జూపాక సుభద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూపాక సుభద్ర
Joopaka Subhadra.jpg
జననంవరంగల్ జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిప్రభుత్వ ఉన్నతాధికారిణిగా
ప్రసిద్ధికథకురాలుగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా, అనువాదకురాలుగా, పరిశోధకరాలుగా
భాగస్వాములుకృపాకర్ మాదిగ

జూపాక సుభద్ర కవయిత్రిగా, కథకురాలుగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా, అనువాదకురాలుగా, పరిశోధకరాలుగా, నాయకురాలుగా, అత్యుత్తమ వక్తగా, సంఘ సేవకురాలుగా, ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా సుభద్ర బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో ప్రజల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కూడా కీలకంగా పనిచేస్తున్నారు.

సాహిత్యం పై విమర్శ ?[మార్చు]

సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో ఉన్న అగ్రకుల స్వభావాన్ని, అంతేకాక మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ ఆధునిక సాహిత్యం పై తన దైన శైలిలో విమర్శనాత్మకమైన విమర్శన చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తు వ్రాయడం జరుగుతుంది. దళిత సాహిత్యం ప్రదానంగా మాదిగలు రాసే ‘మా సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండగా ఎందుకు పక్కన పెట్టేస్తారు?’ అని ప్రశ్నిస్తారు జూపాక సుభద్ర. ‘ఆధిపత్య కులాల రచనలకు లేబుల్స్ ఉండవు. పరిమితులుండవు. వారు రాసింది విశ్వసాహిత్యం. మేము రాస్తే- అది దళిత సాహిత్యం, తెలంగాణ సాహిత్యం... ఇంకా ఏవేవో పేర్లు’ అంటారామె. ‘స్త్రీవాదులు కోరుతున్న విముక్తికీ దళిత స్త్రీలు కోరుతున్న విముక్తికీ చాలా తేడా ఉంది. భారత దేశంలో ఉన్నఅగ్ర వర్ణాల వారికి పితృస్వామ్యం నుంచి విముక్తి కావాలి. మాకు కులం నుంచి భూస్వాముల నుంచి ఆకలి నుంచి విముక్తి కావాలి’ అంటారామె.

దళితుల జీవన స్థితిగతుల పై అధ్యయనం[మార్చు]

మాదిగల జీవన విధానం, స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మాదిగల ఉపకులమైన డక్కలి జీవితాల్లోని అంతులేని చీకటిని చూపే కథలు కూడా వ్రాశారు. డక్కిలివాళ్లు మాదిగలున్న అన్ని ఊళ్లకూ వెళ్లరు. తమకు ఏ ఊరి మీద ఇస్స (హిస్సా- భాగం) ఉందో ఆ ఊరికే వెళతారు. అక్కడి పంచాయితీలు తెంపుతారు. హక్కుగా తమకు రావలసింది తీసుకుంటారు. కులం కథ చెప్తారు. తేడా వస్తే నిలేస్తారు. వారి జీవన విధానం పై పుస్తకం వ్రాయటం జరిగింది అలాంటి జీవన విధానం కల్గిన డక్కిలి స్త్రీయే రాయక్క మాన్యాన్నిఅని ఆమె పెరుకొన్నారు.

రచనలు[మార్చు]

 • నల్లరేగటిసాల్లు 2006
 • సంగతి (తమిల్‌ నుండి తెలుగు)
 • కైతునకల దండెం 2008
 • అయ్యయ్యో దమ్మక్క 2009
 • చంద్రశ్రీ యాదిలో... 2013
 • రాయక్క మాన్యమ్‌ 2014
 • రాయక్క మన్యం
 • భూమిక స్త్రీవాద మాసపత్రిక కాలమిస్టుగా
 • దళితశక్తి మాసపత్రిక గౌరవ ఎడిటర్‌గా
 • వివిధ వార్త పత్రికలకు, మాగజైన్స్ కు వ్యాసాలు రాస్తుంటారు.[1][2][3]

పురస్కారాలు[మార్చు]

 • మైత్రేయ కళాసమితి కథ పురస్కారం 2006[4]
 • ఆంధ్రప్రదేశ్‌ భాషా కమీషన్‌ అవార్డు 2007
 • జివిఆర్‌ కల్చరల్‌ పౌండేషన్‌ అవార్డు 2007
 • డా.సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు అవార్డు 2009
 • తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవయిత్రి అవార్డు 2011
 • నోముల కథ పురష్కారం 2013
 • దామోదరం సంజీవయ్య సాహితి పురస్కారం 2013
 • దళితమిత్ర ధనజీరావు గైక్వాడ్‌ ట్రస్టు అవార్టు మహారాష్ట్ర సమాజ్‌ భూషన్‌ పురస్కారం 2013
 • నందివాడ శ్యామల సహృదయ సాహితి పురస్కారం 2014
 • డా.బోయ జంగయ్య చేతన పురస్కారం 2014
 • రంగినేని ఎల్లమ్మ సాహితి పురస్కారం 2015
 • అమృత లత- అపూర్వ అవార్డు 2015
 • తెలంగాణ మహిళ శక్తి పురస్కారం 2015
 • డా.కవిత స్మాకర పురస్కారం కడప 2015
 • లాడ్లి మీడియా స్పెషల్‌ అవార్డు 2016
 • తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య ప్రతిభ పురస్కారం 2016
 • తెలంగాణ స్టేట్‌ లిటరరీ అవార్డు 2017
 • డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ జాతీయ అవార్డు, దళిత్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఇండియా 2017
 • ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డు 2018
 • వెంకట సుబ్బు అవార్డు 2018ఈమె రచించిన రాయక్క మాన్యమ్ కథాసంపుటికి 2015 సంవత్సరానికిగాను [[రంగినేని మోహనరావు నెలకొల్పిన రంగినేని ఎల్లమ్మ స్మారక సాహిత్య పురస్కారం లభించింది[5].

మూలాలు[మార్చు]

 1. Jupaka, Subhadra. "Kongu". http://www.dalitweb.org. Jupaka Subhadra. External link in |website= (help)
 2. "Wrap me in a raindrop flowered sari". http://roundtableindia.co.in/. External link in |website= (help)
 3. Joopaka, Subhadra. "Building my identity…". http://www.anveshi.org.in. Joopaka Subhadra. External link in |website= (help)
 4. Dalithashakthi Monthly magzine
 5. జూపాక సుభద్రకు రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం