యూ థాంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూ థాంట్
యూ థాంట్

Thant pictured in 1968.


పదవీ కాలం
నవంబరు 30, 1961 – డిసెంబరు 31, 1971
ముందు Dag Hammarskjöld
తరువాత Kurt Waldheim

వ్యక్తిగత వివరాలు

జననం (1909-01-22)1909 జనవరి 22
Pantanaw, British Burma, British India
మరణం 1974 నవంబరు 25(1974-11-25) (వయసు 65)
New York City, United States
విశ్రాంతి స్థలం Tomb south of Shwedagon Pagoda, Yangon, Burma (Myanmar)
జాతీయత Burmese
తల్లిదండ్రులు
  • Po Hnit
  • Nan Thaung
జీవిత భాగస్వామి Daw Thein Tin
సంతానం
  • Maung Bo
  • Tin Maung Thant
  • Aye Aye Thant
మతం Theravada Buddhism

యూ థాంట్ (జనవరి 22, 1909 - నవంబర్ 25, 1974) (U Thant ) ఐక్యరాజ్య సమితి యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్.

జననం[మార్చు]

ఇతడు 1909, జనవరి 22 న దిగువ బర్మా (ప్రస్తుత మయాన్మార్) లోని పాంటనావ్‌లో జన్మించాడు. డాగ్ హమ్మర్స్ జోల్డ్ సెప్తెంబర్ 1961లో విమాన ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ 1971 వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆసియా ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చారు.

యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం) లో ఉన్నత విద్య అభ్యసించాడు. 1928-31 కాలంలో ఉపాధ్యాయుడిగా, 1931-47 కాలంలో పాంటనావ్ జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసాడు. 1948లో బర్మా గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి యు ను (U Nu) అభ్యర్థనపై 1949లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసాడు. 1949-53 కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-57 వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యును ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించాడు. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించాడు. ఈ సదస్సే అలీన రాజ్యాల ఉద్యమంకు ఊపిరిపోసింది. 1957లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1966లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. 1971లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించాడు.

మరణం[మార్చు]

1974, నవంబర్ 25న్యూయార్క్లో మరణించాడు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యూ_థాంట్&oldid=3888572" నుండి వెలికితీశారు