Jump to content

గోగు శ్యామల

వికీపీడియా నుండి
గోగు శ్యామల
జననం1969
పెద్దెమూల్ గ్రామం,రంగారెడ్డి జిల్లా
వృత్తిరచయిత, ఉద్యమకారిణి.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
లఘు కథలు

గోగు శ్యామల కథా రచయిత, తెలుగు భాషా రచయిత్రి, మహిళా కార్యకర్త.[1] ఈమె ప్రముఖ దళిత రచయిత్రి.[2] [3] ఈమె రచనలు భూమిక, ప్రస్థానం, మన తెలంగాణ, ప్రతిఘటన, ప్రజా కళామండలి, నిఘా మొదలగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఈవిడ ప్రస్తుతం దళిత మహిళల ఆత్మకథలు అనే ప్రాజెక్టుపై పనిచేస్తోంది. డర్బన్‍లో 2001లో జరిగిన వర్ల్డ్ కాన్ఫరెన్స్ అగైనెస్ట్ రేసిజం అనే సదస్సులో అన్వేషి, దళిత మహిళల ఫోరం తరపున పాల్గొనింది. అన్వేషి సంస్థ కార్యవర్గ సభ్యురాలు. ఈమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'ఉత్తమ రచయిత్రి'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[4]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె 1969 లో పెద్దేముల్ గ్రామం, రంగారెడ్డి జిల్లాలో జన్మిచారు. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఈమె స్థానిక భూస్వామ్యుల వద్ద వెట్టి చాకిరి టీంకు నాయకురాలుగా ఉన్నారు.[5] [6]

వృత్తి

[మార్చు]

ఈమె ప్రస్తుతము ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీ) విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పరిశోధనను కొనసాగిస్తున్నారు. ఈమె అన్వేషి సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ లో పరిశోధనవేత్తగా పనిచేసారు. ఆమె భూమిక, ప్రస్థానం, ప్రతిఘటన, మన తెలంగాణ ప్రజా కళా మండలి, 'నిఘా' వంటి పత్రికల్లో కోసం వ్రాస్తున్నారు.

రచనలు

[మార్చు]
  • ఫాదర్ మే బి ఎన్ ఎలిఫెంట్ అండ్ మదర్ ఆఁన్లీ ఎ స్మాల్ బాస్కెట్ - ఆంగ్లం (Father may be an elephant and mother only a small basket, but....) (అర్ధం - ఎనుగు గంత తండి కన్నా ఏకుల బుట అంత తల్లి నయం ...)
  • నేనే బలాన్ని : టీఎన్‍సదాలక్ష్మి బతుకు కథ
  • వాడ పిల్లల కథలు
  • తాటకి విన్స్ అగైన్ అండ్ బ్రేవ్ హార్ట్ బడెయ్య (ఆంగ్లమ్)
  • కీఴల కుట్టికల్ (మలయాళం)
  • మెరిట్ ఇంటరప్టెడ్ (ఆంగ్లం) /మేమెట్ల ౘదువాలె (తెలుగు) డాక్యుమెంటరీ సినిమాకి స్క్రిప్టు
  • నల్లరేగటి సాళ్లు : మాదిగ, మాదిగ ఉపకులాల ఆడోళ్ల కథలు
  • Furrows in Black Soil: Short Stories of Maadiga and Sub-castes’ Women (అర్ధం - నల్లమట్టిలోని గుంటలు : మాదిగ మరియ ఉపకులాల మహిళల పై చిన్ని కథలు)
  • ఎల్లమ్మ : అనేక అస్తిత్వాల ఆడోళ్ళ కథలు
  • తాటకి
  • బాయితలం
  • లసుమవ్వ దుక్కి
  • మాదిగ బడెయ్య
  • రడం : ఒక అమ్మాయిని వూరి పెద్దలు జోగిని వృత్తిలో చేర్చాలనే నిర్ణయాన్నీ ధిక్కరించెందుకు తండ్రి పడిన ఆరాటం
  • నల్లపొద్దు

పురస్కారాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

1.దళిత స్త్రీవాదం

మూలాలు

[మార్చు]
  1. http://www.livemint.com/Leisure/Z5LgI2jhMZaTFL7ZY1L2sN/Book-Review--Twists-in-the-old-tales.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-03. Retrieved 2015-06-30.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-30. Retrieved 2015-06-30.
  4. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link][permanent dead link]
  5. Tharu, Susie; K, Satyanarayana (2013). Steel nibs are sprouting: New Dalit writing from South India. India: HarperCollins Publishers. ISBN 9789350293768.
  6. https://books.google.com/books?id=JbbjAAAAQBAJ&pg=RA1-PT778&dq=gogu+shyamala&hl=en&sa=X&ei=joEhVdPLGc6uogSsn4LADw&ved=0CCIQ6AEwAQ#v=onepage&q=gogu%20shyamala&f=false
  7. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

ఇతర లింకులు

[మార్చు]