ఆనంద
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ..... 1854 - 1855, 1914-1915, 1974-1975, 2034 - 2035 .....ఇలా 60 సంవత్సరాలకొకసారి వచ్చే తెలుగు సంవత్సరానికి ఆనంద అని పేరు.[1] 1854 మార్చి 29[2] నుండి 1855 మార్చి 16[3] వరకు, 1914 మార్చి 27[4] నుండి 1915 మార్చి 15,[5] 1974 మార్చి 24 [6] నుండి 1975 ఏప్రిల్ 11 [7] వరకు...ఇలా 60 సంవత్సరాలకొకసారి వచ్చే ఉగాదితో ఈ సంవత్సరం ప్రారంభమై తరువాతి సంవత్సరం ఉగాది ముందు రోజు తిథి వరకు ఉంటుంది.
సంఘటనలు
[మార్చు]- చైత్ర శుద్ధ షష్ఠి - ఆంధ్రపత్రిక దినపత్రికగా మద్రాసు నుండి ప్రచురణ ప్రారంభించింది.
- శ్రీ భారతీ తీర్థ స్వాములవారిని శ్రీ శృంగేరి శంకర పీఠానికి ఉత్తరాధిపతిగా నియమించవలెనని ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి ( 1974 నవంబరు 11) నాడు నిర్ణయించారు
- 1854: జూలై 7 – కొవాస్జీ నానాభాయ్ దావర్, భారతదేశపు మొట్టమొదటి ది బాంబే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీని స్థాపించారు.
- 1854: జూలై 19 – భారత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చెయ్యాలని చెబుతూ చార్లెస్ వుడ్ డల్హౌసీకి లేఖ రాసాడు.
- 1974: జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.
- 1974: ఆగష్టు 24: భారత రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ పదవిని చేపట్టాడు.
- 1974: సెప్టెంబర్ 1: ఏడవ ఆసియా క్రీడలు ఇరాన్ రాజధాని నగరం టెహరాన్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- చైత్ర బహుళ తదియ: శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి (13-4-1914) నాడు జన్మించాడు.
- క్రీ. శ. 1854: శ్రావణ శుద్ధ పంచమి : వడ్డాది సుబ్బారాయుడు ప్రముఖ రచయిత, నాటకకర్త.
- క్రీ. శ. 1854: ఏప్రిల్ 12: సేలం పగడాల నరసింహులునాయుడు, తమిళనాడుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త. (మ. 1922)
- క్రీ. శ. 1854: ఏప్రిల్ 29: హెన్రీ పోయిన్కరే, ఫ్రెంచి గణితవేత్త, భౌతిక శాస్త్రవేత్త
- క్రీ. శ. 1854: జూలై 30: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (మ.1938)
- క్రీ. శ. 1854: ఆగస్టు 27:గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు (మ. 1938)
- క్రీ. శ. 1854: అక్టోబర్ 16: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (మ.1900)
- క్రీ. శ. 1854: నవంబరు 21: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
- క్రీ. శ. 1914:మార్చి 28: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)
- క్రీ. శ. 1914:ఏప్రిల్ 3: మానెక్షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008)
- క్రీ. శ. 1914:ఏప్రిల్ 13: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)
- క్రీ. శ. 1914:మే 18: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010)
- క్రీ. శ. 1914:జూన్ 20: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (మ.1972)
- క్రీ. శ. 1914:ఆగష్టు 10: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (మ.1977)
- క్రీ. శ. 1914:ఆగష్టు 15: పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)
- క్రీ. శ. 1914:ఆగష్టు 21: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (మ.1991)
- క్రీ. శ. 1914:సెప్టెంబర్ 5: నికొనార్ పారా, చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త.
- క్రీ. శ. 1914:సెప్టెంబర్ 7: జరుక్ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968)
- క్రీ. శ. 1914:సెప్టెంబర్ 9: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002)
- క్రీ. శ. 1914:సెప్టెంబర్ 23: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
- క్రీ. శ. 1914:అక్టోబర్ 5: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950)
- క్రీ. శ. 1914:అక్టోబర్ 10: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (మ.1993)
- క్రీ. శ. 1914:అక్టోబర్ 18: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (మ.1987)
- క్రీ. శ. 1914:నవంబర్ 13:హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
- క్రీ. శ. 1914:డిసెంబర్ 14: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
- క్రీ. శ. 1914:డిసెంబర్ 26: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008)
- క్రీ. శ. 1915 జనవరి 4: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996)
- క్రీ. శ. 1915 జనవరి 15: చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితులు. [మ.1994]
- క్రీ. శ. 1915 జనవరి 23: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
- క్రీ. శ. 1915 ఫిబ్రవరి 5: గరికపాటి రాజారావు తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ దర్శకుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. [మ. 1963]
- క్రీ. శ. 1915 ఫిబ్రవరి 22: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968)
- క్రీ. శ. 1974: ఏప్రిల్ 9: జెన్నా జేమ్సన్, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శృంగార తార.
- క్రీ. శ. 1974:మే 25: యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త.
- క్రీ. శ. 1974:జూన్ 15: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (మ.2014)
- క్రీ. శ. 1974:ఆగష్టు 5: కాజోల్, భారతీయ సినీ నటి.
- క్రీ. శ. 1974:ఆగష్టు 20: ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు.
- క్రీ. శ. 1974:నవంబర్ 1: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు.
- క్రీ. శ. 1974:డిసెంబర్ 2: అపూర్వ, తెలుగు సినిమా నటి.
- క్రీ. శ. 1975:మార్చి 12: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.
మరణాలు
[మార్చు]- క్రీ. శ. 1855:ఫిబ్రవరి 23 : కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ -జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు (జ.1777)
- క్రీ. శ. 1855:మార్చి 2 : రష్యా చక్రవర్తి నికోలస్ I. (జ.1796)
- క్రీ. శ. 1915: ఫిబ్రవరి 19: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)
- క్రీ. శ. 1974:ఏప్రిల్ 18: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
- క్రీ. శ. 1974:జూలై 18: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
- క్రీ. శ. 1974:జూలై 24: జేమ్స్ చాడ్విక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- క్రీ. శ. 1974:ఆగష్టు 7: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883)
- క్రీ. శ. 1974:సెప్టెంబర్ 23: జయచామరాజ వడయార్ బహదూర్, మైసూర్ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
- క్రీ. శ. 1974:అక్టోబర్ 2: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
- క్రీ. శ. 1974:అక్టోబర్ 9: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)
- క్రీ. శ. 1974:నవంబర్ 11: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921)
- క్రీ. శ. 1974:నవంబర్ 13: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
- క్రీ. శ. 1974:నవంబర్ 25: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909)
- క్రీ. శ. 1974:నవంబర్ 27: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
- క్రీ. శ. 1974:డిసెంబరు 15: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)
- క్రీ. శ. 1975:ఫిబ్రవరి 3: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
- క్రీ. శ. 1975:ఫిబ్రవరి 14: పి.జి.ఉడ్హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)
- క్రీ. శ. 1975:ఫిబ్రవరి 24: ఈలపాట రఘురామయ్య, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (జ.1901)
మూలాలు
[మార్చు]- ↑ "తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయి?". www.eenadu.net. Archived from the original on 2021-04-18. Retrieved 2021-04-18.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1854 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1855 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1914 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1915 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1974 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
- ↑ LLP, Adarsh Mobile Applications. "1975 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.