Jump to content

పరాభవ

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

పరాభవ తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం విశ్వావసు, తర్వాత సంవత్సరం ప్లవంగ. పరాభవలో పరా అంటే పరా భట్టారిక(లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు, పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు, సామరస్య స్వరూపముతో, తమ బిడ్డలు రక్షిస్తారని అర్థం. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1906-1907, 1966-1967లో వచ్చిన తెలుగు సంవత్సరానికి పరాభవ అని పేరు.

2026 : పరాభవ నామ సంవత్సరం 19 మార్చి 2026 గురువారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  7 ఏప్రిల్ 2027 బుధవారం ప్లవంగ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంటుంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "పరాభవ"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
40 పరాభవ 46-47 106-107 166-167 226-227 286-287 346-347 406-407 466-467 526-527 586-587 646-647 706-707 766-767 826-827 886-887 946-947 1006-1007 1066-1067 1126-1127 1186-1187 1246-1247 1306-1307 1366-1367 1426-1427 1486-1487 1546-1547 1606-1607 1666-1667 1726-1727 1786-1787 1846-1847 1906-1907 1966-1967 2026-2027 2086-2087 2146-2147 2206-2207 2266-2267 2326-2327 2386-2387 2446-2447 2506-2507 2566-2567 2626-2627 2686-2687 2746-2747 2806-2807

సంఘటనలు

[మార్చు]
  • పరాభవ నామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి నాడు శ్రీరామునికి ఉపనయనము జరిగింది.[3]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. ↑ "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పరాభవ&oldid=4965728" నుండి వెలికితీశారు