పోరిక జగన్ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోరిక జగన్ నాయక్

ఉద్యాన, పశుసంవర్ధకశాఖ మంత్రి
పదవీ కాలం
1989 - 1994

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1985
ముందు సంతోష్ చక్రవర్తి
తరువాత అజ్మీరా చందులాల్
నియోజకవర్గం ములుగు నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 - 1994
ముందు అజ్మీరా చందులాల్
తరువాత అజ్మీరా చందులాల్
నియోజకవర్గం ములుగు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
వేములవాడ, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

పోరిక జగన్ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పోరిక జగన్ నాయక్ రాజకీయాల పట్ల ఆసక్తితో 1978లో ములుగు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి చార్ప భోజా రావుపై 1469 ఓట్ల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 1718 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

పోరిక జగన్ నాయక్ 1985లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో 7632 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. ఆయన 1989లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్యాన, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 October 2023). "జనరల్‌ టు ఎస్టీ రిజర్వ్‌." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Eenadu (8 December 2023). "రుద్రమలై కదలాలి.. ఓరుగల్లు మురవాలి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.