తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2016

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించడం జరుగుతుంది.


2016లో రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల్లో 62మందికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.[1] ఈ అవార్డులకు ప్రముఖులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.[2]

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2016, జూన్‌ 2న హెచ్.ఐ.సి.సి.లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా జ్ఞాపిక, లక్షా 116 రూపాయల నగదు, నగదు, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో సత్కరించాడు.[3]

పురస్కార గ్రహీతలు[మార్చు]

క్రమసంఖ్య పేరు రంగం స్వస్థలం
1 కోవెల సుప్రసన్నాచార్య సాహిత్యరంగం వరంగల్
2 కపిలవాయి లింగమూర్తి సాహిత్యరంగం మహబూబ్ నగర్
3 ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్యరంగం కరీంనగర్
4 సంగిశెట్టి శ్రీనివాస్ సాహిత్యరంగం యాదాద్రి భువనగిరి
5 కె.వి. నరేందర్ సాహిత్యరంగం కరీంనగర్
6 అబ్దుల్ రహ్మన్ ఖాన్ (ఉర్దూ) సాహిత్యరంగం హైదరాబాద్
7 సర్ మీర్ ఇబ్రహిం హమి సాహిత్యరంగం హైదరాబాద్
8 దీపికారెడ్డి శాస్త్రీయ నృత్యం హైదరాబాద్
9 దుంపేటి ప్రకాశ్ శాస్త్రీయ నృత్యం (పేరిణి) హైదరాబాద్
10 అంతడ్పుల నాగరాజు జానపద నృత్యం అదిలాబాద్
11 మిట్ట జనార్ధన్ శాస్త్రీయ సంగీతం (సితార్) హైదరాబాద్
12 కె. రామాచారి శాస్త్రీయ సంగీతం మెదక్
13 ఎస్. ప్రభాకర్ జానపద సంగీతం మెదక్
14 జంగిరెడ్డి జానపద సంగీతం మహబూబ్ నగర్
15 ధర్మనాయక్ జానపద సంగీతం నల్లగొండ
16 సి. రవి జానపద సంగీతం అదిలాబాద్
17 గంగ జానపద సంగీతం నిజామాబాద్
18 యశ్ పాల్ జానపద సంగీతం ఖమ్మం
19 పద్మావతి ఉద్యమ గానం కరీంనగర్
20 తేలు విజయ ఉద్యమ గానం కరీంనగర్
21 వై. బాలయ్య చిత్రలేఖనం మెదక్
22 మాడుగుల మాణిక్య పోమయాజులు వేద పండితులు రంగారెడ్డి
23 నల్లంతిహల్ నరసింహాచార్యులు అర్చకులు ప్రధాన అర్చకులు, యాదాద్రి దేవస్థానం
24 కొడకండ్ల నరసింహరామ సిద్దాంతి ఆధ్యాత్మికులు హైదరాబాద్
25 జనాబ్ ముఫ్టి ఆజీముద్దీన్ సాహెబ్ ఆధ్యాత్మికులు హైదరాబాద్
26 రేవరెండ్ నల్ల థామస్ ఆధ్యాత్మికులు సెంచరీ బాపిస్టు చర్చి
27 డా. వి. రాంగోపాల్ శాస్త్రవేత్తలు డైరెక్టర్, ఐఐటి, ఢిల్లీ
28 అంకతి రాజు శాస్త్రవేత్తలు రాజపేట, యాదాద్రి భువనగిరి
29 సి.ఆర్. గౌరీశంకర్ జర్నలిజం హైదరాబాద్
30 నూర శ్రీనివాస్ జర్నలిజం వరంగల్
31 ఆకారపు మల్లేశం జర్నలిజం హైదరాబాద్
32 ఎం.ఎ. మజీద్ జర్నలిజం హైదరాబాద్
33 కవిత జర్నలిజం (ఎలక్ట్రానిక్ మీడియా) హైదరాబాద్
34 శంకర్ జర్నలిజం (కార్టూనిస్ట్) హైదరాబాద్
35 ది నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రీయల్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ హస్తకళలు నిర్మల్, అదిలాబాద్
36 అనూప్ కుమార్ క్రీడలు (రోలర్ స్కేటింగ్)
37 ఆనంద్ క్రీడలు (ఖో-ఖో)
38 హనుమంతరావు ఉద్యోగులు (గద)
39 డా. రావుల ఉమారెడ్డి ఉద్యోగులు
40 సి. ప్రభాకర్ ఉద్యోగులు సూపరెంటిండ్ ఇంజనీర్, నిజామాబాద్, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్
41 ఎ. శ్రీనివాసులు ఉద్యోగులు డివిజినల్ ఇంజనీర్, సూర్యాపేట, టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్
42 పి. రాజామోహన్ ఉద్యోగులు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్, కె.టి.పి.ఎస్., వి స్టేజ్, టిఎస్ జెన్కో
43 పి. హనుమంతరావు ఉద్యోగులు డిపో మేనేజర్, జగిత్యాల, టిఎస్ఆర్టీసి
44 వి. సుభాష్ ఉద్యోగులు కండక్టర్, అదిలాబాద్, టిఎస్ఆర్టీసి
45 మహ్మద్ తేజముల్ హుస్సేన్ ఉద్యోగులు డ్రైవర్, కామారెడ్డి, టిఎస్ఆర్టీసి
46 డాక్టర్ ఎ. గోపాలకిషన్ డాక్టరు (మూత్ర పిండ జబ్బుల వైద్యుడు)
47 గ్రామ్యా రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎన్.జీ.వో.
48 డాక్టర్ విజయభాస్కర్ సామాజిక సేవ బి.ఎల్.ఎన్. ఛారిటీ, గోదావరిఖని
49 ఎం. అంజిరెడ్డి రైతులు (అగ్రికల్చర్) ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
50 వార్ని శంకర్ రైతులు (హర్టీకల్చర్) పొతంగల్, కోటగిరి, నిజామాబాద్,
51 ఎం. గంగమణి అంగన్ వాడి వర్కర్ నావిపేట, నిజామాబాద్
52 ఖమ్మం నగరపాలక సంస్థ స్థానిక సంస్థలు
53 మల్లాపూర్, మెదక్ గ్రామపంచాయితీ
54 మాదాపూర్, బెజ్జంకి, కరీంనగర్ గ్రామ పంచాయితీ
55 ఎ. లక్ష్మినారాయణ వ్యాపారవేత్త హైదరాబాద్
56 గుడిమల్ల రవికుమార్ న్యాయవాది వరంగల్
57 వనపర్తి మండలం మండలం
58 గోల్డి బాల్బీర్ సింగ్ కౌర్ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులు, టిఎస్ మోడల్ స్కూల్, గంగాధర, కరీంనగర్
59 మధుసూదన్ రెడ్డి వినూత్న వ్యవసాయం (బొన్సాయ్)
60 గాల్బా శివకిరణ్ కుమార్ మాజీ సిబ్బంది
61 ఎ. బాలకృష్ణ మాజీ సిబ్బంది
62 జి.ఆర్. రాధిక సాహస కార్యకలాపాలు అడిషినల్ ఎస్పీ, అదిలాబాద్

మూలాలు[మార్చు]

  1. Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 August 2016. Retrieved 1 October 2021.
  2. సూర్య. "తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అవార్డుల కమిటీ ఏర్పాటు". Retrieved 29 December 2016.[permanent dead link]
  3. TeachersBadi, Telangana. "Telangana State Formation Day State Level Awardees List, Selected Awardees List". www.teachersbadi.in. Archived from the original on 20 January 2021. Retrieved 1 October 2021.