ఊరికి పోయిన యాళ్ళ
ఊరికి పోయిన యాళ్ళ | |
కృతికర్త: | మామిడి హరికృష్ణ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | కవిత్వం |
ప్రచురణ: | స్వరాజ్యం పబ్లికేషన్స్, హైదరాబాద్ |
విడుదల: | సెప్టెంబరు 20, 2018 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-9354165153 |
ఊరికి పోయిన యాళ్ళ తెలంగాణ భాషలో రాయబడిన కవిత్వ సంకలనం.[1] తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, కవి మామిడి హరికృష్ణ రాసిన కవితలతో స్వరాజ్యం పబ్లికేషన్స్ ఈ పుస్తకం ప్రచురించింది.[2] తెలంగాణ పల్లెల్లోని సౌందర్యం, పల్లె ప్రజల ఆత్మీయ అనుబంధాలు, విభిన్న కులాల వృత్తులు, అక్కడి భౌగోళిక అంశాలతోపాటు తన స్వగ్రామంలోని తన చిన్ననాటి జ్ఞాపకాలను హరికృష్ణ ఈ సంకలనంలో పొందుపరిచాడు.[3]
ఆవిష్కరణ
[మార్చు]ఈ సంకలనాన్ని హరికృష్ణ తన తల్లికి అంకితమిచ్చాడు. 2018, సెప్టెంబరు 20న తన తల్లి వర్ధంతి సందర్భంగా, తన తండ్రి చేతులమీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడు.
కవిత్వ నేపథ్యం
[మార్చు]1995-2018 మధ్య తెలంగాణ భాషలో రాసిన 30 కవితలను ఎంపిక చేసి ఈ సంకలనం తీసుకువచ్చారు.[4] ఈ సంకలనంలోని కవితలు ఊరి చరిత్రను, ఆత్మీయుల అనుబంధాల తండ్లాటను, ప్రతి మనిషికి పుట్టిన ఊరు మీద ఉండాల్సిన ప్రేమ గురించి తెలియజేస్తాయి.పుట్టిన ఊరికి దూరంగా బతుకుతున్న మనిషి చాలారోజుల తరువాత తన సొంత ఊరికి వెళ్ళిన్నప్పుడు అతనిలో కలిగే అనుభూతులు, అనుభవాలు, జ్ఞపకాలకు అక్షర రూపం ఈ పుస్తకం. గ్రామీణ వాతావరణంలోని కులవృత్తులను, ఆయా కులాల వ్యక్తులను గుర్తు చేసుకుంటూ, వారితో తనకున్న అనుభూతిని తెలుపుతూ అంతరించిపోయిన కులవృత్తుల పట్ల ఆవేదనతో కూడిన కవిత్వం కూడా ఇందులో ఉంది.
గుర్తింపు
[మార్చు]ఈ సంకలనంలోని ‘పండుగ‘ అనే కవిత ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్- 2020‘ కి ఎంపికయింది. ఒక ప్రాంతానికి పరిమితమైన కవి భావజాల సంఘర్షణను దేశంలోని 22 భాషల్లోకి అనువదించి, ఆ ప్రాంత అస్తిత్వాన్ని ఆవిష్కరింప చేయడం కార్యక్రమ ఉద్దేశ్యం. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ భాషలో రాయబడిన ఈ కవితకి మొదటిసారిగా ఈ ఘనత దక్కడం, 2019, డిసెంబరు 27,28న ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో హరికృష్ణ పాల్గొని కవిత్వాన్ని చదివాడు.
కవితలు
[మార్చు]- అమ్మ చెప్పిన ఖాందాని కత
- బుగులోని తీర్థం
- బోనం సాక
- చత్తిరి
- చెరుకు బాయి
- దారం కట్టిన సందమామ
- దోని నీళ్ళు
- E - 1, రూమ్ నెంబరు 70...
- Fusion షాయరీ on తెలంగాణా జమీన్
- గుట్టను పగలేసినం
- ఇనుప కంచె... అడ్డుగోడ... ఒక జన జాతర!
- జెండాగా ఎగిరిన అచ్చరం
- కొత్త సాలు ముచ్చట
- కట్ట మీద రాల చెట్టు!
- మట్టి చెక్కిన శిల్పం
- మా ఊరి పురాణం
- మావోన్ని మాయం సేసినంక
- Occupy హైదరాబాద్
- ఊరికి పోయిన యాళ్ల
- ఊరు బతక బోతాంది
- పండుగ
- పచ్చడి, బచ్చం... మా బంగ్లా...
- పట్నం పెద్దమ్మ అసొంటిది
- పిట్టని దేవులాడిన గూడు
- సలి మంట
- సాపేక్షత
- సీత కుంట
- తంగేడు పూల నేల
- వానెల్సినంక
- 'యాకుత్ పురా'ణ శకలం
మూలాలు
[మార్చు]- ↑ Babu, Velugu (2023-08-13). "ఊరు తెలంగాణ భాష తెలంగాణ - Mana Telangana". Mana Telangana. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
- ↑ "Ooriki Poyina Yaalla". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 9 సెప్టెంబరు 2021. Retrieved 9 September 2021.
- ↑ మన తెలంగాణ, కలం (30 December 2019). "తెలంగాణ బతుకు చిత్రణ". Archived from the original on 20 April 2020. Retrieved 9 September 2021.
- ↑ Harikrishna, Mamidi (2018-09-28). Ooriki Poyina Yaalla. Retrieved 9 September 2021.
{{cite book}}
:|website=
ignored (help)