పసునూరి రవీందర్ కవిగా, రచయితగా తెలుగు సాహితీ జగత్తుకు సుపరిచితుడు. తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం అందుకున్న రచయిత. తెలంగాణ ఉద్యమ గేయసాహిత్యంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు[citation needed]
. వరంగల్ జిల్లాశివనగర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై జనవరి 8న జన్మించారు.
"ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం -విమర్శ"అనే అంశం మీద ఎంఫిల్, "తెలంగాణ గేయసాహిత్యం-ప్రాదేశిక విమర్శ"అనే అంశంపై పి.హెచ్‌డీ చేశారు. పసునూరి రాసిన వ్యాసాలు పలు దిన, వార పత్రికల్లో అచ్చయ్యాయి. 'దస్కత్'తెలంగాణ కథా వేదికకు కన్వీనర్‌గా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారులను కూడగట్టి ఉద్యమ బాట పట్టించిన "సింగిడి" తెలంగాణ రచయితల సంఘానికి కన్వీనర్‌గా పనిచేశారు. తాను రాసిన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటికి కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం లభించింది. జాషువా, బోయి భీమన్నల తర్వాత సాహిత్య అకాడెమి చేత గౌరవాన్ని అందుకున్న దళిత రచయిత రవీందరే.[1] కొంతకాలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా (గెస్ట్ ఫ్యాకల్టీగా) పని చేశారు.
ప్రస్తుతం అద్దం డిజిటల్ డైలీ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
డాక్టర్ పసునూరి రవీందర్ రాసిన మొదటి కథ "వలసపక్షులు" (2002) 'ప్రజాశక్తి' దినపత్రికలో అచ్చైంది.
-లడాయి (2010) (తెలంగాణ ఉద్యమ దీర్ఘకవిత, పలు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో పేర్కొనబడిన కావ్యం)
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో మామిడి హరికృష్ణ నుండి సత్కారం అందుకుంటున్న పసునూరి రవిందర్ మిర్యాల లలిత (చిత్రంలో నందిని సిధారెడ్డి, తిరునగరి రామానుజయ్య, నాళేశ్వరం శంకరం తదితరులు)-జాగో జగావో (2012) (సహ సంపాదకత్వం) (200మంది కవుల కవిత్వం వెలువడ్డ తెలంగాణ కీలక వచన కవితా సంకలనం)
డాక్టర్ పసునూరి రవీందర్ బహుముఖీన కృషి చేస్తున్నారు. సాహిత్యంలో ఎవరికైనా ఒకటో రెండో ప్రక్రియల్లో ప్రవేశం, ప్రావీణ్యం ఉంటుంది. కానీ, డాక్టర్ పసునూరి మాత్రం తొలుత పాటతో తాను సాహిత్యంలోకి ప్రవేశించారు. విద్యార్థిగా ఉన్న నాటి నుండి వామపక్ష ఉద్యమాల సాంస్కృతిక సంఘాల్లో కళాకారునిగా పనిచేశారు. అలా గాయకునిగా మొదలైన ప్రస్థానం, అనతికాలంలోనే పాటల రచయితగా మారింది. అందుకు కారణం ఉద్యమ అవసరాలే. అలా డిగ్రీ చదివేనాటికే వాగ్గేయకారునిగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా పేరుగాంచారు. ఇంటర్మీడియేట్లోనే రాష్ట్ర స్థాయి జానపద గేయాల పోటీలో అనేక బహుమతులు అందుకున్నారు. ఆ తరువాత కవిత్వంలో అడుగుపెట్టారు. 2002లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవిసమ్మేళనాల్లో పాల్గొని ప్రజల పక్షాన తన గళం వినిపించారు. పసునూరి కవితలు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, సూర్య, ప్రస్థానం, గోదావరి సాహితీ, బహుజన కెరటాలు వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కవితలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. సాహిత్య పరిశోధకునిగా పరిశోధనలోకి, అలాగే సాహిత్య విమర్శలోకి అడుగుపెట్టారు. దళిత, బహుజన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తు సాహిత్య విమర్శ రాశారు. ఇక కథకునిగా తెలంగాణ దళిత జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాస్తున్నారు. ఇక సాహిత్యోద్యమ కారునిగా రవీందర్ చేసిన కృషి విలువైనది. తెలంగాణ ఉద్యమంలో సింగిడి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్ గా, ఉద్యమానికి మద్ధతుగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ అనంతరం ఏర్పడిన బహుజన రచయితల సంఘానికి కూడా రవీందరే వ్యవస్థాపక అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కథా ప్రక్రియకు జరుగుతున్న అన్యాయం పై ఏర్పడిన 'దస్కత్` తెలంగాణ కథా వేదికకు కన్వీనర్ గా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు సాహిత్యోద్యమకారునిగా పనిచేస్తూనే, తాను పరిశోధన చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ జేఏసీ కో-కన్వీనర్ గా పనిచేశారు. పలు ప్రాంతాల విద్యార్థుల మధ్య సమన్వయం ఏర్పరచి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను పదిజిల్లాల్లో ప్రచారం చేశారు.