Jump to content

అజ్మీరా చందులాల్

వికీపీడియా నుండి
(చందూలాల్ అజ్మీరా నుండి దారిమార్పు చెందింది)
అజ్మీరా చందులాల్
అజ్మీరా చందులాల్


నియోజకవర్గం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం

చందులాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-17) 1954 ఆగస్టు 17 (వయసు 70) [1]
జగ్గన్నపేట్ ములుగు వరంగల్ జిల్లా
మరణం 2021 ఏప్రిల్ 15
హైదరాబాద్‌
మతం హిందూ మతం

అజ్మీరా చందులాల్, ములుగు జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయనాయకుడు, మాజీ తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభలో కూడా సీనీయర్ మెంబరు.

జీవిత విశేషాలు

[మార్చు]

చందులాల్ 1954 ఆగస్టు 17లో వరంగల్ జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట్ గ్రామంలో జన్మించాడు. శారదతో వివాహం జరిగింది, వారికి ఒక కుమార్తె ముగ్గురు కుమారులు. ఆయన 2021 ఏప్రిల్ 15 న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]
శ్రీ దుర్ముఖి నామ ఉగాది పండగ సందర్భంగా 2016 ఏప్రిల్ 8న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఉగాది వేడుకలలో అజ్మీరా చందూలాల్ నుండి బండారి శేషగిరి శర్మకు సత్కారం (చిత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బండారు దత్తాత్రేయ, సిరికొండ మధుసూధనాచారి తదితరులు)

1981-1985 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 - 1989 లో ఎమ్మెల్యేగా విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే AP శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.1994 -1996 2వ సారీ ఎమ్మెల్యేగా విజయం సాధించి,1996 లో 11వ లోక్‌సభ సభ్యులుగా గిరిజన ఓట్లూ అధికంగా ఉన్న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం సభ్యులుగా నియోజకవర్గం నుండి నారా చంద్రబాబునాయుడు చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్నరామసహాయం సురేందర్ రెడ్డి పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు.1998 లో MP 12వ లోక్‌సభ సభ్యులుగా MP 2 సార్లునుండి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. తిరిగి శాసనసభ్యునిగా 2014 3వ సారీ MLA గా అసెంబ్లీలో ములుగు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి గెలుపొందారు.

పదవులు

[మార్చు]
  • 1981-85 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ ములుగు మండలం జిల్లా . వరంగల్, ఆంధ్ర ప్రదేశ్.
  • 1985-89 శాసన సభ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ (ముడు సార్లు) 1994-96, 2014 -
  • 1986-88 చైర్మన్ 1994-96 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంక్షేమ కమిటీ
  • 1989 మంత్రి, గిరిజన సంక్షేమం, ఆంధ్ర ప్రదేశ్
  • 1994-96 తెలుగుదేశం పార్టీ పోలిటిభ్యురో సభ్యుడు. 11 వ లోక్ సభకు ఎన్నికయ్యారు
  • 1996 లేబర్ అండ్ వెల్ఫేర్ సభ్యుడు
  • 1998 12 వ లోక్‌సభ సభ్యులు 2 సారీ తిరిగి ఎన్నిక
  • 1998-99 హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద లేబర్ అండ్ వెల్ఫేర్ లో సభ్యుడు,పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ స్కీమ్ కమిటీ సభ్యులు,సంప్రదింపుల కమిటీ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.
  • 1999-2001 ఎస్టీ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ
  • 2001-2003 డైరెక్టర్ ట్రైకార్, న్యూఢిల్లీ
  • 2003-2005 ట్రైకార్ చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్
  • 2005 తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు
  • 2006 పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి
  • 2014 శాసన సభ సభ్యుడు, ములుగు శాసనసభ నియోజకవర్గం,[4] వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం

పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్నారు.[5]

యం.యల్.ఎ గా ఓటమి

[మార్చు]

తెలుగుదేశం పార్టీ 1982 లో ఎన్.టి.రామారావు పార్టీ స్థాపించిన సమయంలో జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఉన్న చందులాల్ వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. 1983 ఎన్నికలలో యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసీ ఓటమిచెందారు. పోరిక జగన్ నాయక్ గెలిచారు. ఇదే జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ 1985 లో గెలిచారు. చందులాల్ 1989 ఎన్నికలలో మళ్లీ జగన్ నాయక్ చేతిలో ఓటమిచెందారు.[6] 1989 తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్.టి.రామారావు యం.యల్.సీ చేసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 1994 లో జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు.1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు.

బై ఎలక్షన్లు

[మార్చు]

ఉప ఎన్నికలు ఇతని జీవితంతో ఆడుకున్నాయి. లోక్‌సభ సభ్యునిగా గెలిచిన 2 సార్లు ఉపఎన్నికలు వచ్చాయి 1994 లో శాసనసభ్యునిగా విజయం సాధించిన పదవి కాలం ఇంకా మూడు సంవత్సర్లు ఉండగానే 1996 లో నారా చంద్రబాబునాయుడు చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న రామసహాయం సురెందర్ రెడ్డి పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు... బై ఎలక్షన్లు, 1996 బై ఎలక్షన్లు, 1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు. ఎన్నో పదవులు వివిధ దశల్లో నిర్వహించిన చందులాల్ 2005 టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.[7]

టీఆర్ఎస్ లో చేరిక

[మార్చు]
2018 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో ప్రసంగిస్తున్న చందులాల్

అజ్మీరా చందులాల్ తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి 2005 కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (17 December 2014). "కొత్త మంత్రుల జీవిత విశేషాలు..." Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  2. TV9 Telugu (16 April 2021). "Former Minister Chandulal: కరోనాతో మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత.. మూడు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్‌సభకు.. - Telangana Former minister Chandulal passed away". TV9 Telugu. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 16 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (16 April 2021). "సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా." Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. http://www.sakshi.com/news/telangana/trs-stagnation-in-warangal-195822
  6. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-24. Retrieved 2016-01-18.

బయటి లింకులు

[మార్చు]