హేవిలంబి
స్వరూపం
(హేవళంబి నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1837-1838, సా.శ. 1897 - 1898, 1957 - 1958, 2017 - 2018లో వచ్చిన తెలుగు సంవత్సరానికి హేవిలంబి అని పేరు.
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1897 : చైత్రమాసములో తిరుపతి వేంకట కవులు గుంటూరులో అవధానము జరిపారు.[1]
- సా.శ. 2017 : భాద్రపద బహుళ సప్తమీ మంగళవారం 2017 సెప్టెంబరు 12 నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత కావేరీ నదీ పుష్కరములు ప్రారంభమైనవి[2]
- సా.శ. 2017 :శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07.08.2017నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గాలగ్రాసకేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించింది.
- సా.శ.2017 శుక్ల మాఘ పూర్ణిమా బుధవారము 31-01-2018 నాడు ఆశ్రేషా నక్షత్రములో కర్కాటకరాశిలో రాహుగ్రస్త (సంపూర్ణ) చంద్రగ్రహణం సంభవించింది.
జననాలు
[మార్చు]- సా.శ. 1838 శ్రావణ శుద్ధ దశమి : పోతరాజు రామకవి - సంస్కృతాంధ్ర పండితులు
- సా.శ. 1897 జూలై 4. ఆషాఢ శుద్ధ పంచమి : అల్లూరి సీతారామరాజు
- సా.శ. 1897 జూన్ 16 జ్యేష్ఠ బహుళ పాడ్యమి : పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు, శతావధాని, ఆంధ్రకాదంబరి కావ్య రచయిత. (మ.1977 నల) [3]
మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]
- ↑ Pratap (2017-03-27). "హేవిలంబి నామ సంవత్సరంలోని ముఖ్యమైన విశేషాలు". telugu.oneindia.com. Retrieved 2020-08-18.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 214.