Jump to content

నాళేశ్వరం శంకరం

వికీపీడియా నుండి
నాళేశ్వరం శంకరం
2021 లో రవీంద్రభారతిలో మాట్లాడుతూ నాళేశ్వరం శంకరం
2021 లో రవీంద్రభారతిలో మాట్లాడుతూ నాళేశ్వరం శంకరం
జాతీయతభారతీయుడు
సాహిత్య ప్రక్రియవిమర్శ, కవిత్వం

నాళేశ్వరం శంకరం తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖకవి, విమర్శకులు. తనదైన సామాజిక దృక్పథంతో, లోతైన ప్రతీకలతో కవిత్వం రాస్తూ తెలుగు సాహితీ రంగంలో గుర్తింపు పొందారు. ఈయన సుప్రసిద్ధ కవితా సంకలనం 'దూదిమేడ' ద్వారా వీరు మరింత ప్రఖ్యాతి చెందారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతని చిన్నతనం ఎడ్లు కాయడంలోనూ, గేదెలకు పచ్చిగడ్డి కోసుకురావడంలోనూ, పిడకలు తయారు చేయడంలోనూ ముగిసిపోయింది. తల్లి బీడీ కార్మికురాలు. బిక్షాటన వంశంలో పుట్టిన వాడు కావటం చేత బిక్షాటన అనే జీవనోపాధిని వదిలేయకుండా చదువుకోవాలనే తండ్రి నిర్బంధఆజ్ఞను పాటిస్తూ ఏడు మైళ్ల దూరంలో వున్న వూరుకు, చదువు కోసం వెళ్లి నాల్గవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా చదువుకుకున్నాడు. ఆ సమయంలో తెలంగాణా ఉద్యమం రావడంతో చదువు కుంటుపడింది. తరువాత పక్కవూరికి వెళ్ళి మెట్రిక్ చేరాడు. ఆ సమయంలో సుభద్రాదేవితో పరిచయమై కులాంతరవివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించటంతో ఇంటికి దూరమై కష్టంతో డిగ్రీ వరకు చదివాడు. తర్వాత ఒక ఆఫీసులో రోజువారీ వేతనంపై కొన్నిరోజులు పనిచేశాడు. ఆ ఆఫీసులో పనిచేస్తున్న కె.వివేకానందరెడ్డి అనే ఇంజనీరు ప్రోత్సాహంలో ఎం.ఎ. చదివాడు[1].

రచనలు

[మార్చు]
  1. చలం కథలు- స్త్రీ చిత్రణ (సిద్ధాంత గ్రంథం)
  2. దూదిమేడ - ఇది నాళేశ్వరం శంకరం గారి అత్యంత ప్రాచుర్యం పొందిన కవితా సంకలనం. మిత్రుడు శీలా వీర్రాజు గారి బలవంతం, ప్రోత్సాహంతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. దీనిని శీలా వీర్రాజు గారికే అంకితమిచ్చారు.
  3. వలస
  4. స్పాట్ సిగ్నేచర్స్-తెలుగు ఉపన్యాసకుల కవిత్వం (సంపాదకత్వం)
  5. శీలావీర్రాజు కలం చిత్రాలు (సంపాదకత్వం)

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

నాళేశ్వరం శంకరం కవిత్వ రచన ఒక ప్రత్యేక పద్ధతిలో సాగుతుంది. సమాజంలోని అశాంతి, అంతఃఘర్షణలే తన కవిత్వానికి ప్రేరణ అని వీరు పేర్కొంటారు. తొలుత మనోకాగితంపై కవితను రాసుకుని, పదాల లయను, ప్రతీకలను సరిచూసుకున్న తర్వాతే కాగితంపై పెడతారు.[2]

ప్రభావం చూపిన రచయితలు

[మార్చు]

వీరి సాహిత్య ప్రయాణంలో ఎం.ఏ. చదువుతున్న కాలం అత్యంత కీలకమైనది. ఆ సమయంలోనే:

  • శ్రీశ్రీ, నగ్నముని, శివారెడ్డి, అజంతా, దేవిప్రియ, ఇస్మాయిల్ వంటి కవుల కవిత్వ ప్రభావం వీరిపై పడింది.
  • చలం, రంగనాయకమ్మ, కేశవరెడ్డి వంటి రచయితల రచనలు వీరి ఆలోచనా ధోరణిని ప్రభావితం చేశాయి.
  • సి. నారాయణ రెడ్డి, జ్వాలాముఖి, కుందుర్తి వంటి ప్రముఖుల ఉపన్యాసాలు వీరి కవిత్వానికి నూతన సామగ్రిని అందించాయి.[3]

సాహిత్య సంబంధాలు

[మార్చు]
  • నిజామాబాద్‌లోని 'ఇందూరు భారతి' సాహిత్య సంస్థతో వీరికి అనుబంధం ఉంది.
  • దేవిప్రియ గారితో ఉన్న స్నేహం వీరి కవిత్వ నిర్మాణానికి ఎంతో ఊతమిచ్చింది. 'దూదిమేడ' సంకలనానికి దేవిప్రియ పీఠిక రాశారు.
  • డా. ఎన్. గోపి, శివారెడ్డి, శీలా వీర్రాజు వంటి ప్రముఖులు వీరిని నిరంతరం ప్రోత్సహించారు.

ఇతర విశేషాలు

[మార్చు]
  • వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు 'ఉరసం' (ఉర్దూ-తెలుగు సాహిత్య సంస్థ) స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
  • ఉద్యోగ రీత్యా ఇంజనీర్ కె. వివేకానంద రెడ్డి గారి ప్రోత్సాహం వీరి ఉన్నత చదువులకు మార్గం సుగమం చేసింది.
  • వీరి కవితలు అనేక పత్రికల్లో ప్రచురితమవ్వడమే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కూడా ప్రసారమయ్యాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]