గండీడ్ మండలం
గండీడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
గండీడ్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°55′25″N 77°48′19″E / 16.92361°N 77.80528°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్‌నగర్ జిల్లా |
మండల కేంద్రం | గండీడ్ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 227 km² (87.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 70,387 |
- పురుషులు | 35,062 |
- స్త్రీలు | 35,325 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.31% |
- పురుషులు | 56.50% |
- స్త్రీలు | 30.34% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 30 కి. మీ. దూరంలో వికారాబాదు జిల్లా, తాండూరు రోడ్డు మార్గంలో ఉంది. ఈ ఊరి పేరు మొదట్లో గండివీడు అని పిలిచేవారు. కాల క్రమంలో గండీడుగా మారింది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పరిగి రెవెన్యూ డివిజనులో ఉండేది.ఈ మండలం పునర్వ్యవస్థీకరణలో 28 రెవెన్యూ గ్రామాలతో మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది. .2021 ఏప్రిల్ 24న ఈ మండలం నుండి 10 గ్రామాలు కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలంలో చేరినవి.అవిపోను ఈ మండలలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం గండీడ్
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 70,387. జనాభాలో పురుషులు 35,062 కాగా, స్త్రీల సంఖ్య 35,325. మండలంలో 13,985 గృహాలున్నాయి.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 70,387 - పురుషులు 35,062 - స్త్రీలు 35,325,అక్షరాస్యత మొత్తం 43.31% - పురుషులు 56.50% - స్త్రీలు 30.34%
రంగారెడ్డి జిల్లా నుండి మహబూబ్‌నగర్ జిల్లాకు
[మార్చు]2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా, పరిగి రెవెన్యూ డివిజనులో ఉండేది.పునర్వ్యవస్థీకరణలో 28 గ్రామాలతో మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది..2021 ఏప్రిల్ 24న ఈ మండలం నుండి 10 గ్రామాలు కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలంలో చేరినవి.
సమీప మండలాలు
[మార్చు]ఈ గ్రామానికి చుట్టుప్రక్కల కుల్కచెర్ల మండలం, కోస్గి మండలం, హాంవాడ, దోమ మండలాలున్నాయి.
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కప్లాపూర్
- వెన్నచేడ్
- జిన్నారం
- చెల్‌మిల్ల
- సాలార్‌నగర్
- పెద్దవర్వల్
- చిన్నవర్వల్
- రుసుంపల్లి
- గండీడ్
- బైస్‌పల్లి
- రెడ్డిపల్లి
- సల్కర్‌పేట్
- గొవిందపల్లి
- పగిడ్యాల్
- బల్సుల్గొండ
- కొండాపూర్
- మన్సూర్‌పల్లి
- కొంరెడ్డిపల్లి
కొత్తగా ఏర్పడిన మహమ్మదాబాద్ మండలానికి తరలించిన గ్రామాలు
[మార్చు]గతంలో ఈమండలంలో ఉన్న 10 గ్రామాలుతో మహమ్మదాబాద్ మండలం కొత్తగా ఏర్పడినందున దిగువ గ్రామాలు తరలించబడ్డాయి.[4]
- నంచెర్ల
- గాదిర్యాల్
- చౌదర్‌పల్లి
- మంగంపేట్
- ముకర్లాబాద్
- జూలపల్లి
- అన్నారెడ్డిపల్లి
- లింగయపల్లి
- మహమ్మదాబాద్
- సంగాయపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2021-04-29.