Jump to content

మనకు తెలియని తెలంగాణ (పుస్తకం)

వికీపీడియా నుండి
మనకు తెలియని తెలంగాణ
మనకు తెలియని తెలంగాణ పుస్తక ముఖచిత్రం
కృతికర్త: అరవింద్ ఆర్య పకిడె
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: మే 20, 2019
పేజీలు: 130
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-936452-5-3


మనకు తెలియని తెలంగాణ తెలంగాణలో వెలుగుచూడని చరిత్రకు సంబంధించిన పుస్తకం. యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె రాసిన వ్యాసాలను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ "మనకు తెలియని తెలంగాణ" పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రను వెలికితీసే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అరవింద్ గత 5 సంవత్సరాలుగా అనేకమంది చరిత్ర పరిశోధకులు, పురావస్తు, పర్యాటక శాఖ అధికారులు, విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలతో కలసి తెలంగాణలోని అనేక కట్టడాలను సందర్శించి వాటి గురించి వ్యాసాలు రాసాడు.[1]

పుస్తకంగా

[మార్చు]

తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన చరిత్రను, ఇప్పటివరకూ వెల్లడికాని తెలంగాణ చారిత్రక వైభవాన్ని సప్రామాణికంగా అందించే పరిశోధనలు విరివిగా రావాలి. అందులో భాగంగా తెలంగాణ సాంస్కృతిక మూలాల అన్వేషణకు చరిత్ర మాత్రమే దారి చూపుతుందని భావించిన భాషా సాంస్కృతిక శాఖ, ఆ దిశగా పరిశోధన చేస్తున్న యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో "అన్ టోల్డ్ తెలంగాణ" పేరుతో రవీంద్రభారతిలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది.[2]

అప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు, వాటి వివరాలు ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి తెలిసాయి. అరవింద్ చేసిన చారిత్రక అన్వేషణలకు శాశ్వతత్వాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశ్యంతో వాటన్నింటిని కలిపి మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో పుస్తకంగా ప్రచురించింది.[3]

పుస్తకంలో

[మార్చు]

ఇప్పటివరకు తెలంగాణలో వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను తెలిపే ఆదిమ మానవుడి సమాధులు, కొండలు, గుహల్లో నాటి ఆదిమ మానవుల చిత్ర లేఖనా నైపుణ్యానికి అద్దంపట్టె రాతి చిత్రాలు, కొండను తొలచి గుహలలో ఏర్పరచిన ఆలయాలు, దేశంలోనే అరుదైన బౌద్ధ తార, మత్స్య వల్లభుడు, బౌద్ధ భైరవ, బ్రహ్మదేవుడు లాంటి విగ్రహాలు మెట్ల బావులు, ప్రత్యేకంగా ఉన్న వీరగల్లులు, భారతీయ శిల్ప నిర్మాణాల్లోనే విశిష్టత కలిగి వేటికవే ప్రత్యేకంగా ఉన్న ద్వార తోరణాలు, కాకతీయ రాజ్య పరిరక్షణ కోసం దట్టమైన అడవుల్లో శత్రు దుర్భేద్యంగా నిర్మాణం చేయబడ్డ జల, వన, గిరి దుర్గాలు, నిజాం కాలం నాటి భవంతులు మొదలగు వినూత్న అంశాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.[4]

