మహమ్మదాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహమ్మదాబాద్
—  మండలం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్​నగర్​ జిల్లా
మండల కేంద్రం మహమ్మదాబాద్
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2016)
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}

మహమ్మదాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలం.[1][2][3] మహమ్మదాబాద్ గ్రామం కొత్త మండలంగా ఏర్పడక ముందు గండీడ్ మండల పరిధిలో ఉంది. గండీడ్ మండలం లోని 10 గ్రామాలతో కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలం పరిధిలో చేరాయి. ఇది 2021 ఏప్రిల్ 24 నుండి నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించింది.[4][5] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూగల మధ్య కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి.[1][3] ఇందులో 10 రెవెన్యూ గ్రామాలున్నాయి.నిర్జన గ్రామాలు లేవు.[6] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. మండల కేంద్రం మహమ్మదాబాద్.

2021 లో ఏర్పడిన మండలం

[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణలో రంగారెడ్డి జిల్లా, పరిగి రెవెన్యూ డివిజను నుండి 28 గ్రామాలతో మహబూబ్​నగర్​ జిల్లాలో చేరిన గండీడ్ మండలం నుండి 10 గ్రామాలను విడగొట్టుట ద్వారా 2021 ఏప్రిల్ 24 ఈ మండలం ఏర్పడింది. ఇది మహబూబ్​నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో భాగం.[7]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నంచెర్ల
  2. గాదిర్యాల్
  3. చౌదర్‌పల్లి
  4. మంగంపేట్
  5. ముకర్లాబాద్
  6. జూలపల్లి
  7. అన్నారెడ్డిపల్లి
  8. లింగయపల్లి
  9. మహమ్మదాబాద్
  10. సంగాయపల్లి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2021-04-29.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-11. Retrieved 2021-05-11.
  3. 3.0 3.1 "రాష్ట్రంలో మ‌రో రెండు కొత్త మండ‌లాల ఏర్పాటు". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2021-05-11.
  4. "కొత్త మండలాలకు గ్రీన్‌ సిగ్నల్‌". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2021-05-15.
  5. Namasthe Telangana (19 June 2021). "చిరకాల స్వప్నం నిజమాయే…". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  6. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  7. Service, Express News (2021-04-25). "Notification to create two new mandals issued". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-30.

వెలుపలి లంకెలు

[మార్చు]