తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించడం జరుగుతుంది.

2018 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 26 రంగాలలో చేసిన మహోన్నత సేవలను గుర్తించి మొత్తం 48 మందిని అవార్డులకు ఎంపికచేశారు.[1][2][3] రవీంద్రభారతిలో జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాల ప్రదానోత్సవం వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ అజ్మీరా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, పర్యాటక శాఖ కార్యాదర్శి బుర్ర వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ల చేతులమీదుగా వీరికి పురస్కారాలు అందజేయబడ్డాయి.

పురస్కార గ్రహీతలు

[మార్చు]
క్రమసంఖ్య పేరు స్వస్థలం రంగం ఇతర వివరాలు చిత్రమాలిక
1 డా. నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్ మిమిక్రీ విశిష్ట వ్యక్తులు
2 ఆదిరాజు వెంకటేశ్వరరావు 1969 తెలంగాణ ఉద్యమం విశిష్ట వ్యక్తులు
3 డా. రవ్వా శ్రీహరి నల్లగొండ జిల్లా సాహిత్యరంగం విశిష్ట వ్యక్తులు
4 డా. కందుకూరి శ్రీరాములు సాహిత్యరంగం ఆధునిక వచన కవిత
5 ఆడెపు లక్ష్మీపతి సాహిత్యరంగం కథారచయిత
6 వసంతరావు దేశ్‌పాండే సాహిత్యరంగం నవలా రచయిత
7 ప్రొ మహ్మద్‌ అలీ అసర్ సాహిత్యరంగం ఉర్దూ సాహిత్యం
8 వై. నాగేశ్వరరావు జర్నలిజం ప్రింట్ మీడియా
9 తిగుళ్ల కృష్ణమూర్తి జర్నలిజం ప్రింట్ మీడియా
10 ముక్తీ ఫారూఖీ జర్నలిజం ఉర్దూ జర్నలిజం
11 సూరజ్ జర్నలిజం ఎలక్ట్రానిక్ మీడియా
12 గుంటిపల్లి వెంకట్ జర్నలిజం ఎలక్ట్రానిక్ మీడియా
13 గడ్డం కేశవమూర్తి జర్నలిజం రూరల్ రిపోర్టింగ్
14 నవీన్ జర్నలిజం రిపోర్టింగ్
15 నిహాల్ శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ గాత్రకచేరి
16 డా. పద్మజారెడ్డి శాస్త్రీయ నృత్యం కూచిపూడి
17 టంగుటూరి భీమన్‌పటేల్ పేరిణి పేరిణి నృత్యం
18 రవీందర్‌రెడ్డి ఫొటోగ్రఫీ ఫొటోగ్రఫీ
19 చెరుకుమల్లి సూర్యప్రకాశ్ మధిర, ఖమ్మం జిల్లా చిత్రకళ చిత్రకళ
20 అంబాజీ ఆర్ట్ అండ్ డిజైనింగ్ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక రూపకల్పన
21 పురాణం రమేష్ జానపద నృత్యం కూనపులి పటం కథ
22 గిద్దె రామనర్సయ్య జానపదం జానపద గాయకుడు
23 మిట్టపల్లి సురేందర్ జానపదం జానపద గాయకుడు
24 వరంగల్ శ్రీనివాస్ వెల్లంపల్లి, టేకుమట్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యమగానం ఉద్యమ గాయకుడు
25 జలజ ఉద్యమగానం ఉద్యమ గాయకురాలు
26 శంకర్‌బాబు ఉద్యమగానం ఉద్యమ గాయకుడు
27 డా. జి. కుమారస్వామి కొప్పూర్, వరంగల్ (పట్టణ) జిల్లా తెలుగు నాటకరంగం ఆధునిక నాటకం
28 సామలవేణు ఇంద్రజాలం ఇంద్రజాలికుడు
29 మహ్మద్ హుసాముద్దీన్ క్రీడలు బాక్సింగ్
30 నేలకుర్తి సిక్కిరెడ్డి క్రీడలు బ్యాడ్మింటన్
31 పి. సురేశ్‌బాబు ఉత్తమ ఉద్యోగి ఎస్‌ఈ, ట్రాన్స్‌కో
32 ఎల్ సంపత్‌రావు ఉత్తమ ఉద్యోగి ఈఈ, ట్రాన్స్‌కో
33 ఖాజా మొహియొద్దీన్ ఉత్తమ ఉద్యోగి ఏఈ, కాళేశ్వరం
34 సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తమ ఉద్యోగి జోనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ
35 డాక్టర్ రవీందర్‌గౌడ్ జోగిపేట వైద్యరంగం సరోజినీదేవి కంటి దవాఖాన
36 తిరుకోవెళ్ మారుతి అర్చకులు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం
37 బ్రహ్మర్షి కంకనూరు వెంకటరమణశాస్త్రి వేదపండితులు
38 డా. మామిడాల రాములు శాస్త్రవేత్తలు ఏరోనాటిక్ రంగం
39 డా. జి. రామయ్య శాస్త్రవేత్తలు డైరెక్టర్ నార్త్‌ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జొర్హట్
40 పి. హనుమంతరావు హైదరాబాదు ఎన్జీవో మానసిక వికలాంగులసేవ
41 కనకయ్య జెల్లి న్యాయవాది
42 జగ్గన్నపేట్ ములుగు మండలం ఉత్తమ గ్రామపంచాయతీ
43 నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తమ మున్సిపాల్టీ
44 యానాల లక్ష్మి ఉత్తమ రైతు
45 డి. లింబన్న ఉత్తమ ఉపాధ్యాయుడు పీజీ హెడ్మాస్టర్
46 రామావత్ హనుమ ప్రత్యేక క్యాటగిరీ ప్రమాదం నుంచి 15 మందిని రక్షించినందుకు
47 ప్రత్యూష ప్రత్యేక క్యాటగిరీ అంటార్కిటికా యాత్ర చేసినందుకు
48 బాలేశ్వర్ సామాజిక సేవ అనాథ శిశుసేవ

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 14 June 2018. Retrieved 14 June 2018.
  2. ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 14 June 2018.[permanent dead link]
  3. మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 14 June 2018.[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]