తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ వాగ్గేయ వైభవం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్ర
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: డిసెంబరు 16, 2018
పేజీలు: 78
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-936345-5-4


తెలంగాణ వాగ్గేయ వైభవం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంకీర్తనాచార్యుల పరిచయ పుస్తకం. మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.[1]

రూపకల్పన

[మార్చు]

తెలంగాణ వాగ్గేయకారులను, వారి రచనలను సమీకరించి వారు రాసిన కీర్తనలను భజనరూపంలో గానం చేస్తున్న భజన కళాకారులతో తెలంగాణ వాగ్గేయకార వైభవం పేరిట ఐదుసార్లు సదస్సులను నిర్వహించింది.

  1. తెలంగాణ వాగ్గేయకార వైభవం-1: 2016, ఏప్రిల్ 25 నుండి జూన్ 1 వరకు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ మొదలైన జిల్లాలకు చెందిన 124 భజన, సంకీర్తన బృందాల వారికి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించబడ్డాయి. ఇందులో 1195 మంది (1049 పురుషులు, 99 మంది మహిళలు, 46 మంది బాలబాలికలు) పాల్గొని భజనలు ఆలాపించారు.
  2. తెలంగాణ వాగ్గేయకార వైభవం-2: 2016, అక్టోబరు 16 నుండి 21 వరకు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మొదలైన జిల్లాలలోని 88 భజన, సంకీర్తన బృందాల వారికి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించబడ్డాయి. ఇందులో 1069 భజన కళాకారులు పాల్గొన్నారు.
  3. తెలంగాణ వాగ్గేయకార వైభవం-3: 2017, ఫిబ్రవరి 19 నుండి 24 వరకు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ మొదలైన జిల్లాలలోని 70 భజన, సంకీర్తన బృందాల వారికి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించబడ్డాయి. ఇందులో 768 మంది భజన సంకీర్తన కళాకారులు పాల్గొన్నారు.
  4. తెలంగాణ వాగ్గేయకార వైభవం-4: 2017 ఏప్రిల్ 23, 24 తేదీలలో రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో గతంలో జిల్లాస్థాయి పోటీల్లో విజేతలైన పూర్వ పది జిల్లాలలోని సుమారు 100 భజన, సంకీర్తన బృందాల వారితో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించబడ్డాయి. ఇందులో మొత్తం 1600 సంకీర్తన, భజన కళాకారులు పాల్గొన్నారు.
  5. తెలంగాణ వాగ్గేయకార వైభవం-5: 2017 అక్టోబరు 20, 21 తేదీలలో రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో 24 గంటలపాటు 36 బృందాలకు చెందిన 511 మంది సంకీర్తన, భజన కళాకారులు పాల్గొన్నారు.

భజన సంకీర్తనా ప్రక్రియలోని శాస్త్రీయతను చర్చించేందుకు 2017 డిసెంబరు 11,12 తేదిలలో నిర్వహించిన రెండు రోజుల సదస్సులో మొత్తం 16 మంది వక్తలు పాల్గొని తమ పరిశీలనలను, పరిశోధనలను సమర్పించారు. ఆ సదస్సులో వచ్చిన పరిశోధన పత్రాలలోని వాగ్గేయకారులను, వారి కీర్తనలను పొందుపరుస్తూ, వారి కృషిని గ్రంథస్థం చేయాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణా వాగ్గేయ వైభవం పుస్తకం ప్రచురించబడింది.[2]

సంకలనం

[మార్చు]
  1. జమాల్‌పురి శివప్రసాద్
  2. సుధారాణి

సలహామండలి

[మార్చు]
  1. డా. కసిరెడి వెంకటరెడ్డి
  2. డా. టి. గౌరి శంకర్
  3. జె.బి. వెంకటరెడ్డి

విడుదల

[మార్చు]

2018, డిసెంబరు 16న రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా. కె.వి. రమణాచారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఆచార్య టి. గౌరీశంకర్, పుల్లారెడ్డి సంస్థల అధినేత రాఘవరెడ్డి, ఆచార్య డా. బి. జయరాములు పాల్గొన్నారు.[3]

వాగ్గేయ క్రమం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 10 November 2019.
  3. ఆంధ్రభూమి, హైదరాబాదు (17 December 2018). "'తెలంగాణ వాగ్గేయ వైభవం' పుస్తకావిష్కరణ". ftp.andhrabhoomi.net. Archived from the original on 9 నవంబరు 2019. Retrieved 9 November 2019.
  4. నమస్తే తెలంగాణ, ఆద్యాత్మికం (28 June 2020). "దేవుళ్లను మేల్కొల్పిన కవి". ntnews. వారాల ఆనంద్‌. Archived from the original on 28 June 2020. Retrieved 28 June 2020.