స్వర్ణ కిలారి
స్వర్ణ కిలారి | |
---|---|
జననం | నవంబరు 4 కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ప్రసిద్ధి | రచయిత్రి, సినీనటి |
మతం | హిందూ |
భాగస్వాములు | దిలీప్ కొణతం |
పిల్లలు | అర్ణవ్ |
తండ్రి | రాజేశ్వరరావు |
తల్లి | ఝాన్సీ లక్ష్మి |
స్వర్ణ కిలారి తెలుగు రచయిత్రి, సినిమా నటి. అమ్మూనాయర్[1] ఇంగ్లీషులో రాసిన "ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీని" అనే ఆంగ్ల పుస్తకాన్ని "లిప్తకాలపు స్వప్నం"[2][3] పేరిట, మలయాళ రచయిత బెన్యామిన్ రాసిన "ఆడు జీవితం" అనే పుస్తకాన్ని "మేక బతుకు" పేరట తెలుగులోకి అనువదించింది.[4] కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన 'దొరసాని' సినిమాలో పెద్ద దొరసాని పాత్రలో నటించింది. తెలంగాణలోని వాడుక పదాలను ఒకచోట చేరుస్తూ తెలంగాణ భాషను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటైన గడిగోలు గ్రూప్ నిర్వాకురాలిగా ఉంది.[5]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]స్వర్ణ కిలారి నవంబరు 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో రాజేశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె కొత్తగూడెంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది, కంప్యూటర్ కోర్స్ చేయడానికి హైదరాబాదు వచ్చింది. సాఫ్ట్‌వేర్ కంపెనీ రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ కంపెనీలో కౌన్సెలర్‌గా చేరింది, కొంతకాలం సీటీవీలో జర్నలిస్ట్‌గానూ, న్యూస్ రీడర్‌గానూ పనిచేసింది.[4]
వివాహం
[మార్చు]2000, ఏప్రిల్ 19న దిలీప్ కొణతంతో స్వర్ణ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (అర్ణవ్)
సాహిత్య రంగం
[మార్చు]స్వర్ణ తల్లి ఝాన్సీలక్ష్మి పీయూసీ వరకు చదువుకుంది. అంతేకాకుండా ఝాన్సీలక్ష్మికి బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. దాంతో చిన్నప్నటి నుండి చందమామ, బాలమిత్ర, చతుర, విపుల పుస్తకాలు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వారపత్రికలు చదివిన స్వర్ణకు సాహిత్యంపై ఆసక్తి కలిగింది. దిలీప్ కూడా పుస్తక ప్రియుడు, రచయిత అవ్వడం వల్ల వివాహం అయ్యాక స్వర్ణకు అనేక రకాల పుస్తకాలు చదివే అవకాశం దొరికింది.
పుస్తకాలు
[మార్చు]- లిప్తకాలపు స్వప్నం (అనువాదం)
- ఇంతియానం (సంపాదకత్వం, 45మంది స్త్రీల యాత్రా కథనాల సంకలనం)[6][7]
- 13 (థాయ్‌లాండ్ బాలల ఫుట్ బాల్ టీ రెస్క్యూ ఆపరేషన్ కథ) 2024, ఫిబ్రవరి 15
- మేక బతుకు (గోట్ లైఫ్ పుస్తక అనువాదం) 2024, జూలై 14
- నల్ల బంగారం కథలు(సింగరేణి కాలరీస్ లోని జీవితాల ఆధారంగా రాసిన కథలు), 2024
సినిమారంగం
[మార్చు]- 2019: దొరసాని (పెద్ద దొరసాని)
- 2024: షరతులు వర్తిస్తాయి
పురస్కారాలు
[మార్చు]- హైబిజ్ మహిళా సాధికారత పురస్కారం
- 2021: లిప్తకాలపు స్వప్నం పుస్తకానికి అనువాదం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2023)[8]
చిత్రమాలిక
[మార్చు]-
13 (థాయ్‌లాండ్ బాలల ఫుట్ బాల్ టీ రెస్క్యూ ఆపరేషన్ కథ) పుస్తకావిష్కరణలో దిలీప్ కొణతంతో స్వర్ణ
-
'ఇంతియానం' పుస్తక ఆవిష్కరణ (తెలుగు విశ్వవిద్యాలయం, 2023 జూలై 9)
మూలాలు
[మార్చు]- ↑ మన తెలంగాణ (1 July 2019). "ఒక అద్భుత కథ". తాజా వార్తలు. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
- ↑ నమస్తే తెలంగాణ, LITERATURE (11 November 2019). "అపురూప జీవితగాథ". www.ntnews.com. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
- ↑ నవ తెలంగాణ, స్టోరి (6 October 2019). "ఏడేండ్ల జీవితానికి స్వర్ణాక్షర నివాళి". NavaTelangana. కవిత కట్టా. Archived from the original on 6 October 2019. Retrieved 12 November 2019.
- ↑ 4.0 4.1 telugu, NT News (2024-07-31). "ఆ ఎడారిలో.. నేనూ తప్పిపోయా!". www.ntnews.com. Archived from the original on 2024-08-01. Retrieved 2024-08-06.
- ↑ "బతుకమ్మ అంటే..ఊరి జ్ఞాపకాలు". 24 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
- ↑ telugu, NT News (2023-07-09). "ఆమె విశ్వయాత్రా కథనం." www.ntnews.com. Archived from the original on 2023-07-09. Retrieved 2023-07-09.
- ↑ ABN, సంపాదకీయం (2023-07-24). "ఆడవారి కళ్ళతో ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-07-24. Retrieved 2023-07-24.
- ↑ "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.