ఖ్వాజా అహ్మదుద్దీన్
Jump to navigation
Jump to search
ఖ్వాజా అహ్మదుద్దీన్ | |
---|---|
జననం | 1905 వసంతాపురం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ |
మరణం | అక్టోబరు 20, 1970 |
తండ్రి | షేక్ బాలె సాహెబ్ |
తల్లి | ఫఖ్రున్నిసాబేగం |
ఖ్వాజా అహ్మదుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అహ్మదుద్దీన్ 1905వ సంవత్సరంలో షేక్ బాలె సాహెబ్, ఫఖ్రున్నిసాబేగం దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లాలో వసంతాపురం గ్రామంలో జన్మించాడు. పదకొండేళ్ళ వయసులో అల్లాజీ అవదూత దర్శనం, పన్నెండేళ్ళ వయసులో అల్లాజీ అనుగ్రహం లభించాయి.
రచనా ప్రస్థానం
[మార్చు]ఈయన రాసిన కృతులు అహ్మదుద్దీన్ ఆత్మతత్త్వములు పేరుతో ఐదు భాగాల గ్రంథంగా మొదటి ప్రచురణ 1952లో, రెండవ ప్రచురణ 1997లో వెలువడింది. ఈ తత్త్వాలన్ని పాడుకునేందుకు వీలుగా ఉండడమేకాకుండా, వినడానికి శ్రావ్యంగా ఉంటాయి. ఉర్దూలో దాదాపు 32 గజల్స్ రాశాడు.[2]
మరణం
[మార్చు]ఈయన 1970, అక్టోబరు 20న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 4 December 2019.
- ↑ ఖ్వాజా అహ్మదుద్దీన్, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట.44