తేలు విజయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేలు విజయ
జననం1980
వృత్తిజానపద , సినీ గాయని
జీవిత భాగస్వామిబోగం సుమంత్‌ కుమార్‌
తల్లిదండ్రులుతేలు వెంకటరాజం, నర్సమ్మ

తేలు విజయ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ, జానపద గాయని. ఆమె 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తేలు విజయ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ముల్కనూరు గ్రామంలో తేలు వెంకటరాజం, నర్సమ్మ దంపతులకు జన్మించింది. ఆమె పీజీ వరకు చదువుకుంది.

గాయనిగా

[మార్చు]

తేలు విజయ చిన్ననాటి నుండే తన కుటుంబ సభ్యుల పడే జానపదాలు, బతుకమ్మ పాటలు, భజన పాటలు చూసి వారివద్దే పాడడం నేర్చుకుంది. ఆమె తరువాత జానపదాల పాటలవైపు మళ్ళి 1998లో ‘నగారే మోగింది’ అనే ప్రైవేట్ ఆల్బమ్ లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు.. ఈపువలగ్గొడ్తాండు ఇల్వదీసుకుంటాండు’ పాట ద్వారా గాయనిగా పరిచయమై తొలిపాటతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ 2007లో విడుదలైన ‘బతుకమ్మ’ సినిమాలో పాడిన ‘ఊరికి ఉత్తరానా వలలో.. ఊడాలామర్రీ వలలో’ పాట ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[2]

తేలు విజయ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  సాంప్రదాయ బతుకమ్మ పాటలతో బతుకమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ అనేక పాటలు పడింది, ఈ క్రమంలో 2015లో వచ్చిన ‘చిన్నీ మా బతుకమ్మ’ అనే బతుకమ్మ పాట ద్వారా ఆమె మంచి గుర్తింపునందుకుంది. ఆమె తరువాత దాదాపు ఎనభై బతుకమ్మ పాటలు పడింది. విజయ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటు చేసిన తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉదోగ్యం చేస్తుంది.[3][4]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ముచ్చట.కాం. "ఈ 62 మందికీ తెలంగాణ ఆవిర్భావ పురస్కారాలు". www.muchata.com. Archived from the original on 2 October 2016. Retrieved 28 December 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Namasthe Telangana (1 April 2022). "రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాట‌తో వ‌చ్చింది". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
  3. Andhra Jyothy (18 October 2020). "లోకల్‌ కాదు... గ్లోబల్‌ 'బతుకమ్మ'" (in ఇంగ్లీష్). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
  4. Eenadu (6 October 2021). "బతుకమ్మ పాటలు పూదోట". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
  5. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
"https://te.wikipedia.org/w/index.php?title=తేలు_విజయ&oldid=4218260" నుండి వెలికితీశారు