దుర్ముఖి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
దుర్ముఖి తెలుగు సంవత్సరాలలో 30వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం మన్మధ, తర్వాత సంవత్సరం హేవలంబి. దీని అర్థం చెడ్డ ముఖం కలది. ప్రజలు దుష్కర్మలు చేస్తారు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1896 - 1897, 1956 - 1957, 2016 - 2017లో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుర్ముఖి అని పేరు.
2016 : దుర్ముఖి నామ సంవత్సరం 8 ఏప్రిల్ 2016 శుక్రవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 28 మార్చి 2017 మంగళవారం హేవళంబి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "దుర్ముఖి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 30 | దుర్ముఖి | 36-37 | 96-97 | 156-157 | 216-217 | 276-277 | 336-337 | 396-397 | 456-457 | 516-517 | 576-577 | 636-637 | 696-697 | 756-757 | 816-817 | 876-877 | 936-937 | 996-997 | 1056-1057 | 1116-1117 | 1176-1177 | 1236-1237 | 1296-1297 | 1356-1357 | 1416-1417 | 1476-1477 | 1536-1537 | 1596-1597 | 1656-1657 | 1716-1717 | 1776-1777 | 1836-1837 | 1896-1897 | 1956-1957 | 2016-2017 | 2076-2077 | 2136-2137 | 2196-2197 | 2256-2257 | 2316-2317 | 2376-2377 | 2436-2437 | 2496-2497 | 2556-2557 | 2616-2617 | 2676-2677 | 2736-2737 | 2796-2797 |
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1896 : జ్యేష్ఠమాసము : తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము జరిపారు.[3] తిరిగి ఆషాఢమాసము మొగల్తుర్తి కోటలో శతావధానము జరిపారు. ఆశ్వయుజ కార్తీకములలో రెండవసారి కాకినాడలో యనేకావధానము జరిపారు. మార్గశీర్షములో పిఠాపురములో వాడ్రేవువారి లోగిటిలో యవధానము చేశారు.
- క్రీ. శ. 1897 : పుష్య శుద్ధ నవమి : మంత్రిప్రగడ భుజంగరావు వారిచేత రచించబడిన గానామృతము ప్రచురించబడింది.
జననాలు
[మార్చు]- 1896 : వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
- 1956 వైశాఖ బహుళ తదియ : అవధానం సుధాకరశర్మ - అవధాని, కవి, బహుభాషాకోవిదుడు.[4]
- 1956 భాద్రపద బహుళ షష్ఠి:కడిమిళ్ళ వరప్రసాద్ - సహస్రావధాని, బహుగ్రంథకర్త.[5]
- 1956 ఆషాఢ శుద్ధ దశమి: అయాచితం నటేశ్వరశర్మ- అవధాని, కవి, పరిశోధకుడు, రచయిత.[6]
- 1956 ఆషాఢ శుద్ధ పూర్ణిమ: తిగుళ్ల రాధాకృష్ణశర్మ - అవధాని, సహజకవి.[7]
- 1956 కార్తీక శుద్ధ పాడ్యమి: కోట రాజశేఖర్ - అవధాని, గణితశాస్త్ర ప్రవీణుడు.[8]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- సా.శ. 1956 : కార్తీక శుద్ధ విదియ - యమవిదియ
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 57. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 673.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 678.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు. అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 686.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 689.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 693.