Jump to content

జింబో

వికీపీడియా నుండి
జింబో
జననంమంగారి రాజేందర్
1957
India వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
వృత్తికవి, కథా రచయిత, విమర్శకుడు, న్యాయమూర్తి.

జింబో (1957) కవి, కథా రచయిత, విమర్శకుడు, న్యాయమూర్తి.జిల్లా , సెషన్స్ జడ్జి గా పనిచేసారు. జ్యూడిషీయల్ అకాడెమి డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా, ఆర్బిట్రేటర్ గా పనిచేస్తున్నారు.

బాల్యం

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న మంగారి రాజేందర్

జింబో అసలు పేరు మంగారి రాజేందర్. ఇతను 1957లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో జన్మించారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న మంగారి రాజేందర్ (జింబో)

వృత్తి పరంగా న్యాయమూర్తి. న్యాయవ్యవస్థపై బండారాన్ని బయటపెట్టె కథలెన్నో ఇతను రాశారు. కవిగా, కథకుడిగా ఎన్నో రచనలు రచించారు.

కవిత్వ సంపుటాల

[మార్చు]
  • హాజిర్ హై
  • రెండక్షరాలు
  • లోపలి వర్షం
  • చూసుండగానే
  • ఒకప్పుడు

కథా సంపుటాలు

[మార్చు]
  • రూల్ ఆఫ్ లా
  • జింబో కథలు
  • మా వేములవాడ కథలు
  • కథలకి ఆవల
  • ఒక చిన్నమాట
  • నేనూ .. నా నల్లకోటు
  • మా వేములవాడ కథలు-2

మూలాలు

[మార్చు]
  1. జింబో. "జింబో రెండక్షరాలు". నమస్తే తెలంగాణ. Retrieved 8 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=జింబో&oldid=4359220" నుండి వెలికితీశారు