తల్లివేరు (కవిత్వ పుస్తకం)
తల్లివేరు | |
తల్లివేరు పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | సంకలనం |
---|---|
సంపాదకులు: | మామిడి హరికృష్ణ |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం(కళా ప్రక్రియ): | ఊరుపై కవిత్వం |
ప్రచురణ: | సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ |
విడుదల: | జూన్ 3, 2017 |
తల్లివేరు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన కవిత్వ పుస్తకం. 2017 హేవళంబి నామ ఉగాది సందర్భంగా కేవలం ఊరును ఇతివృత్తంగా తీసుకొని 47 కవితలతో ఈ కవితా సంకలనం వెలువడింది.[1]
ఆవిష్కరణ[మార్చు]
ఈ కవితా సంకలనాన్ని 2017, జూన్ 3వ తేదీన రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి పర్యాటక మరియు సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.[2]
పుస్తక అంకురార్పణ[మార్చు]
హేవళంబి నామ ఉగాది రోజున ఊరును ఇతివృత్తంగా తీసుకొని భాషా సాంస్కృతిక శాఖ ఒక కవి సమ్మేళనాన్ని నిర్వహించి, కవితల పరిశీలనకోసం ఒక సలహామండలిని కూడా ఏర్పాటుచేసింది. అలా ఎంపికచేసిన 47 కవితలతో 2017 జూన్‌లో ఈ సంకలనాన్ని ముద్రించడం జరిగింది.
సలహామండలి[మార్చు]
కవులు - కవితలు[మార్చు]
- ఆశారాజు - ఇది కవి నివాసం
- ఆచార్య మసన చెన్నప్ప - ఋణాను బంధం
- ఆచార్య ఫణీంద్ర - తల్లి వేరు!
- అందోజు పరమాత్మ - బొడ్డుతాడు
- అన్వర్ - మట్టిబంధం
- దాసరాజు రామారావు - తల్లిగారి ఊరు
- డా. అమ్మంగి వేణుగోపాల్ - ఊరు - పేరు
- డా. బెల్లి యాదయ్య - వర్థిల్లాలి
- డా. భీంపల్లి శ్రీకాంత్ - పల్లె పిలుస్తోంది!
- డా. చిమ్మపూడి శ్రీరామమూర్తి - ఊరే మన తల్లి
- డా. దేవరాజు మహారాజు - ఊరే తల్లివేరు
- డా. ఏనుగు నరసింహారెడ్డి - అదే ఊరు
- డా. కె.బి.గోపాలం - నరడివిలో నేను
- డా. కాంచనపల్లి - కొన్ని జ్ఞాపకాలు...
- డా. నాళేశ్వరం శంకరం - ఇంకిన పాలసముద్రం
- డా. పగడాల నాగేందర్ - ఊరు జ్ఞాపకాల్లోనూ...
- డా. పులిపాటి గురుస్వామి - వదలని పాట
- డా. రూప్ కుమార్ డబ్బీకార్ - నిరీక్షణ
- డా. ఎస్. చెల్లప్ప, ఐ.ఏ.ఎస్. (రి) - జన్మకోస్నానం
- డా. ఎస్వీ సత్యనారాయణ - నా వూరు హైదరాబాద్ పాతబస్తీ
- డా. తిరుమల శ్రీనివాసాచార్య - మన ఊరే
- డా. తిరునగరి - ఈ వసంత ప్రఖాతంలో...
- డా. తిరునగరి దేవకీదేవి - హేవళంబి నువ్వడుగేయ్
- డా. వి. తీవ్రేణి - మా ఊరు...
- డా. వడ్డేపల్లి కృష్ణ - నా తల్లివేరు!
- డా. వాణి దేవులపల్లి - ఊరు
- జి. నరసింహస్వామి - ఊరేది?
- ఘనపురం దేవేందర్ - పల్లెతల్లి జయహో...
- హిమజ - నా ఊరు
- అయినంపూడి శ్రీలక్ష్మి - ఏకచక్రపురంలో...
- జాజుల గౌరి - నా ఊరు
- జూలూరి గౌరీశంకర్ - ఊరు నా నిఘంటువు
- జూపాక సుభద్ర - పాడవే చెల్లీ...
- కందుకూరి శ్రీరాములు - నా వేరు
- కోడూరి విజయకుమార్ - ఒక ఉగాది సాయంత్రం
- మామిడి హరికృష్ణ - మా ఊరి పురాణం
- మోహన్ రుషి - ఊరికి పోయినప్పుడే ఉగాది
- నాంపల్లి సుజాత - కన్నీటి ఊట
- పొన్నాల బాలయ్య - తేమిడి
- సత్యం సాగర్ ఎ.బి.జె. - రాజ్యమేలేది ఊరే!
- స్వాతీ శ్రీపాద - మన తల్లి
- తైదల అంజయ్య - పంచ ప్రాణాలు
- వద్దిరాజు నాగేందర్ రావు - జ్ఞాపకాలు
- వఝల శివకుమార్ - మట్టి ప్రేమల ఆలయం
- వనపట్ల సుబ్బయ్య - ఊరు మన వేరు
- వేముగంటి మురళీకృష్ణ - నా వాడకట్టు కళల పుష్పం
- జింబో (మంగారి రాజేందర్) - ఊరుంది...
మూలాలు[మార్చు]
- ↑ వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, ఎడిట్ పేజి వ్యాసాలు (16 April 2018). "కొత్తరాష్ట్రంలో కొత్తసాలు". అయినంపూడి శ్రీలక్ష్మి. Retrieved 29 August 2018. Cite news requires
|newspaper=
(help) - ↑ నమస్తే తెలంగాణ (9 June 2017). "'తల్లివేరు' ఆవిష్కరణ". మూలం నుండి 29 August 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 29 August 2018. Cite news requires
|newspaper=
(help)