భావరాజు నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భావరాజు నరసింహారావు (అక్టోబర్ 10, 1914 - నవంబర్ 27, 1993) బహుముఖ ప్రజ్ఞాశీలి. ఈయన ప్రముఖ రచయిత, ప్రచురణకర్త మరియు పత్రికా సంపాదకుడు, నాటక రచయిత మరియు నటుడు.

జననం[మార్చు]

వీరు అక్టోబర్ 10, 1914లో బందరులో జన్మించాడు. వీరు 1930లో సారస్వత మండలి మరియు 1936లో పాత్రికేయుల సంఘం ఏర్పాటుచేశాడు. ఈయన త్రివేణి పబ్లిషర్స్ ఏర్పాటు చేసి అనేక తెలుగు గ్రంథాలను ప్రచురించాడు. బందరులో త్రివేణి ప్రెస్ స్థాపించాడు.

1946 సంవత్సరంలో త్రివేణి అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. కోలవెన్ను రామకోటీశ్వరరావు స్థాపించిన ఈ పత్రికను ఆయన నలభై సంవత్సరాలు సంపాదకులుగా నిర్వహించి, అవసాన దశలో కంటి చూపు తగ్గి ఆర్థిక ఇబ్బందులు పెరిగి పత్రిక నడపటం కష్టమైనపుడు పత్రికా నిర్వహణ బాధ్యతలను భావరాజు నరసింహారావుకు అప్పజెప్పాడు. నరసింహారావు ఇరవై ఐదు సంవత్సరాలు సంపాదకులుగా పత్రికను సమర్ధవంతంగా నడిపాడు.[1]

మరణం[మార్చు]

వీరు నవంబర్ 27, 1993లో హైదరాబాద్లో పరమపదించాడు.

గౌరవాలు[మార్చు]

మూలాలు[మార్చు]