ఉప్పరిపల్లి కృష్ణదాసు
Jump to navigation
Jump to search
ఉప్పరిపల్లి కృష్ణదాసు | |
---|---|
జననం | సోలీపుం కృష్ణదాసు 1866 ఉప్పరిపల్లి, ఘన్‌పూర్ మండలం,వనపర్తి జిల్లా |
మరణం | 1952 |
ఇతర పేర్లు | సోలీపుం కృష్ణదాసు |
మతం | హిందూ |
తండ్రి | నరసయ్య |
తల్లి | లక్ష్మీ నరసమ్మ |
ఉప్పరిపల్లి కృష్ణదాసు (సోలీపురం కృష్ణదాసు) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు. సోలీపురం గురుభజన కీర్తనలు పేరుతో దాదాపు 250 పద్యాలు, కీర్తనలు రచించాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]కృష్ణదాసు 1866లో నరసయ్య, లక్ష్మీనరసమ్మ దంపతులకు వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలం, ఉప్పరిపల్లి గ్రామంలో జన్మించాడు. కృష్ణదాసు బాల్యం, విద్యాభ్యాసం అంతా ఆయన మేనమామలైన తిరునగరి పాపకవి, సింహకవి సమక్షంలో జరిగింది.[2]
రచనాప్రస్థానం
[మార్చు]మేనమామలు పండితులు అవడం వలన సంస్కృతంపై పట్టు సాధించిన కృష్ణదాసు, కవిత్వ రచన ప్రారంభించాడు. సోలీపురం గురుభజన కీర్తనలు అనే పేరుతో 240 పద్యాలు, కీర్తనలు రాశాడు. భజనల ద్వారానే దేవుణ్ణి స్తుంతించాలని చాటి చెప్పాడు.
మరణం
[మార్చు]ఈయన 1952లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ ఉప్పరిపల్లి కృష్ణదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 25
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 11 November 2019.