విఠల్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిట్ విఠల్ రావు
జననం1929
మూలంహైదరాబాదు, తెలంగాణ, భారత దేశము
మరణంజూన్ 25, 2015, హైదరాబాదు
సంగీత శైలిగజల్స్
వృత్తిగాయకుడు
క్రియాశీల కాలం1920s - 2015

గజల్ విఠల్‌రావు ఏడో నిజాం ఆస్థానంలో విద్వాంసుడిగా పనిచేసిన గజల్ కళాకారుడు.[1]తెలంగాణ షాన్.. గజల్స్ రారాజు మొదలైన బిరుదులు పొందారు.

జీవిత విశేషాలు[మార్చు]

1929 మే 19వ తేదీన హైదరాబాద్‌లో జన్మించిన విఠల్ రావు.. తన ఏడేండ్ల వయస్సునుంచే ఆలిండియా రేడియో పిల్లల కార్యక్రమంలో తన గజల్స్ వినిపించారు. గజల్ విఠల్‌రావుకు భార్య తారాబాయి, కుమార్తెలు సంధ్య, బింధ్య, సీమ, కుమారులు సంజయ్‌రావు, సంతోశ్ ఉన్నారు. గోషామహల్ హిందీనగర్‌లోని తన నివాసంలోని సంగీత్ సాధన్ సంగీత పాఠశాలలో ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులుగా ఎదిగారు. విఠల్‌రావు కచేరీతో సంతృప్తి చెందిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గోషామహల్‌లో ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి స్థలాన్ని కానుకగా ఇచ్చారు[2].గోషామహల్ హిందీనగర్‌లో నివాసముండే విఠల్‌రావు కుటుంబసభ్యులతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత తప్పిపోయారు. 27.6.2015 న సికింద్రాబాద్ కంట్రీ క్లబ్ ఫ్లె ఓవర్ బ్రిడ్జి కింద విఠల్‌రావు అపస్మారక స్థితిలో చనిపోయి దొరికారు.[3]

అవార్డులు[మార్చు]

1995లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ద్వారా అవార్డు, 2001లో కెనడాలో గ్యాలిక్ అకాడమీ అవార్డు, 2004లో అప్పటి గవర్నర్ సుర్జీత్‌సింగ్ బర్నాల నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు, 2007లో అమీర్ కుస్రో సొసైటీ ఆఫ్ కెనడా అవార్డు, 2008లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ అవార్డ్ ఆఫ్ న్యూజిలాండ్, న్యూఢిల్లీలోని బేగం అక్తర్ అకాడమీ అవార్డు, పద్మభూషణ్ డాక్టర్ సీ నారాయణరెడ్డి చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

  1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మూలాలు[మార్చు]

  1. "Legendary Ghazal singer Vithal Rao dead". The Hindu. 26 June 2015. Retrieved 26 June 2015.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-07. Retrieved 2015-07-02.
  3. షిరిడీలో విఠల్ రావు అదృశ్యం: కుటుంబంతో సహా ఎక్కడికెళ్లారు?

ఇతర లింకులు[మార్చు]