Jump to content

షర్రాఫ్ అమృతదాసు

వికీపీడియా నుండి
షర్రాఫ్ అమృతదాసు
జననం1897
కుచ్చెర్కల్, రాజాపూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ
మరణం1959
తండ్రిపండరినాథ్ రావు
తల్లిలక్ష్మీబాయమ్మ

షర్రాఫ్ అమృతదాసు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అమృతదాసు 1897లో పండరినాథ్ రావు, లక్ష్మీబాయమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, రాజాపూర్ మండలం, కుచ్చెర్కల్ గ్రామంలో జన్మించాడు. నిజాం పరిపాలనలో మునసబుదారుగా నియమించబడ్డాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

చిన్నతనం నుండి సంగీత సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న అమృతదాసు వాటిల్లో ప్రావీణ్యత, వివిధ భాషల్లో పాండిత్యం సంపాదించాడు. గుంటూరు జిల్లా, పల్నాడు తాలుక, దైదా గ్రామవాసి ఘటము సత్యనారాయణ శర్మ ద్వారా అబ్దుల్ ఆజీం దఢాఖ పరిచయం జరిగింది. ఈయన ఆజీంతో కలిసి శ్రీహరి హర భజనామృత గాన తరంగిణి అనే అజీం అఖండమాలలో 124 కీర్తనలు, 4 మంగళ హారతులు రాసి, శిష్యులకు నేర్పించాడు.[2]

మరణం

[మార్చు]

అమృతదాసు 1959లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. ఒరిజినల్ నుండి 16 సెప్టెంబరు 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2019.
  2. షర్రాఫ్ అమృతదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 33