అంజనీబాయి మాల్పెకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంజనీబాయి మాల్పెకర్ (22 ఏప్రిల్ 18837 ఆగష్టు 1974), ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలో భెండిబజార్ గరానా శైలికి చెందినది. ఆమె ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు. దాదాపు 8ఏట నుంచీ నజీర్ ఖాన్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకుంది అంజనీ. ముంబైలో 16వ ఏట ప్రొఫెషనల్ గా కెరీర్ ప్రారంభించి, జీవితాంతం ముంబైలోనే ఉండిపోయింది. 1920 వరకు ఆమె సంగీత కెరీర్ చాలా బాగా సాగింది. అయితే ఆమె గురువు చనిపోవడంతో ప్రజా ప్రదర్శనలకు దూరంగా ఉంది. అయితే 1923 తరువాత పూర్తిగా ప్రదర్శనలు ఇవ్వడం మానేసింది అంజనీ. అప్పట్నుంచీ ఆమె తన శిష్యులకు శిక్షణ ఇవ్వడంలోనే మునిగిపోయింది. ఆమె శిష్యులు కుమార్ గాంధర్వకిషోరీ అమోంకర్ వంటి వారు ఎంతో ప్రసిద్ధి చెందారు.

1958లో, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు ఇచ్చే సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొట్టమొదటి మహిళగా నిలిచింది అంజనీబాయి.

ఆమె యవ్వనంలో చాలా అందంగా ఉండటంతో ప్రముఖ భారతీయ చిత్రకారులు రాజా రవి వర్మ, ఎం.వి.ధురంధర్ లు ఆమె రూపాన్ని పోల్చుతూ చిత్రాలు వేసేవారు.

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం[మార్చు]

గోవాలోని మాల్పేలో 22 ఏప్రిల్ 1883లో కొంకణి భాష మాట్లాడే గోవా సంగీత ప్రియుల కుటుంబంలో జన్మించింది అంజనీబాయి. ఆమె తాత గుజాబాయి, తల్లి నబుబాయిలు సంగీత ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినవారు.[1] తన 8వ ఏట ఉస్తాద్ నజీర్ ఖాన్ వద్ద భెండిబజార్ గరానా శైలిలో సంగీత శిక్షణ తీసుకుంది అంజనీబాయి.[2] భెండి బజార్ గరానా మూలాలు మొరదాబాద్ గరానాలో ఉన్నాయి. ముంబైలోని భెండి బజార్ పేరు మీదుగా ఈ గరానాకు పేరు పెట్టారు.[3]

కెరీర్[మార్చు]

మోహిని(1894 లో రవివర్మ అంజనీ బాయిని పోల్చుతూ గీసిన చిత్రం).

1899లో తన 16వ ఏట ముంబైలో మొదటిసారి కచేరి చేసింది అంజనీబాయి. అప్పటికి మహిళలు ప్రదర్శనలు ఇచ్చేవారు కాదు. కానీ అంజనీ మాత్రం ప్రజా ప్రదర్శనలతో పాటు, రాజాస్థానాల్లోనూ కచేరీలు చేసేది. ఆమె తన కచేరీల ద్వారా ఎంతో గౌరవం సాధించుకుంది.[4]

మూలాలు[మార్చు]

  1. Mário Cabral e Sá (1997). Wind of fire: the music and musicians of Goa. Promilla & Co. pp. 163–164. ISBN 978-81-85002-19-4.
  2. Mohan Nadkarni (April 1999). The great masters: profiles in Hindustani classical vocal music. HarperCollins Publishers India. pp. 127–129. Retrieved 13 July 2013.
  3. Jeffrey Michael Grimes (2008). The Geography of Hindustani Music: The Influence of Region and Regionalism on the North Indian Classical Tradition. ProQuest. p. 160. ISBN 978-1-109-00342-0.
  4. Jerry Pinto; Naresh Fernandes (2003). Bombay, Meri Jaan: Writings on Mumbai. Penguin Books India. pp. 286–. ISBN 978-0-14-302966-3. Retrieved 6 August 2013.