కిషోరీ అమోంకర్
కిషోరీ అమోంకర్ | |
---|---|
జననం | 1932 ఏప్రిల్ 10 [1] |
మరణం | 2017 ఏప్రిల్ 3 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 84)
సంగీత శైలి | హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము |
వాయిద్యాలు | గాత్రము |
జీవిత భాగస్వామి | రవి అమోంకర్ |
పిల్లలు | 2 |
కిషోరీ అమోంకర్ (మరాఠీ: किशोरी आमोणकर; 1932 ఏప్రిల్ 10 - 2017 ఏప్రిల్ 3) ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. ఈమె జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడుతుంది.
జీవిత చరిత్ర
[మార్చు]కిషోరీ అమోంకర్ తల్లి, సుప్రసిద్ధ హిందుస్తానీ సంగీత గాయకురాలు, మేఘాబాయి కుర్దీకర్. కిషోరీ తల్లి వద్దనే సంగీతాన్ని అభ్యసించింది.
సంగీత ప్రస్థానం
[మార్చు]కిషోరీ అమోంకర్ జయ్‌పూర్-అత్రౌలి ఘరానా యొక్క క్లిష్టమైన సంగతులను త్వరలోనే ఆకళింపు చేసుకొని, తన స్వంత గాయన శైలిని రూపొందించుకొంది. ఈమె తన సహజమైన మధుర గాత్రంతో, పురాతన జయ్‌పూర్-అత్రౌలి ఘరానా సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా, అలవోకగా రాగాలను ఆలపించి, అటు సంగీత విద్వాంసులను, ఇటు శ్రోతలను ఆకట్టుకొంటుంది. ఆమె గాయనంలో బోల్తాన్, ఫిర్తాన్ ల సౌందర్యం చెక్కుచెదరదు. ఆమె హిందీమరియు మరాఠీ భక్తిగీతాలు, సంస్కృత, కన్నడ భజనల నెన్నింటినో పాడింది.
శిష్యగణం
[మార్చు]మానిక్ భిడె, పద్మా తల్వార్కర్, అరుణ్ ద్రావిడ్, రఘునందన్ పన్శీకర్, వయొలినిస్ట్, మిలింద్ రాయ్కర్, విద్యా భగ్‌వత్, మనవరాలు తేజశ్రీ అమోంకర్‌లు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కిషోరీ అమోంకర్ బడిపంతులు, రవి అమోంకర్‌ను పెళ్ళి చేసుకున్నది. ఈ దంపతులకు బిభాస్, నిహార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 1992లో, రవి అమోంకర్ మరణించాడు. కిషోరీ అమోంకర్ రాఘవేంద్ర స్వామి భక్తురాలు.
విడుదలైన ఆల్బంలు
[మార్చు]1. దివ్య (2008) 2. ప్రభాత్ (2000) 3. సాంప్రదాయ (2003) 4.మల్హార్ మాలిక 5. సంగీత్ సర్తాజ్ 6. కిషోరీ అమోంకర్ - లైవ్ ఇన్ లండన్ 7. దృష్టి 8. బాగెశ్రీ , భూప్ - ఎల్.పి. రికార్డు (1972)
అవార్డులు
[మార్చు]- పద్మ విభూషణ్ పురస్కారం ( 2002 )
- గాన సరస్వతి
- సంగీత నాటక అకాడమి అవార్డు ( 1985 )
- పద్మ భూషణ్ పురస్కారం ( 1987 )
- సంగీత సామ్రాజ్ఞి అవార్డు ( 1997 )
మరణం
[మార్చు]కిషోరీ అమోంకర్ ముంబైలోని తన నివాసంలో 2017 ఏప్రిల్ 3న తన 84వ ఏట నిద్రలోనే మరణించింది.[2]
బయటి లింకులు
[మార్చు]- ఆల్ అబౌట్ జాజ్ పత్రిక లో కిషోరీ అమోంకర్ గురించి
- http://www.chembur.com/anecdotes/kishori.htm
- ఇంక్రెడిబల్ పీపుల్ డాట్ కామ్ -కిషోరీ అమోంకర్
- http://www.imdb.com/name/nm0025163/
మూలాలు
[మార్చు]- ↑ "Semiosis in Hindustani music". Encyclopædia Britannica Online.
- ↑ "Classical music maestro Kishori Amonkar dies at 84". The GenX Times (in అమెరికన్ ఇంగ్లీష్). 4 April 2017. Archived from the original on 16 June 2018. Retrieved 4 April 2017.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- జయ్‌పూర్-అత్రౌలి ఘరానా
- హిందుస్థానీ సంగీత గాయకులు
- 1931 జననాలు
- 2017 మరణాలు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- భారతీయ మహిళా గాయకులు