తైదల అంజయ్య
Jump to navigation
Jump to search
తైదల అంజయ్య | |
---|---|
జననం | తైదల అంజయ్య జులై 6, 1975 కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం, నాగసముద్రాల గ్రామం, తెలంగాణ |
నివాస ప్రాంతం | కోహెడ మండలం, నాగసముద్రాల గ్రామం, తెలంగాణ |
వృత్తి | కవి, రచయిత. |
తైదల అంజయ్య (జననం: జులై 6, 1975) తెలంగాణ కు చెందిన కవి, రచయిత.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]తైదల అంజయ్య 1975, జులై 6 న ఆనాటి కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం లోని నాగసముద్రాల గ్రామం లో మల్లవ్వ, రాజయ్య దంపతులకు జన్మించారు. చిన్నపటి నుండే సాహిత్యం పై మక్కువ పెంచుకున్నారు. యం ఎస్సి(ఫిజిక్స్ ) బీఈడీ , యం ఏ (తెలుగు) లో పట్టభద్రులు అయ్యారు. [1]
జీవిత విశేషాలు
[మార్చు]డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారి రచనకు, సాహిత్యానికి ఆకర్షితులయ్యారు. వార్త, ఆంధ్రజ్యోతి, సూర్య తదితర పత్రికల్లో ఇతని కవితలు ప్రచురితమయ్యాయి . చిక్కనవుతున్న పాట అనే కవిత సంకలనం లో ఇతను రచించిన కవిత చాటింపు పేరుతో ప్రచురితమైనది. 2006 లో వెలువరించిన పునాస కవిత సంపుటానికి రంజని కుందుర్తి ప్రశంసా పత్రం అందుకున్నారు. మంజీరా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. [2]
కవిత సంపుటాలు
[మార్చు]- పునాస - 2006
- ఎర్రమట్టిబండి - 2012
రచనలు
[మార్చు]- చాటింపు
- పొక్కిలి
- మత్తడి
- ఎడపాయాలు
పురస్కారాలు
[మార్చు]- రంజని కుందుర్తి ప్రశంసా పత్రం-1998
- రంగినేని ట్రస్ట్ రాష్ట్ర స్థాయి అవార్డు - 2007
- ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు - 2007
- భారతీయ దళిత సాహిత్య అవార్డు-2009
- 56-ఫౌండషన్ అవార్డు - 2010
- సినారే అవార్డు - 2014
- సదాశివుడు స్మారక అవార్డు - 2016
- మిషన్ కాకతీయ మీడియా అవార్డు - 2016
- సిద్ధిపేట జిల్లా ఉత్తమ కవి అవార్డు -2017
మూలాలు
[మార్చు]- ↑ తైదల అంజయ్య. "తైదల అంజయ్య". www.sakshi.com. సాక్షి. Retrieved 8 November 2017.
- ↑ తైదల అంజయ్య. "పీడిత-ప్రజల-పక్షపాతి". తెలంగాణ మాస పత్రిక. Retrieved 8 November 2017.