పురాణం రమేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పురాణం రమేష్
జననంశాయంపేట, శాయంపేట మండలం, వరంగల్ గ్రామీణ జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధికూనపులి పటం కథ కళాకారుడు
మతంహిందూ
తండ్రిఎర్రగట్టు
తల్లిగంగమ్మ

పురాణం రమేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కూనపులి పటం కథ కళాకారుడు.[1][2] కూనపులి కళ అంతరించిపోకుండా అనేక ప్రదర్శనలిస్తున్న రమేష్‌ను తెలంగాణ ప్రభుత్వం 2018, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ పురస్కారం ఇచ్చి గౌరవించింది.[3]

కుటుంబ నేపథ్యం[మార్చు]

ఈయన పురాణం ఎర్రగట్టు, గంగమ్మ దంపతులకు వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం, శాయంపేట గ్రామంలో జన్మించాడు. రమేష్ తండ్రి ఎర్రగట్టు కూనపులి పటం కథ ప్రదర్శనలు ఇచ్చేవాడు.[4] రమేష్ ఇద్దరు భార్యలు వనమాల, దేవిలతోపాటు కుమారులు చంద్రశేఖర్‌, వెంకటేశంలు కూనపులి కథలో డోలక్‌, హార్మోనియం వాయిస్తూ తనకు సహాయకులుగా ఉంటారు.[5]

కూనపులి ప్రదర్శన[మార్చు]

రమేష్ తండ్రి ఎర్రగట్టు చిన్నప్పటి నుండి తన తండ్రుల వారసత్వంగా భక్తమార్కండేయ పద్మశాలి కులస్తుల జీవిత చరిత్రను పటం ఆధారంగా కూనపులి కథగా చెప్పేవాడు. ఎర్రగట్టు వారసత్వంగా తన కుమారుడు పురాణం రమేష్‌ను కూనపులి కళాకారునిగా తయారు చేశాడు. వరంగల్‌ జిల్లాతో పాటు ఇరుగుపొరుగు జిల్లాలైన కరీంనగర్‌, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కూనపులి ప్రదర్శనలిస్తున్నాడు.[6]

వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్‌ మొదలైన జిల్లాల్లో కూనపులి ప్రదర్శనలిచ్చాడు. ప్రస్తుతం కూనపులి కథను చెప్పించుకునే వారు లేకపోవడంతో రమేష్ కుటుంబం వేర్వేరు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

పురస్కారాలు[మార్చు]

 1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది.[7][8]
 2. 2015 జూన్‌ 2న తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శాయంపేట మండలస్థాయి జానపద కళాకారుడిగా ఎంపిపి బాసాని రమాదేవి, ఎంపిడిఓ బానోతు భద్రూలు చేతులమీదుగా రూ.10వేల నగదు అవార్డుతో పాటు శాలువా మెమొంటోతో అవార్డు
 3. మహాత్మా పూలే ఫౌండేషన్‌ ట్రస్టు ప్రశంసాపత్రం, షీల్డ్‌ (రవీంద్రభారతిలో ప్రదర్శనకు)
 4. భాషా సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ చేతులమీదుగా అవార్డు (రవీంద్రభారతిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలలో కూనపులి ప్రదర్శనకు)
 5. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేతులుమీదుగా అవార్డు

ఇతర వివరాలు[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం నుండి 2014లో ఏలె లక్ష్మణ్ కూనపులి పటం కథపై చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ లో పురాణం రమేష్‌ కథ చెప్పాడు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ప్రోత్సాహంతో రవీంద్రభారతిలో, గోదావరి పుష్కరాలులో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, ఆగస్టు 15 వంటి వివిధ కార్యక్రమాల్లో కూనపులి పటం కథలను చెప్పాడు.

మూలాలు[మార్చు]

 1. నవతెలంగాణ, వరంగల్-స్టోరి (26 November 2015). "అంతరించిపోతున్న కూనపులి పటం కథలు". NavaTelangana. Archived from the original on 5 సెప్టెంబర్ 2019. Retrieved 5 September 2019. Check date values in: |archivedate= (help)
 2. Deccan Chronicle, Life Style (1 October 2015). "A Scroll back to the past". Priyanka Praveen. Archived from the original on 6 సెప్టెంబర్ 2019. Retrieved 27 April 2020. Check date values in: |archivedate= (help)
 3. మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 5 September 2019.[permanent dead link]
 4. నవతెలంగాణ, జాతర-స్టోరి (21 April 2015). "కూనపులి అంతరించాల్సిందేనా?". NavaTelangana. డా. బసాని సురేష్‌. Archived from the original on 6 సెప్టెంబర్ 2019. Retrieved 6 September 2019. Check date values in: |archivedate= (help)
 5. The Hindu, Telangana (27 November 2016). "Keeping alive a dying art form" (in ఆంగ్లం). Archived from the original on 6 సెప్టెంబర్ 2019. Retrieved 27 April 2020. Check date values in: |archivedate= (help)
 6. నవ తెలంగాణ, స్టోరి (1 June 2018). "పురాణం రమేష్‌ ప్రతిభకు గుర్తింపు". NavaTelangana. Archived from the original on 3 జూన్ 2018. Retrieved 27 April 2020. Check date values in: |archivedate= (help)
 7. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 17 June 2018. Retrieved 5 September 2019.
 8. ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 5 September 2019.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]