ఆడెపు లక్ష్మీపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడెపు లక్ష్మీపతి
సండే సినిమాలో మాట్లాడుతున్న ఆడెపు లక్ష్మీపతి
జననంమార్చి 5, 1955
కరీంనగర్
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధికథా రచయిత
మతంహిందూ

ఆడెపు లక్ష్మీపతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కథా రచయిత. ఈయన 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.

జననం[మార్చు]

లక్ష్మీపతి 1955, మార్చి 5న కరీంనగర్ జిల్లాలోని చేనేత కుటుంబంలో జన్మించాడు.

ఉద్యోగం[మార్చు]

లక్ష్మీపతిని సత్కరిస్తున్న వి. ప్రకాశ్, మామిడి హరికృష్ణ

రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో 30 సంవత్సరాలపాటు ఉద్యోగంచేసి 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.

రచనా ప్రస్థానం[మార్చు]

ప్రగతి సచిత్ర వార పత్రిక నుండి 1972, జూన్ 26న వెలువడిన సంచికలో ఈయన రాసిన మొదటి కథ 'ఆదర్శం' అచ్చయింది. ఇప్పటివరకు దాదాపుగా 25కు పైగా కథలు రచించాడు. వీటిల్లో కొన్ని కథలు ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి.

విమర్శవ్యాసాలు, నూతన ధోరణులపై విశ్లేషణలు కూడా రాశాడు. రాజీవ్ విద్యా మిషన్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురణల విభాగం, డైమండ్స్ పాకెట్ బుక్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొదలైన సంస్థలకు ఇంగ్లీష్, హిందీ భాషలనుండి తెలుగులోకి అనేక అనువాదాలు చేశాడు.

తెలుగు అకాడమి కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ రాజకీయ ప్రసంగాల ప్రధానభాగం, తెలంగాణలో ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమీషన్ అధ్యయన నివేదికలను తెలుగులోకి అనువదించాడు.

బహుమతులు[మార్చు]

  1. జీవనృతుడు - ప్రథమ బహుమతి (విపుల మాసపత్రిక కథలపోటి, 1995)
  2. నాలుగు దృశ్యాలు (కథల సంపుటి) - రావిశాస్త్రి స్మారక సాహితీ పురస్కారం, 1997

పురస్కారాలు[మార్చు]

  1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది.[1][2][3]

గుర్తింపులు[మార్చు]

  1. కథాసాహితీ వారి 'కథ - 2015' కు గెస్ట్ ఎడిటర్
  2. తానా నవలల పోటి - 2017కు న్యాయనిర్ణేత

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (31 May 2018). "రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 17 June 2018. Retrieved 2 September 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 14 జూన్ 2018 suggested (help)
  2. ఆంధ్రజ్యోతి (31 May 2018). "విశిష్ట పురస్కారాలు". Retrieved 2 September 2018.[permanent dead link]
  3. మనం న్యూస్ (6 June 2018). "తెలంగాణ కళకు ఘనసత్కారం". Retrieved 2 September 2018.[permanent dead link]