ కిరణ్ గారూ మీరు తెలుగు వికీపీడియాలో కొత్త వాడుకరిగా 2023 ఆగస్ఠులో ప్రవేశించి ఇప్పటికి (2024 మే 08) నాటికి 300 వ్యాసాలుపైగా సృష్టించి, 3000 పైగా సవరణలు చేసిన మీ కృషి అమోఘం. మీ కృషి దినదినాభివృద్ధి చెందుతుంది.మీ చక్కటి కృషికి అందుకోండి ఈ పతకం.

యర్రా రామారావు (చర్చ) 08:45, 8 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @యర్రా రామారావు గారు. మీరు నాకు ఈ పతకం నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ఇతర వికీపీడియన్ లకు ధన్యవాదాలు. ఉదయ్ కిరణ్ (చర్చ) 08:57, 8 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]