Jump to content

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు

వికీపీడియా నుండి
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరులకు కొవ్వొత్తుల నివాళి

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది.[1] అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఉత్తమ పురస్కారాలను అందించడం జరుగుతుంది.[2][3]

2015లో రాష్ట్ర స్థాయిలో 32 విభాగాల్లో 52 రంగాల వారికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో మండల స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు 5,780 మందిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కారాల కింద 7 కోట్ల 52 లక్షల 70 వేలు అందజేసింది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2015, జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా జ్ఞాపిక, లక్షా 116 రూపాయల నగదు పురస్కార గ్రహీతలకు లక్షా 116 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ధ్రువీకరణ పత్ర ప్రదానం జరిగింది.

ఉత్తమ గ్రామ పంచాయతీగా కరీంనగర్‌ జిల్లా లోని చందుర్తి, ఉత్తమ మండలంగా మెదక్‌ జిల్లా లోని సిద్దిపేట, ఉత్తమ మున్సిపాలిటీగా ఆదిలాబాద్‌ జిల్లా లోని మంచిర్యాలను అవార్డుల కమిటీ ఎంపిక చేయడం జరిగింది.[4]

అవార్డు గ్రహీతలు[2]

[మార్చు]

కె. పాండురంగాచార్య, (వేదపండితుడు, హైదరాబాద్‌), ముదిగొండ వీరభద్రయ్య (సాహితీవేత్త, హైదరాబాద్‌), గూడ అంజయ్య (సాహితీవేత్త, హైదరాబాద్‌), సలావుద్దీన్‌ సయ్యద్‌ (సాహితీవేత్త, హైదరాబాద్‌), సుంకిరెడ్డి నారాయణరెడ్డి (సాహితీవేత్త, నల్లగొండ జిల్లా), పోల్కంపల్లి శాంతాదేవి (సాహితీవేత్త, మహబూబ్‌ నగర్‌ జిల్లా వనపర్తి), పెద్దింటి అశోక్ కుమార్ (సాహితీవేత్త, కరీంనగర్‌ జిల్లా), ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల (ఆధ్యాత్మిక వేత్త), మహమ్మద్‌ ఉస్మాన్‌ (మక్కా మసీదు ఇమాం జనాబ్‌), ఏలె లక్ష్మణ్ (రాష్ట్ర ప్రభుత్వ లోగో రూపకర్త), ఎక్కా యాదగిరిరావు (అమరవీరుల స్థూప నిర్మాత), కె. లక్ష్మాగౌడ్‌ (ఉత్తమ కళాకారులు), కళాకృష్ణ (ఉత్తమ కళాకారులు), అలేఖ్య పుంజాల (ఉత్తమ కళాకారులు), టంకశాల అశోక్‌ (ఉత్తమ జర్నలిస్ట్‌), డాక్టర్‌ పసునూరి రవీందర్ (ఉత్తమ ఎలక్ట్రానిక్‌ విూడియా జర్నలిస్ట్‌), హైదరాబాద్ బ్రదర్స్ (ఉత్తమ సంగీతకారులు), విఠల్‌ రావు (గజల్‌ గాయకుడు), జి.ఎల్‌. నామ్‌దేవ్‌ (ఉద్యమ సంగీతం, కరీంనగర్‌), ఆచార్య నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి (సంస్కృత పండితుడు, వరంగల్‌), చుక్కా సత్తయ్య (వరంగల్‌ జిల్లా), వంగీపురం నీరజాదేవి (కూచిపూడి నృత్యం, వనపర్తి)

2016లో రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల్లో 50మందికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డులకు ప్రముఖులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.[5]

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2016, జూన్‌ 2న హెచ్.ఐ.సి. సి.లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా జ్ఞాపిక, లక్షా 116 రూపాయల నగదు, ధ్రువీకరణ పత్ర ప్రదానం జరిగింది.

ఉత్తమ గ్రామ పంచాయతీగా మెదక్ జిల్లా లోని మాల్కాపూర్, కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని మాదాపూర్, ఉత్తమ మండలంగా మహబూబ్ నగర్ జిల్లా లోని వనపర్తి, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మంను అవార్డుల కమిటీ ఎంపిక చేయడం జరిగింది.

అవార్డు గ్రహీతలు[3]

[మార్చు]

2017 ఏడాదికిగానూ పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 52 మంది ప్రముఖులను ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదన మేరకు ఈ ప్రముఖులకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవార్డులు అందజేసి, సత్కరించారు.[6]

2018 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో ప్రముఖులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికిగాను విశిష్ట వ్యక్తులకు పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణలో 26 రంగాలలో చేసిన మహోన్నత సేవలను గుర్తించి మొత్తం 48 మందిని అవార్డులకు ఎంపికచేశారు.[7] రవీంద్రభారతిలో జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాల ప్రదానోత్సవం వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ అజ్మీరా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, పర్యాటక శాఖ కార్యాదర్శి బుర్ర వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ల చేతులమీదుగా వీరికి పురస్కారాలు అందజేయబడ్డాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ. "రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు". Retrieved 28 December 2016.
  2. 2.0 2.1 జనంసాక్షి. "50 మందికి ఆవిర్భావ పురస్కారాలు". Retrieved 28 December 2016.
  3. 3.0 3.1 ముచ్చట.కాం. "ఈ 62 మందికీ తెలంగాణ ఆవిర్భావ పురస్కారాలు". www.muchata.com. Archived from the original on 2 October 2016. Retrieved 28 December 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. సాక్షి, తెలంగాణ (31 May 2015). "రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం". Sakshi. Archived from the original on 19 December 2015. Retrieved 9 October 2020.
  5. సూర్య. "తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అవార్డుల కమిటీ ఏర్పాటు". Retrieved 29 December 2016.[permanent dead link]
  6. సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
  7. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 14 June 2018. Retrieved 14 June 2018.