  1. తెలంగాణ నేలలో శిలాజాలు
  2. ప్రకృతి చెక్కిన రంగు రంగుల గుహలు - చందంపేట గుహలు
  3. సహజంగా ఏర్పడ్డ వింత ఆకృతులు - మైలారం సున్నపు గుహలు
  4. ప్రాచీన గుహ చిత్రాలయాల స్థావరం పాండవుల గుట్టలు
  5. ఆదిమానవులు గీసిన ధవళ వర్ణ చిత్రాలు - నర్సాపూర్ రాతి చిత్రాలు
  6. సంగీతాన్ని వినిపించే రాళ్ల తోట - వీరన్నపేట
  7. నైరూప్య చిత్రాలను తలపించే వేలుపుగొండ రాతి చిత్రాలు
  8. బూడిద సమాధులు మనవాకృత శిలలు
  9. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఖగోళ శాస్త్ర పరిశోధనా స్థానం - ముడుమాల
  10. పెద్ద రాతియుగం నాటి ఆనవాళ్లు - దామరవాయి సమాధులు
  11. శాతవాహన ఆనవాళ్ల పుట్ట - గీసుగొండ గుట్ట
  12. భారతదేశంలోనే అరుదైన ఇటుకల నిర్మాణం - గొల్లత్త గుడి, ఫణిగిరి
  13. ప్రపంచంలోనే అరుదైన నిర్మాణం - దేవునిగుట్టఆలయం
  14. భారతీయ వాస్తు శిల్పానికి చిహ్నాలు - అడవి సోమనపెల్లి గుహాలయాలు
  15. బౌద్ధుల ఆరాధ్య దేవతా శిల్పం - తార విగ్రహం
  16. అరుదైన దేవతా శిల్పాలు - భద్రకాళి చెరువులో బయల్పడ్డ శిల్పాలు
  17. శత్రునాశకుడి రూపంలో ఉన్న ఏదులాబాద్ చండ భైరవుడు
  18. అష్ట భైరవులు కొలువై ఉన్న క్షేత్రం - హన్మకొండ సిద్ధుల గుట్ట
  19. రాష్ట్రకూట ఆనవాళ్లకు నెలవు - జఫర్ గఢ్ మాల్చ గుట్ట
  20. అరుదైన హనుమసుతుడి విగ్రహం - కొలనుపాక మత్స్యవల్లభుడి విగ్రహం
  21. జైన మత కేంద్రం - అగ్గలయ్య గుట్ట
  22. రాష్ట్రంలోనే అరుదైన విగ్రహం- హన్మకొండ బ్రహ్మ విగ్రహ మొగిలిచెర్ల
  23. వరుస శిల్పాల వేదిక నిడిగొండ శిల్ప సముదాయం
  24. రాజు ఆహార్యంలో హైహీల్స్ పాదరక్షలు ఉన్న నిడిగొండ వీరగల్లు
  25. గణపతిదేవ మహారాజు రాజగజ కేసరిని చాటి చెప్పే గుడి తండా శాసనం
  26. కాకతీయులు కళంక రహితులని చాటిచెప్పిన రెడ్లవాడ శాసనం
  27. చౌండసేనాని సాధిం చిన విజయాలకు గుర్తు - కొండపర్తి చౌండేశ్వరాలయం
  28. శాయంపేట పాంచాలరాయ దేవాలయ శాసనం
  29. కాకతీయుల నాటి అరుదైన కళాఖండం - భారీ రాతి నీటితొట్టి
  30. కాకతీయ నిర్మాణ కౌశలానికి ప్రతీక - మెట్ల బావి
  31. ప్రకృతి సిద్ద రంగులతో వేసిన చిత్రాలు - పిల్లలమర్రి నామేశ్వరాలయ వర్ణచిత్రాలు
  32. నాలుగు ద్వారాలున్న దేవాలయం- సర్వతోభద్ర ఆలయం
  33. నిజాం కాలం నాటి దుర్ఘటనకు సాక్ష్యం - ఇచ్చంపల్లి ప్రాజెక్టు
  34. కాకులు దూరని కారడవిలో కాకతీయుల ఘన చరిత్ర
  35. శత్రుదుర్భేద్యమైన జల, వన, గిరి దుర్గం - ప్రతాపగిరి
  36. రమణీయ ప్రకృతికి, చారిత్రక ఆనవాళ్ళకు నిలయం - గొంతెమ్మగుట్ట
  37. కాకతీయుల సైనిక రహస్య స్థావరం - కాపురం గుట్ట
  38. కాకతీయుల కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లకు మచ్చుతునక - నందిగామ కోట
  39. దట్టమైన అడవిలో సైనిక పహారా కేంద్రం - మల్లూరు కోట
  40. సహజ రక్షణ కవచాలున్న దుర్గం - రాజుపేట కోట
  41. ఏడు ప్రవేశ ద్వారాలున్న కోటకు వేదిక - దర్వాజల గుట్ట తోరణాలు
  42. అనుమకొండ కోట తోరణాలు
  43. కొలనుపాక తోరణం
  44. వెల్దుర్తి తోరణం
  45. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయ తోరణాలు
  46. నందికంది తోరణం
  47. రామగుండం తోరణం
  48. వరంగల్ కీర్తి తోరణం
  49. గొడిశాల తోరణం .
  50. కాకతీయులు -ఏడు సంఖ్య

విడుదల

[మార్చు]

2019, మే 20వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి (ఐఏఎస్), పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి పార్ధసారధి (ఐఏఎస్), భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, వరంగల్ అర్బన్ (5 February 2019). "చరిత్ర తిరగరాస్తున్నాడు". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2019. Retrieved 10 November 2019.
  2. వి6 వెలుగు, తెలంగాణం (6 February 2019). "తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్". V6 Velugu. Archived from the original on 8 February 2019. Retrieved 10 November 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. నమస్తే తెలంగాణ, చెలిమె (సంపాదకీయం) (2 December 2019). "చరిత్రలో ఖాళీల పూరణ!". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 2 December 2019. Retrieved 2 December 2019.
  4. తెలుగు వెలుగు, ముఖాముఖి. "అందుకే ఆ పుస్తకం రాశా!". www.teluguvelugu.in. గుండు పాండురంగ‌శ‌ర్మ‌. Archived from the original on 10 November 2019. Retrieved 10 November 2019.
  5. ఆంధ్రజ్యోతి, సాహిత్యవార్తలు (20 May 2019). "'మనకు తెలియని తెలంగాణ' ఆవిష్కరణ". lit.andhrajyothy.com. Archived from the original on 10 November 2019. Retrieved 10 November 2019.
  6. Telangana Today, Telangana (21 May 2019). "Exploring the obscure Telangana". Telangana Today. Madhuri Dasagrandhi. Archived from the original on 10 November 2019. Retrieved 10 November 2019.