కొత్తసాలు (60 మంది కవుల కవిత్వం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్తసాలు పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన మూడవ పుస్తకం. తెలంగాణ రాష్ట్రంలోని 60 మంది కవుల కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది.[1][2]

సంపాదకులు - సలహా మండలి[మార్చు]

2015 శ్రీ మన్మథ నామ సంవత్సరం ఉగాది (మార్చి 21) రోజున సాయంత్రం రవీంద్ర భారతి ఆరు బయట ప్రాగణంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 7మంది సాహితీవేత్తలతో కమిటీని వేసి, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది కవి సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉగాది కవి సమ్మేళనం, ప్రపంచ కవితా దినోత్సవ ప్రత్యేకం, రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వ పరంగా జరిగిన తొలి కవితాగానం వంటి 3 అంశాలకు ప్రతిబింబంగా ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. మామిడి హరికృష్ణ సంపాదకులుగా ఉండగా... డా. నందిని సిధారెడ్డి డా. అమ్మంగి వేణుగోపాల్, డా. మసన చెన్నప్ప, డా. నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, యాకుబ్, అయినంపూడి శ్రీలక్ష్మీ వంటివారు సలహా మండలి కమిటీలో ఉన్నారు.

కొత్తసాలులో రాసిన కవులు - వారి కవితలు[మార్చు]

కవి కవిత
ఆడెపు లక్ష్మణ్ సామాన్యుడు
అయినంపూడి శ్రీలక్ష్మి మట్టితనం, మనిషితత్వం... ఒకజెండా
అలువాల సురేష్ ఇది చేద్దాం
డా. అమ్మంగి వేణుగోపాల్ ఆది
అన్నవరం దేవేందర్‌ కవిత్వం
అన్వర్ జలమందిరం
ఆశారాజు పేదరాశి పెద్దమ్మ చెప్పని కథ
డా. బన్న అయిలయ్య ఇది మట్టిమనిషి ఉగాది కావాలి
డా. బెల్లి యాదయ్య బోటనీ
డా. భీంపల్లి శ్రీకాంత్ మౌనం నిద్రించిన వేళ
డా. యస్. చెల్లప్ప దక్షిణాయనం
డా. దామెర రాములు ఇది మన్మథ ఉగాది కవితల ముచ్చట!
గాయపడిన గేయాల మనాదియాది!!
దర్భశయనం శ్రీనివాసాచార్య అతనికి నమస్కరిస్తూ
దాసరాజు రామారావు ఆ రెండు పిట్టలు
దేశపతి శ్రీనివాస్ ప్యారా హైదరాబాద్
డా. దేవరాజు మహారాజు అక్షరం - అస్థిత్వం
ఏనుగు నరసింహరెడ్డి కవిత్వమొక ప్రపంచం
డా. జి. నరసింహ స్వామి అగ్ని కణాన్ని నేను
గజ్జెల శ్రీనివాస్ రెడ్డి అంతటా హహాకారాలు
ఘనపురం దేవేందర్ కొత్తకుండ
డా. గండ్ర లక్ష్మణరావు మన్మథా! రావోయి
హియజ కోకిల కనబడుట లేదు
డా. జె. బాపురెడ్డి త్రికాలవేది ఉగాది
జింబో ప్రతి ఉదయమూ
జూకంటి జగన్నాథం ఆత్మ
జూలూరి గౌరిశంకర్ తెలంగాణ కవిత్వ పాదం

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "మన కవుల కవితాసాగు కొత్తసాలు". Retrieved 23 December 2016.
  2. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, ఎడిట్ పేజి వ్యాసాలు (16 April 2018). "కొత్తరాష్ట్రంలో కొత్తసాలు". అయినంపూడి శ్రీలక్ష్మి. Archived from the original on 16 ఏప్రిల్ 2018. Retrieved 16 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)