అమర్ సింగ్ చంకీలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్ సింగ్ చంకీలా
జన్మ నామంధనీ రామ్
ఇతర పేర్లుఅమర్ సింగ్ చంకీలా
జననం(1961-07-21)1961 జూలై 21
డుగ్రి, పంజాబ్
మరణం1988 మార్చి 8(1988-03-08) (వయస్సు 26)
మేసుంపూర్, పంజాబ్
సంగీత శైలిపంజాబీ యుగళ గీతాలు, ఏకాంత గీతాలు, ధార్మిక గీతాలు
వృత్తిగాయకుడు, గేయ రచయిత, వాయిద్యకారుడు, సంగీత దర్శకుడు
వాయిద్యాలుగాత్రం, తుంబి, హార్మోనియం, డోలక్
క్రియాశీల కాలం1979–1988
లేబుళ్ళుHMV
సంబంధిత చర్యలుచంకీలా & అమరజ్యోత్, సురీందర్ సోనియా, మిస్ ఉష
వెబ్‌సైటుwww.amarsinghchamkila.com

అమర్ సింగ్ చంకీలా (21 జూలై, 1961 – 1988 మార్చి 8) ప్రముఖ పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు ధనీ రాం. మార్చి 8, 1988లో చంకీలా,, అతని భార్య అమర్ జ్యోత్, అతని బృందంలోని మరో ఇద్దరిని కొంతమంది గుర్తు తెలియని యువకులు హత్య చేశారు.

చంకీలా పంజాబ్లో బాగా వేదికల మీద పాడటంలో పేరొందిన గాయకుడు. ఆయన పాటల్లో ఎక్కువగా అతను పుట్టి పెరిగిన పంజాబ్ పల్లె వాసుల జీవన విధానం ఎక్కువగా కనబడుతూ ఉండేది. పల్లెల్లోని అక్రమ సంబంధాలు, మద్యపానం, మత్తు పదార్థాల వాడకం, పంజాబీల సహజమైన రోషం లాంటివి అతని పాటల్లో ముడి సరుకులుగా ఉండేవి. అతను వివాదాస్పదంగా కూడా ప్రాచుర్యం పొందాడు. అతన్ని విమర్శించే వాళ్ళు అతని సంగీతం అసభ్యంగా ఉంటుందని విమర్శిస్తే, సమర్ధించే వాళ్ళు అతను అసలైన పంజాబీ జీవన విధానాన్ని సంగీతంతో కళ్ళకు కడుతున్నాడని భావించారు.