చుక్కా సత్తయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చుక్కా సత్తయ్య
జననం(1935-03-29)1935 మార్చి 29
మరణం2017 నవంబరు 9(2017-11-09) (వయసు 82)
జాతీయతభారతీయుడు
వృత్తిఒగ్గు కథ పితామహుడు
తల్లిదండ్రులుఆగయ్య, సాయమ్మ
బంధువులుఅంజయ్య, శ్రీశైలం (కుమారులు), పుష్ప (కుమార్తె)

చుక్కా సత్తయ్య (మార్చి 29, 1935 - నవంబరు 9, 2017[1]) ఒగ్గు కథ పితామహుడు, ఒగ్గుకళ సామ్రాట్. బీరప్పకథను ఒగ్గుకళలో విలీనం చేసి ఈ కళకే వన్నే తెచ్చాడు.[2] శివ స్వరూపమైన వీర భద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు.

జననం[మార్చు]

సత్తయ్య 1935, మార్చి 29న ఆగయ్య, సాయమ్మ దంపతులకు జనగామ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ మండలం, మాణిక్యపురం గ్రామంలో జన్మించాడు. 11 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్న సత్తయ్య ఒకటో తరగతి వరకే చదువుకున్నాడు.

ఒగ్గుకథ ప్రస్థానం[మార్చు]

తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఒగ్గుకథలో 14వ ఏటనే ప్రావీణ్యత సంపాదించాడు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు. తనంతటతానుగా తెలుగులో చదవడం, వ్రాయడం నేర్చుకుని తనకున్న కళపై పట్టుతెచ్చుకొని తన 40 సంవత్సరాల ఒగ్గు కళా జీవితంలో దేశవిదేశాల్లో దాదాపు 12వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా లోని 1500లకు పైగా కళాకారులకు ఒగ్గుకళలో శిక్షణ ఇచ్చాడు.[3][4] జనగాం కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళాసమితిని ఏర్పాటుచేసి ఎందరో కళాకారులను తయారుచేశాడు.[5]

నుదట రెండు పాదాల మాదిరిగా (చుక్క) ఉంది. ఆ ‘చుక్కా’ సత్తయ్య ఇంటి పేరుగా మారింది. మల్లన్నకథ, బీరప్ప కథ, ఎల్లమ్మకథ, మాందాలు కథ, నల్ల పోషమ్మ కథ, దుర్గమ్మ కథ, సౌడలమ్మ కథ, ఉప్పలమ్మ కథ, మైసమ్మ కథ, కీలుగుర్రం కథ, లక్ష్యాగృహం కథ, పెద్దిరాజు పెద్దమ్మ కథ, ఎర్రగొల్ల అక్కమ్మకథ, కనకతార కథ, కాంభోజరాజు కథ, అల్లిరాణి కథ, గయోపాఖ్యానం, రంభ రంపాలా, అయిదు మల్లెపూల కథ, గౌడ పురాణం, సమ్మక్క కథ, మండోదరి కథ, ఇప్పరాపురిపట్నంకథ, సూర్యచంవూదాదుల కథ, బాలనాగమ్మ కథ, సత్యహరిశ్చంద్ర మహారాజు కథ, సత్యవతి కథ, సిరికొండ మహారాజు కథ, అపురూపవతి కథ, మైనవతి కథ, సారంగధర కథ, అమరశీల మహరాజు కథ, పూరుర్వ చక్రవర్తి కథ, మౌనధరి కథ, బాబాషబాబాషాదుల్ల కథ, శివకొమార కథ, సుగుణవతి కథ, సారంగధరమెటసారంగధర కథ, అట్కరొల్ల కథ, వీరభగవంతి కథ, వానదేవుని కథ, సిరిదేవి కథ, రామాయణం, మయసభ, కంసవధ, భస్మాసుర వధ, భక్త ప్రహ్లాద మొదలైన కథలను ఒగ్గుకథలుగా చెప్పేవాడు

పురస్కారాలు - గౌరవాలు[మార్చు]

  1. కేంద్ర సంగీత నాటక అకాడమీ (అబ్దుల్ కలాం చేతులమీదుగా 2004)
  2. డాక్టరేట్ (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 2005 ఏప్రిల్ 15)
  3. ప్రతిభా పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్)
  4. ఒగ్గు కళా సామ్రాట్ (వెంకటేశ్వర క్యాసెట్ సెంటర్)
  5. జానపద కళామూర్తి (యాత్రి కృష్ణారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టర్, విశాఖపట్టణం)
  6. మకుటంలేని మహారాజు (డిస్కో రికార్డంగ్ కంపెనీ, సికింద్రాబాద్)
  7. రాజీవ్‌ జీవన సాఫల్య పురస్కారం
  8. కళాసాగర్ (విశిష్ట పురస్కారం)
  9. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ‘ఒగ్గు చుక్క’ పేరుతో సత్తయ్యపై డాక్యుమెంటరీని రూపొందించింది.
  10. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మరణం[మార్చు]

చుక్కా సత్తయ్య 2017, నవంబరు 9న తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.[1][6][7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ (9 November 2017). "ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత". Retrieved 9 November 2017.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ (August 4, 2017). "ఒగ్గు కళా పితామహుడు చుక్కకు సన్మానం". Retrieved 5 October 2017.[permanent dead link]
  3. jayati (2016-04-10). "'ఒగ్గుకథ'కు ప్రాణం పోస్తున్న చుక్క సత్తెయ్య". సాహితి - శోధిని (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-23.
  4. the hindu (17 April 2005). "On a noble mission". Retrieved 5 October 2017.
  5. టిన్యూస్ (9 November 2017). "నింగికెగసిన ఒగ్గు చుక్క." Archived from the original on 12 November 2017. Retrieved 10 November 2017.
  6. ఆంధ్రజ్యోతి (10 November 2017). "ఒగ్గుకళ 'చుక్క' అస్తమయం". Archived from the original on 12 November 2017. Retrieved 10 November 2017.
  7. ఈనాడు (10 November 2017). "ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత". Archived from the original on 9 November 2017. Retrieved 10 November 2017.