జనమంచి శేషాద్రి శర్మ

వికీపీడియా నుండి
(జనమంచి శేషాద్రిశర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జనమంచి శేషాద్రిశర్మ
జనమంచి శేషాద్రిశర్మ చిత్రపటం.
జననంజనమంచి శేషాద్రిశర్మ
జూలై 4, 1882
కడపజిల్లా, పోరుమామిళ్లమండలం, వెంకటరామాపురంఅగ్రహారం
మరణంజూలై, 1950
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి,పండితుడు
మతంహిందూ
పిల్లలుజనమంచి శివ కుమార శర్మ (దత్త పుత్రుడు)
తండ్రిసుబ్రహ్మణ్యశర్మ
తల్లికామాక్షమ్మ

జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) ( జూలై 4, 1882 - జూలై, 1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు.

జీవిత సంగ్రహం[మార్చు]

వీరు 1882 సంవత్సరంలో జూలై 4వ తేదీన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని మరియు కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి మరియు పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం వైఎస్ఆర్ జిల్లా బద్వేలు తాలూకా వెంకటరాయపురం అగ్రహారం. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాతి కాలంలో కాశీ కాలినడకన వెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు విద్యా వ్యాసంగం చేశారు. తరువాత విజయనగరంలోను మరియు కసింకోట మొదలైన ప్రాంతాలలో విద్యా తపస్విగా నివసించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. వీరు మొదట సి.ఎస్.బి. హైస్కూలులో తెలుగు పండితునిగా పనిచేసి, అక్కడ నుండి కర్నూలు కోల్స్ మెమోరియల్ హైస్కూలులో పనిచేసి, చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడపలో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు.

వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.

వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి','అభినవ నన్నయభట్టు', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', 'కళాప్రపూర్ణ', 'మహాకవి', 'సంస్కృతసూరి', 'కైజర్ హింద్' మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు.[1]

రచనలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

శేషాద్రి శర్మ ఈ క్రింది సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువదించారు.[2]

స్వతంత్ర రచనలు[మార్చు]

 • శ్రీమదాంధ్ర లలితోపాఖ్యానము
 • హనుమద్విజయము
 • సర్వమంగళా పరిణయం
 • ధర్మసార రామాయణం[4]
 • కలివిలాసం
 • సత్ప్రవర్తనము
 • శ్రీ రామావతార తత్త్వము
 • శ్రీ కృష్ణావతార తత్త్వము
 • శ్రీకృష్ణ రాయబార చరిత్రము
 • శ్రీ శంకరాచార్య చరిత్రము
 • తండ్లత
 • వనజాక్షి
 • హృదయానందం
 • దుష్ ప్రభుత్వము
 • నవరత్ర హారము
 • నీటుకత్తె
 • గిరీశవిజయము
 • విచిత్ర పాదుకాపట్టాభిషేకం
 • నీతిసింధువు
 • నీతిరత్నాకరము
 • మనుచరిత్ర పరిశోధనము
 • భగవద్గీత (వచనము)
 • ఉత్తమమార్గము
 • విచిత్రరామాయణము
 • ఉదయగిరిముట్టడి
 • కడపమండలచరిత్ర
 • శ్రీరామవనవాసము
 • విహంగవిజయము
 • స్వప్నయాత్ర
 • నీతికథావళి

మూలాలు[మార్చు]

 • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
 • రాయలసీమ రచయితల చరిత్ర, మొదటి సంపుటి, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం 101వపేజీ.