రవ్వా శ్రీహరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ రవ్వా శ్రీహరి
మాతృభాషలో పేరురవ్వా శ్రీహరి
జననంరవ్వా శ్రీహరి
(1943-09-12) 1943 సెప్టెంబరు 12 (వయస్సు: 75  సంవత్సరాలు)
నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామం
జాతీయతభారతీయుడు
చదువుఎం.ఎ., పి.హెచ్.డి
వృత్తిమాజీ ఉపకులపతి
సంస్థద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
ప్రసిద్ధులునిఘంటుకర్త, వ్యాకరణవేత్త
శీర్షికమహామహోపాధ్యాయ
మతంహిందూ
జీవిత భాగస్వామిఅనంతలక్ష్మి
పురస్కారాలుసి.పి.బ్రౌన్ పురస్కారం

రవ్వా శ్రీహరి ఆధునిక తెలుగు నిఘంటుకర్త. సంస్కృత విద్యాభ్యాసం, తెలుగులో ఉన్నత విద్య, పరిశోధన, విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిపాలనలలో రాణించాడు.[1].

జననం-విద్యాభ్యాసం-వృత్తి[మార్చు]

నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్‌ లోని సీతారాంబాగ్‌లో కల సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివాడు. శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నాడు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడుగా చేశాడు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా 1967 లో పనిచేశాడు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నాడు[2]. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించిన శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి 2002 లో ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు.[3]. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు.

రచనలు[మార్చు]

రచనా ప్రక్రియలో మాత్రం తెలుగు రచనలకు పెద్దపీట వేసి 50 వరకు గ్రంథాలను వెలువరించాడు. సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు.పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాల మీద తనదైన ముద్రవేశాడు.

నిఘంటువులు[మార్చు]

 1. శ్రీహరి నిఘంటువు
 2. అన్నమయ్య పదకోశం
 3. సంకేత పదకోశం
 4. వ్యాకరణ పదకోశము (బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి)
 5. నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం

విమర్శా గ్రంథాలు[మార్చు]

 1. ఉభయ భారతి[4]
 2. అన్నమయ్య సూక్తివైభవం
 3. అన్నమయ్య భాషావైభవం
 4. తెలుగులో అలబ్ధవాఙ్మయం
 5. సాహితీ నీరాజనం
 6. తెలుగు కవుల సంస్కృతానుకరణలు
 7. వాడుకలో తెలుగులో అప్రయోగాలు
 8. తెలంగాణా మాండలికాలు - కావ్యప్రయోగాలు
 9. నల్లగొండజిల్లా ప్రజలభాష

వ్యాకరణ గ్రంథాలు[మార్చు]

 1. సిద్ధాన్త కౌముది
 2. అష్టాధ్యాయీ వ్యాఖ్యానం

ఇతర గ్రంథాలు[మార్చు]

 1. శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రమ్, నామావళి
 2. అలబ్ధ కావ్య పద్య ముక్తావళి
 3. సంస్కృతన్యాయదీపిక

పురస్కారాలు[మార్చు]

 1. తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారిచే మహామహోపాధ్యాయ బిరుద ప్రదానం
 2. 2013లో సి పి బ్రౌన్ పురస్కారం[1]
 3. 2013లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి విశిష్ట పురస్కారం
 4. 2014లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి గిడుగు రామ్మూర్తి పురస్కారం[5]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "బ్రౌన్ పురస్కారం-2013". pustakam.net/?p=15682. pustakam.net. Retrieved 2015-04-18.
 2. బూదాటి వేంకటేశ్వర్లు. "మహామహోపాధ్యాయ". సరసభారతి ఉయ్యూరు. Retrieved 18 April 2015.
 3. "సంస్కృతాంధ్రాల వారధి ఆచార్య శ్రీహరి". newshunt.com. http://m.newshunt.com/india/telugu-newspapers/sakshi/home/samskrutaandhraala-vaaradhi-aachaarya-shrihari_36045535/c-in-l-telugu-n-sakshi-ncat-Home. 
 4. రవ్వా శ్రీహరి (1996). ఉభయ భారతి (1 ed.). హైదరాబాదు: వరరుచి పబ్లికేషన్స్. Retrieved 18 April 2015.
 5. "రవ్వా శ్రీహరికి గిడుగు పురస్కారం ఇవ్వనున్న తానా". తెలుగు టైమ్స్ అంతర్జాల పత్రిక. 2012-12-17. Retrieved 18 April 2015.