కోడూరి విజయకుమార్
Appearance
కోడూరి విజయకుమార్ | |
---|---|
జననం | కోడూరి విజయకుమార్ 1969 జూలై 1 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, కవి |
కోడూరి విజయకుమార్ ఒక కవి, కథా రచయిత, విమర్శకుడు.[1][2] జూలై 1, 1969 న వరంగల్ నగరంలో జన్మించారు. తండ్రి శ్రీ భద్రయ్య - తల్లి శ్రీమతి అనసూయ. కోడూరి విజయకుమార్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. తెలంగాణ విద్యుత్ రంగంలో సీనియర్ ఇంజినీరుగా ఉద్యోగం. హైదరాబాదు లో నివాసం ఉంటున్నాడు.
రచనలు
[మార్చు]- వాతావరణం - కవితా సంకలనం (1997)
- ఆక్వేరియంలో బంగారు చేప - కవితా సంకలనం (2000)
- అనంతరం - కవితా సంకలనం (2010)
- ఒక రాత్రి మరొక రాత్రి - కవితా సంకలనం (2014)
కవిత్వానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, నూతలపాటి గంగాధరం, తెలుగు విశ్వవిద్యాలయం, విశ్వ కళాపీఠం తదితర పురస్కారాలు అందుకున్నాడు.
చిత్రమాలిక
[మార్చు]-
2017 ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న కోడూరి విజయకుమార్
-
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న కోడూరి విజయ్ కుమార్