Jump to content

దేవరకద్ర మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°37′00″N 77°51′00″E / 16.6167°N 77.8500°E / 16.6167; 77.8500
వికీపీడియా నుండి

దేవరకద్ర మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

దేవరకద్ర
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, దేవరకద్ర స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, దేవరకద్ర స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, దేవరకద్ర స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°37′00″N 77°51′00″E / 16.6167°N 77.8500°E / 16.6167; 77.8500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్​నగర్​ జిల్లా
మండల కేంద్రం దేవరకద్ర
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 238 km² (91.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,385
 - పురుషులు 29,490
 - స్త్రీలు 28,895
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.61%
 - పురుషులు 56.61%
 - స్త్రీలు 30.55%
పిన్‌కోడ్ 509204
దేవరకద్ర బస్స్టాండ్

ఇది హైదరాబాదు - రాయచూరు ప్రధాన రహదారిపై ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట డివిజనులో ఉండేది. ఈ మండలంలో గతంలో 26  రెవెన్యూ గ్రామాలు ఉండేవి. ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన కౌకుంట్ల మండలంలో ఈ మండలంలోని 6 గ్రామాలు విలీనమయ్యాయి. ప్రస్తుతానికి ఈ మండలంలో 20 గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం దేవరకద్ర.

మండల జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 58,385 - పురుషులు 29,490 - స్త్రీలు 28,895.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 238 చ.కి.మీ. కాగా, జనాభా 56,149. జనాభాలో పురుషులు 28,373 కాగా, స్త్రీల సంఖ్య 27,776. మండలంలో 11,201 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. దేవరకద్ర
  2. బొల్లారం
  3. అజిలాపూర్
  4. చిన్నరాజమూర్
  5. పెద్దరాజమూర్
  6. నాగారం
  7. గద్దెగూడ
  8. వెంకటాయిపల్లి
  9. బల్సుపల్లి
  10. బస్వాపూర్
  11. గురకొండ
  12. గోపాల్‌పూర్‌కలాన్
  13. చౌదర్‌పల్లి
  14. హాజిలాపూర్
  15. బస్వాయిపల్లి
  16. లక్ష్మీపల్లి
  17. జీనుగరాల
  18. డోకూర్
  19. మీనుగువానిపల్లి
  20. గుదిబండ

కౌకుంట్ల మండలంలో చేరిన గ్రామాలు

[మార్చు]

ఈ మండలంలో గతంలో 26 గ్రామాలు ఉండేవి. వాటిలోన కౌకుంట్ల, గోపన్‌పల్లి, పుట్టపల్లి, పేరూరు, ఇస్రంపల్లి, రేకులంపల్లి ఈ 6 గ్రామాలు 2022 సెప్టెంబరు 26న నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండలంలో విలీనమయ్యాయి.[5][6]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "కౌకుంట్ల కొత్త రెవెన్యూ మండలంగా జీవో జారీ". 27 September 2022. Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  6. "మూడు కొత్త మండలాలు | Three new zones-MRGS-Telangana". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)