రాజాపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజాపూర్ మండలం,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం 44వ నెంబరు (పూర్వపు పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి పై జడ్చర్ల,బాలానగర్ మధ్యన ఉంది. ఈ గ్రామానికి రైల్వే స్టేషను సదుపాయం ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ రాజాపూర్  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా,మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని బాలానగర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రాజాపూర్ గ్రామాన్ని (1+15) పదహారు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా,మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. రాజాపూర్
 2. దొండ్లపల్లి
 3. తిరుమలాపూర్
 4. కుచ్చెర్కల్
 5. చెన్నవల్లి
 6. మల్లేపల్లి
 7. ఇద్గాన్‌పల్లి
 8. రంగారెడ్డిగూడ
 9. అగ్రహారంపొట్లపల్లి
 10. కల్లేపల్లి
 11. రాయపల్లి
 12. ఖానాపూర్
 13. గుండ్లపొట్లపల్లి
 14. బీబీనగర్
 15. రాఘవాపూర్
 16. కుత్నేపల్లి

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లంకెలు[మార్చు]