పటం కతలు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పటం కతలు
పటం కతలు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: మామిడి హరికృష్ణ, విష్ణుభట్ల ఉదయ్ శంకర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): వ్యాసాలు
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: డిసెంబర్ 17, 2017
పేజీలు: 170
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-936345-4-7


పటం కతలు పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది.[1][2] కొన్ని వందల ఏళ్ల పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో వినోదంగా, కళగా, హోదా ప్రదర్శనకు ఆలంబనగా, ఉంటూ వచ్చిన కథన కళారూపాలు ఈ 'పటం కతలు', గత కొన్ని దశాబ్దాల కాలం నుంచీ నిర్లక్షానికి, నిరాదరణకు గురయ్యాయి. అటువంటి ‘పటం కతల’ కళారూపాన్ని వాటిలోని రకాలని, విశిష్ఠతలని ఒక్కచోట పేర్చి పటం కతలు పేరుతో ఓ పుస్తకంగా ప్రచురించి, ప్రపంచ తెలుగు మహాసభలలో ఆవిష్కరించడం జరిగింది.

సంపాదకవర్గం[మార్చు]

  • సంపాదకులు: మామిడి హరికృష్ణ, విష్ణుభట్ల ఉదయ్ శంకర్
  • సలహామండలి: డా. నునుమాస స్వామి, డా. భట్టు రమేష్, డా. గడ్డం వెంకన్న, డా. బాసని సురేష్, చావలి దేవదాస్, సి.ఎస్. రాంబాబు, ఎన్. విజయ రాఘవ రెడ్డి
  • నిర్వాహణ - కూర్పు: అయినంపూడి శ్రీలక్ష్మీ

రూపకల్పన[మార్చు]

తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖులతో కమిటీలు వేసి పటం కతలకు సంబంధించిన విషయాల గురించి రాయగలిగిన నిపుణులను ఎంపికచేసి, ఆయా ఆంశాల రచనా బాధ్యతలను వారికి అప్పగించడం జరిగింది. అలా వచ్చిన పరిశోధన పత్రాలను ఆకాశవాణి నుండి ప్రసారం చేయడం జరిగింది. ఇలా వచ్చిన రేడియో ప్రసంగాలను పుస్తకంగా ప్రచురించే బాధ్యతను భాషా సాంస్కృతిక శాఖ తీసుకొని పుస్తకాన్ని ప్రచురించింది. 18 నెలల నిరంతర కృషి ఫలితంగా వెలుపడిన ఈ పుస్తకం మొదటి సంపుటిగా భావిస్తూ, మున్ముందు మరిన్ని పుస్తకాలు తీసుకురావాలని భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి ప్రయత్నాలు చేస్తుంది.

విషయసూచిక[మార్చు]

  1. పటం కతలకు ఆధారాలు-నకాశీ చిత్రాలు - డా. గడ్డం వెంకన్న
  2. (ఎ) అద్దపు పటం కత (నాయి బ్రాహ్మణ పురాణం) - డా. అన్నావఝ్జుల మల్లికార్జున్, (బి) నాయీ పటం కత - కట్టా ప్రతిభాగౌడ్
  3. ఏనూటి పటం కత (గౌడ పురాణం) - డా. బాసని సురేష్
  4. డక్కలి పటం కత (జాంబ పురాణం) - డా. గూడూరు మనోజ
  5. గౌడ జట్టీల పటం కత (గౌడ పురాణం) - డా. గడ్డం వెంకన్న
  6. గుఱ్ఱపు పటం కత (మాల చెన్నయ్య పురాణం) - అబ్బు గోపాల్ రెడ్డి
  7. కాకిపడిగెల పటం కత (పాండవుల కతలు) - డా. గడ్డం వెంకన్న
  8. కొమ్ము పటం కత (కాటమరాజు యాదవ కతలు) - డా. భట్టు రమేష్
  9. కొర్రాజుల పటం కత (పద్మనాయక పురాణం) - అడ్లూరి శివప్రసాద్
  10. కోయ పటం కత (కోయ పురాణం) - కట్టా ప్రతిభాగౌడ్
  11. కూనపులి పటం కత (మార్కండేయ పురాణం) - డా. బాసని సురేష్
  12. మందెచ్చుల పటం కత (యాదవ కతలు) - డా. శ్రీమంతుల దామోదర్
  13. మాసయ్య పటం కత (మడేలు పురాణం) - డా. చూరేపల్లి రవికుమార్
  14. పెక్కర్ల పటం కత (గుండ బ్రహ్మయ్య పురాణం) - నేతి మాధవి
  15. పూజారి పటం కత (పాండవుల కత) - అడ్లూరి శివప్రసాద్
  16. తెరచీరల పటం కథ (యాదవ కతలు) - నేతి మాధవి

మూలాలు[మార్చు]

  1. మన తెలంగాణ (10 December 2017). "ఆశ్రిత వర్గాల కథన కళారూపాలు". Retrieved 19 January 2018.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 December 2017). "రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పాట". Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.