కందుకూరి శ్రీరాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుకూరి శ్రీరాములు
జననంకందుకూరి శ్రీరాములు
1951, అక్టోబర్ 20
తెలంగాణా రాష్ట్రం, మెదక్ జిల్లా, సిద్ధిపేట మండలం రావురూకుల గ్రామం
వృత్తితెలుగు లెక్చెరర్
ప్రసిద్ధివచనకవి
మతంహిందు
భార్య / భర్తలక్ష్మిశ్రీ
పిల్లలుహర్షిణి
తండ్రికందుకూరి వెంకట్రావు
తల్లిరత్నమ్మ

కందుకూరి శ్రీరాములు [1] 1951, అక్టోబర్ 20 వ తేదీన రావురూకల గ్రామంలో జన్మించాడు. కందుకూరి రత్నమ్మ, వేంకటాద్రి ఇతని తల్లిదండ్రులు. ఎం.ఏ. (తెలుగు) చదివాడు. గవర్నమెంట్ హైస్కూలులో టీచింగ్ అసిస్టెంట్‌గా చేరి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు[2]ను గెలుచుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.

రచనలు

[మార్చు]
  1. దివిటీ (1974)
  2. వయోలిన్ రాగమో వసంత మేఘమో (1994) - మంజీర రచయితల సంఘం ప్రచురణ
  3. సందర్భం (2001)
  4. కవ్వం (2002)
  5. దహన కావ్యం (2003)
  6. పీఠభూమి[3] (2005)
  7. వెన్నెల బలపం (2008)
  8. రావురూకల[4] (2009) - ఝరి పొయెట్రీ సర్కిల్ ప్రచురణ
  9. తెలంగాణ రథం[5] (2013)
  10. అలుకు పిడుచ (2014)

అవార్డులు

[మార్చు]
  1. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  2. [ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు]] (1994లో వయోలిన్ రాగమో వసంతమేఘమోకు)
  3. సి.నా.రె. కవితా పురస్కారం
  4. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం (2004 సందర్భంకవితా సంకలనానికి)
  5. ఈదురు సుబ్బయ్య సాహిత్యపురస్కారం
  6. ఆంధ్రసారస్వత సమితి పురస్కారం
  7. కాకతీయ యూనివర్సిటీ పురస్కారం

రచనలనుండి ఉదాహరణ

[మార్చు]
గగనకళ
చూపుండాలిగాని
ఏ దిక్కు చూసినా అందం ఆనందం
ఈ ఆకాశం
నవరసాల సువిశాల స్వతంత్ర సుక్షేత్రం
అందుకుందామంటే అందదు
అణగదొక్కుదామంటే కుంగదు
భూగోళం గుడిసె ముందట
ముగ్గులలో మురిపెంగా
తీర్చిదిద్దిన వాకిలి ఈ ఆకాశం
చిన్నపిల్లలై వ్యోమగాములు
మూడుచక్రాల బండ్ల రాకెట్లెక్కి
ఈ మూల నుండి ఆ మూలకు
ఆ మూల నుండి ఈ మూలకు
పోటీపడి ఆదుకోవచ్చు పాడుకోవచ్చు
ఎన్ని మార్గాల్లోనైనా విహరించవచ్చు
ఎన్ని ప్రయోగాలైనా చేసుకోవచ్చు
నక్షత్రాలన్ని గాలించి రావటం
గ్రహాలన్నిశోధించి రావటం
మహాప్రస్థాన యాత్రాస్థలం ఈ నీలాకాశం
ఎన్నో పరిణామాల యుద్ధ విమానాల
అతి పెద్ద రంగస్థల ప్రవేశం ఈ నింగి
వేదికనధిష్టించిన
వీరుల కదలికలు చంద్రవంకలు
భూమ్మీద నుండి చూస్తే
బోర్లించిన కోళ్లగంప ఈ దివి
గంప కింద ఎరుపుజుట్టుల
కొక్కోరోకోలు ఉభయసంధ్యలు
తేజస్సు మేధస్సుతో
రెప్పార్పని కన్ను ఈ మున్ను
సంగ్రామ రంగంలో రంగుల విల్లు సంధిస్తున్న
నైపుణ్య బాణాల చినుకులు
పడమర నుండి బయల్దేరితే
తూర్పు దాకా
దక్షణం నుండి దండయాత్ర చేస్తే
ఉత్తరం దాకా
దట్టమైన చీకట్ల పదఘట్టనల
కోట్ల చెట్ల విజృంభణల
భయంకరారణ్యం ఈ గగనం
ఎన్నో అలల సుడుగాలుల
తుఫాన్ భీభత్సాల
మహూద్రేక మహా సముద్రం
చకచక మెరుపుల ఉరుముల
ఫెళఫెళార్భాట పిడుగుల
రుద్రరూప భీతావహ జ్వాలాజ్వలితం
సూర్యునంత ఎత్తు
కనిపించని కట్టెకొసకు
రెపరెపలాడుతున్న జెండా
ఎన్నో కోణాల్తో
ఎన్నెన్నో ఇతివృత్తాలతో
తెల్లకాగితంమ్మీద గీసిన వృత్తం
పుట్టినాక బతకడానికి
గుడిసె కూడా లేనివాని ఇంటి పైకప్పు
భయానికి భూమంతా కదిలిపోతుంటే
ఒక్కసారి పైకి చూడు
నేనున్నానని తండ్రిలా
వెన్నుతట్టుతున్న గుండె ధైర్యం
గాలంతా విశాలం ఈ ఆకాశం
త్యాగాల తంత్రుల మీద
పోరాటాల రాగలు తీస్తుంది
విలయతాండవం చేయడానికి
కైలాస శిఖర సభలో కొలువుదీరిన
బుద్దిజీవులు చుక్కలు
జీవగంజి పోయడానికి
ఆవిరితట్టలు మోసుకు తిరుగుతున్న
కావడి బతుకులు మేఘాలు
ఆ దిక్కు సూర్యగోళం
ధగధగమంటుంది
ఈ దిక్కు చంద్రబింబం
నవనవలాడుతుంది
అందం ఆకాశం
వెచ్చని తూర్పు వెలుతురులో
ఒళ్ళంతా హొయలు గొలుపుతుంది
ఆనందం ఆకాశం
తెల్లని మబ్బుల బెలూన్లతో
ఇల్లంతా పండగ చేసుకుంటుంది

మూలాలు

[మార్చు]
  1. కదిలించేకలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నేటినిజం దినపత్రిక ఆగష్టు8 2014 సంచిక నుండి
  2. [1][permanent dead link] మ్యూజ్‌ఇండియా
  3. [2][permanent dead link] ఉదారి నారాయణ సమీక్ష
  4. [3][permanent dead link] గ్రామాన్ని కవితామయం చేసిన కందుకూరి - విహారి సమీక్ష
  5. [4] Archived 2016-03-04 at the Wayback Machine శశాంక సమీక్ష