దాయపంతులపల్లి చెన్నదాసు
Appearance
దాయపంతులపల్లి చెన్నదాసు | |
---|---|
జననం | 1904 నవాబ్‌పేట మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ |
మరణం | 1964 |
తండ్రి | నాగయ్య |
తల్లి | నాగమ్మ |
దాయపంతులపల్లి చెన్నదాసు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]చెన్నదాసు 1904లో యాదవ కుంటుంబానికి చెందిన నాగయ్య, నాగమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలంలో జన్మించాడు. ఈయన అనేక శాస్త్రాలు చదివాడు. కొంతకాలం తరువాత చదువు వదిలి కరణీకము రాసే పనిలో చేరాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]చిన్నప్పటినుండి భక్తిభావం కలిగివున్న చెన్నదాసు రామాయణం, మహాభారతం, భాగవతం మొదలైనవి నేర్చుకొని పాడేవాడు. వేపూరు హనుమద్దాసు నుండి ఉపదేశము పొందాడు. గంగాపురం చెన్నకేశవ స్వామికి అంకితమిస్తూ అనేక కీర్తనలు రాసి, పాడాడు.[2]
మరణం
[మార్చు]ఈయన తన 60 ఏళ్ళ వయసులో 1964లో క్రోధనామ సంవత్సరం మార్గశీర్ష మాసము బహుళ పక్షము నవమి రోజున శతక పద్యములు వింటూ మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 17 November 2019.
- ↑ దాయపంతులపల్లి చెన్నదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 36