రవీంద్రభారతి

వికీపీడియా నుండి
(రవీంద్ర భారతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రవీంద్ర భారతి
సాధారణ సమాచారం
రకంఆడిటోరియం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°24′12″N 78°28′02″E / 17.4033°N 78.4672°E / 17.4033; 78.4672
ప్రారంభం11 మే, 1961
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిమహ్మద్ ఫయజుద్ధీన్
హెచ్.వై.ఎం. క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విభాగంలో రవీంద్రభారతికి అవార్డు

రవీంద్ర భారతి (ఆంగ్లం: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. హైదరాబాదులో సైఫాబాద్ ప్రాంతంలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిని పర్యవేక్షిస్తున్నారు.[1]

నిర్మాణము

[మార్చు]

రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో 1960, మార్చి 23వ తేదీన రవీంద్రభారతికి శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా రవీంద్రభారతి 1961, మే 11న ప్రారంభించబడింది.[2] మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. మొదట్లో ప్రభుత్వమే రవీంద్రభారతి నిర్వహణను చూసుకునేది. 1963లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించడంతో 1989 వరకు మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించడంతో, ఆ శాఖ సంచాలకులే దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.[3][4]

విశేషాలు

[మార్చు]
  • ఇది మొత్తం ఏ సి (సెంట్రల్ ఏయిర్ కండిషన్ సిస్టం) చేయబడిన ఆడిటోరియం.
  • స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజి అలంకరణ మార్పు చేస్తుంటారు.
  • అందమైన ఉద్యానవనములు, ఫౌంటెన్స్, చుట్టూ ఉన్నాయి.
  • ఒకేసారిగా వెయ్యి మంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం.
  • సమావేశాలకోసం సమావేశ మందిరం ఉంది. దీనిలో 150మంది కూర్చోవచ్చు.
  • సినిమా ప్రదర్శనల కోసం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటుచేయబడింది. దీనిలో 112 సీట్లు ఉన్నాయి.
  • రవీంద్రభారతి ప్రాంగణంలో ఘంటసాల కళా వేదిక ఉంది.
  • దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
  • ముందు వైపు హాలులో రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహము ఉంది.
  • దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన కలపను వాడారు
  • జానపద, గ్రామీణ, ఆదివాసీ, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శకు దశాబ్దాలపాటు వేదికగా నిలవడంతోపాటు సంప్రదాయ నాటక ప్రదర్శనకు, ఆధునిక నాటక ప్రయోగానికి కేంద్రంగా నిలిచిన రవీంద్రభారతికి ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ వారు 2017, ఏప్రిల్ 18న ఇంటాక్ వారసత్వ అవార్డును అందించారు.[5]

కళాభవన్

[మార్చు]

రవీంద్రభారతికి అనుసంధానిస్తూ వెనుకగా కళాభవన్ అనే భవనము నిర్మించారు. దీనిలో చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్, వస్త్ర ప్రదర్శనలు, ఇతర కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

త్యాగరాయ గానసభ

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  2. రవీంద్రభారతి కళా సారధి, సాక్షి, హైదరాబాద్ ఎడిషన్, 11.05.2018, పుట. 10
  3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (29 July 2018). "సకల కళాభారతి!". Archived from the original on 30 July 2018. Retrieved 31 July 2018.
  4. Telangana Today, Hyderabad (13 May 2019). "Ravindra Bharathi curating culture for 58 years". Madhulika Natcharaju. Archived from the original on 13 May 2019. Retrieved 13 May 2019.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-17. Retrieved 2019-12-17.

ఇతర లంకెలు

[మార్చు]